పాఠశాలలో మీ పిల్లలు స్థిరంగా ఉంటున్నారా?
1 “తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు.” (యిర్మీ. 10:23) మన పిల్లలు పాఠశాలలో ఎదుర్కొనే వత్తిళ్ళు, శోధనల విషయములో ఇదెంత వాస్తవం! క్రైస్తవ యౌవనులు ప్రతి విద్యా సంవత్సరము యెహోవా యెడల తమకున్న విశ్వాసము, యథార్థతా ప్రేమలు పరీక్షింపబడునని గుర్తిస్తున్నారు. సంఘములోని పిల్లలారా మీరు మీ పాఠశాలలో స్థిరంగా ఉంటున్నారా? తల్లిదండ్రులారా, రాబోవు శోధనల నిమిత్తము మీ పిల్లలనెట్లు మీరు దృఢపరచగలరు?
స్కూల్ బ్రోషూరును ఉపయోగించుడి
2 1983లో స్కూల్ బ్రోషూర్ క్రైస్తవ తల్లిదండ్రులకు బడికి వెళ్లే పిల్లలకొరకు ప్రత్యేకంగా విడుదల చేయబడింది. అది ఉపాధ్యాయులకు, నిర్వాహకులకు, యెహోవాసాక్షుల నమ్మకాలను అలవాట్లను గూర్చి వివరించుటకై తయారు చేయబడినది. ఎందుకనగా ఇవి పాఠశాల కార్యక్రమాలతో ముడిపడియున్నవి. అంతేగాక నీతిసూత్రాల విషయములో యెహోవాసాక్షుల ఐక్య స్థానాన్ని గూర్చిన నియమావళిని కూడ అందిస్తుంది.
3 అనేకమంది యౌవనులకు ఈ బ్రోషూరు నిజమైన రక్షణగా ఉంది. అవినీతిపరులుగా పేరుపొందియున్న వారి ద్వారా విద్యార్థులకు లైంగిక విద్యను గూర్చి బోధిస్తున్నారని ఒక సాక్షి దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె బ్రోషూరును తీసుకువెళ్లి లేఖనానుసారముగా తన అభ్యంతరాన్ని తెలిపి తన కూతురు నిమిత్తము క్లాసులో తగిన మార్పులు చేయించుకొనుటలో విజయము సాధించింది.
4 పాఠశాల ఆరంభము కాకముందే, తల్లిదండ్రులు పిల్లలతో బ్రోషూరులోని విషయాలను చర్చించి వాటిని జ్ఞాపకమునకు తెచ్చుకొనునట్లు వారి హృదయాలను మనస్సులను స్థిరపరచవచ్చును. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సు, గ్రేడ్, పాఠశాలను దృష్టినందుంచుకొని వారికి సంవత్సరము పొడవున ప్రత్యేకంగా సహాయపడే అంశాలను బ్రోషూరులో నుండి నొక్కి తెల్పుట మంచిది. (సామె. 14:15; 22:3) పిల్లవాడు ఎదుర్కొనే సమస్యగూర్చి వానితో ముందుగనే రిహార్సల్ చేయండి. ‘తన పాదములకు మార్గమును సరాళము చేయుటకు’ అవసరమైన సమాచారము అందులో ఎలా వివరించబడిందో వానితో ముందుగనే చర్చించండి.—హెబ్రీ. 12:13.
5 వారి వ్యక్తి గత అభిప్రాయములను, నిరీక్షణనుగూర్చి హేతువడుగు “ప్రతివానికి సమాధానమిచ్చుటకు” తల్లిదండ్రులు వారి పిల్లలకు ఎంతగానో సహాయపడవచ్చును. (1 పేతు. 3:15) కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు నేరుగా టీచరుతోనే మాట్లాడవచ్చును. కొందరు క్రైస్తవ తల్లిదండ్రులు అప్పుడప్పుడు పాఠశాలను సందర్శిస్తుంటారు. ఇందు మూలముగా వారికి ఉపాధ్యాయులకు మధ్య తత్సంబంధాలేర్పడుటకు దోహదపడును. ఆవిధంగా పిల్లలయెడల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గల సంబంధం బలపడుతుంది. కొందరు తల్లిదండ్రులు వారి అనుమతించినచోట పిల్లలతోపాటు క్లాసురూములో వారి చర్చా సమయాల్లో కూర్చొనుటకు యిష్టపడ్డారు. ఇందువల్ల పరిస్థితులను గ్రహించి మన పిల్లలు ఎదుర్కొను ప్రతిదిన వత్తిడులను నిజంగా అవగాహన చేసికొనుటకు వీలవుతుంది.—1 పేతు. 3:8.
ప్రతి దినము సాక్షిగానే ఉండుము
6 కొలొరోడ పట్టణములో ఒక చిన్న సాక్షి, ప్రతిరోజు తాను ఎక్జామినింగ్ ది స్క్రిప్చ్ర్స్ పుస్తకమును చదువుకొనునప్పుడు ఆ పుస్తకములోని కఠినపదాలను ఎలా ఉచ్చరించవలెనో తన టీచరును అడిగేవాడు. ఒకరోజు ఆ చిన్న పుస్తకము కనపడలేదు. తన టీచరు తనకు ఆరోగ్యము బాగాలేనందున ముందే పాఠశాలను వదలివెళ్లేటపుడు ఒక రోజుకొరకు మాత్రమే ఆ పుస్తకాన్ని “అరువుగా” తీసుకెళ్లిందని ఆ పిల్లవాడు తరువాత తెలుసుకొన్నాడు. ఆమె దినవచనము చదవకుండా ఉండలేకపోయింది. అందుచేత ఆమెకు కూడ ఎక్జామినింగ్ ది స్క్రిప్చ్ర్స్ అనే చిన్నపుస్తకము నొకదాన్ని ఇవ్వవలసి వచ్చింది.
7 విద్యాసంవత్సరములో పిల్లలు అనేక చిక్కులు, చింతలు ఎదుర్కొంటారనుట వాస్తవమే. అయినను సరియైన దృక్పథము మంచి సిద్ధపాటు ఉన్నట్లయితే, పాఠశాలలో పిల్లలున్నంతకాలము యెహోవా మహిమార్థమై తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరును “నిబ్బరమైన బుద్ధిగలవారై యుండుటకు” సహాయపడుతుంది.—1 పేతు. 1:13.