స్కూల్లో సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?
1. కొత్తగా స్కూల్లో చేరుతున్నా, పైతరగతికి వెళ్తున్నా మీకు ఏ అవకాశాలు లభిస్తాయి?
1 మీరు కొత్తగా ఈ సంవత్సరమే స్కూల్లో చేరుతున్నా లేక పై తరగతికి వెళ్తున్నా, క్రైస్తవ పిల్లలుగా మీకు అక్కడ కొత్త సమస్యలు, ఒత్తిళ్లు ఎదురౌతాయి. అలాగే ‘సత్యాన్ని గురించి సాక్ష్యమిచ్చే’ కొత్త అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. (యోహా. 18:37) కాబట్టి సాక్ష్యమిచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా?
2. స్కూలుకు వెళ్ళడానికి మీరు ఏయే విధాలుగా సిద్ధపడ్డారు?
2 జీవితపు ప్రతీ రంగంలో మీరు విజయం సాధించగలిగేందుకు అవసరమైన శిక్షణను యెహోవా దేవుడు, మీ తల్లిదండ్రులు, నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు మీకు అందించారు. (సామె. 1:8; 6:20; 23:23-25; ఎఫె. 6:1-4; 2 తిమో. 3:16, 17) స్కూల్లో ఎలాంటి సమస్యలు ఎదురౌతాయో మీకు ఈపాటికే తెలిసి ఉండవచ్చు. దేవుని నియమాలు ఏమిటో మీకు తెలుసు, అలాగే స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో కూడా మీకు తెలుసు కాబట్టి, సాక్ష్యమిచ్చేందుకు సిద్ధంగా ఉండండి. (సామె. 22:3) గత తేజరిల్లు! పత్రికల్లో వచ్చిన లేదా అవేక్! పత్రికలో క్రమంగా వస్తున్న “యువత ఇలా అడుగుతోంది. . . ” ఆర్టికల్స్లోని ఉపదేశాన్ని, లేఖనాధార సూచనల్ని జాగ్రత్తగా చదవండి.
3. మీరు ఏయే విధాలుగా సాక్ష్యమివ్వవచ్చు?
3 మీరు చదివే స్కూల్లోనే అనేక రీతుల్లో సాక్ష్యమిచ్చే అవకాశం మీకు లభిస్తుంది. మీరు తయారయ్యే తీరు, మీ ప్రవర్తన, మాట, తోటి విద్యార్థులతో, టీచర్లతో మర్యాదగా మెలగడం, గ్రేడులు సంపాదించడం వంటివి ఇతరులు గమనించినప్పుడు, మీ జీవితానికి చక్కని పునాది ఉందని గ్రహించినప్పుడు కొందరు మిమ్మల్ని, “నువ్వు అందరిలా ఎందుకులేవు?” అని అడగవచ్చు. (మలా. 3:18; యోహా. 15:19; 1 తిమో. 2:9, 10) అలాంటి సందర్భాల్లో వారికి సాక్ష్యమిచ్చి, మీ నమ్మకాల గురించి వివరించే అవకాశం మీకు దొరకవచ్చు. సంవత్సరం పొడుగునా మీకు జాతీయ సెలవులు, పండుగల వంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తవచ్చు? మీరెందుకు వాటిలో పాల్గొనరని ఎవరైనా అడిగితే, “నా మత నమ్మకాలకు అది విరుద్ధం; నేనొక యెహోవాసాక్షిని” అని చెప్పి ఊరుకుంటారా? లేక ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ప్రేమగల తండ్రియైన యెహోవా గురించి సాక్ష్యమిస్తారా? యెహోవా ఇచ్చే నడిపింపుతో మీరు బాగా సిద్ధపడితే టీచర్లకు, తోటి విద్యార్థులకు లేదా ఇతరులకు మంచి సాక్ష్యమిస్తారు.—1 పేతు. 3:15.
4. స్కూల్లో మీరు చక్కగా నెగ్గుకు రాగలరని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?
4 స్కూలుకు వెళ్లాలంటే మొదట కాస్త భయమేసినా, సంవత్సరం పొడుగునా మీరు చక్కగా నెగ్గుకు రావాలని కోరుకునే చాలామంది మద్దతు మీకు ఉంటుంది. అంతేకాక, స్కూల్లో మీరు సాక్ష్యం ఇవ్వగల అవకాశాల విషయంలో మేము కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి, కొత్తగా స్కూల్లో చేరుతున్నా సరే, పై తరగతికి వెళ్తున్నా సరే ధైర్యంగా, సిద్ధంగా ఉండండి!