కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/09 పేజీ 3
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ అంటే ఏమిటి?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • పరిపాలక సభ ఒక చట్టపరమైన కార్పొరేషన్‌కు ఎలా భిన్నంగా ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఒక ప్రత్యేక ప్రకటన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఆరాధనా స్థలాలు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 4/09 పేజీ 3

ప్రశ్నాభాగం

◼ యెహోవాసాక్షులు ఉపయోగించే చట్టపరమైన కార్పోరేషన్ల లోగోలను సంఘాలు గానీ, వ్యక్తులు గానీ ఉపయోగించవచ్చా?

లోగో అంటే ఒక సంస్థను సులభంగా గుర్తించడానికి ఉపయోగించే పేరు లేదా గుర్తు. వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా, మన సంస్థ ఉపయోగించే ఇతర కార్పోరేషన్లు కావలికోట గుర్తును ఉపయోగిస్తున్నాయి. ఇండియాలోని యెహోవాసాక్షులకు సంబంధించిన ఉత్తరాల పైభాగంలో తెరచిన బైబిలు గుర్తు ఉంటుంది. అలాగే యెహోవాసాక్షులు ఉపయోగించే కార్పోరేషన్లకు వేరే గుర్తులు ఉన్నాయి.

సంఘాలు గానీ, వ్యక్తులు గానీ యెహోవాసాక్షులు ఉపయోగించే చట్టపరమైన కార్పోరేషన్ల పేర్లు, గుర్తులు లేదా అలాంటివేవీ రాజ్యమందిరాల్లో, రాజ్యమందిర బోర్డుల మీద, ఉత్తరాల్లో, వ్యక్తిగత వస్తువులపై ఉపయోగించకూడదు. అలాచేస్తే సంఘం, సంస్థ ఉపయోగించే చట్టపరమైన కార్పోరేషన్‌లు ఒకటేనని లేదా వాటిమధ్య సంబంధం ఉందని ప్రభుత్వాధికారులు, ప్రచారకులు, ఇతరులు పొరబడే అవకాశముంది. అలాగే ఉత్తరాల్లో ఆ గుర్తులను ఉపయోగిస్తే అవి ప్రపంచ ప్రధాన కార్యాలయం లేదా బ్రాంచి కార్యాలయం నుంచి వచ్చాయేమో లేకపోతే వాటి ఆమోదంతో వచ్చాయేమో అని పొరబడే అవకాశం కూడా ఉంది.

భవిష్యత్తులో నిర్మించబోయే ఏ రాజ్యమందిరంపైనా కావలికోట గుర్తును లేదా అలాంటిదేదీ పెట్టకూడదు. ఆ రాజ్యమందిరం వాచ్‌టవర్‌ సంస్థకు చెందినదైనా సరే అలా చేయకూడదు. ప్రస్తుతం అలాంటి గుర్తులు ఉన్న బోర్డులకు గానీ, రాజ్యమందిరానికి గానీ సంఘాలు తక్షణమే మార్పులు చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే దానికి పెద్ద మార్పులు చేయాల్సివస్తే బహుశా చాలా సమయం, శ్రమ, ఖర్చు అవసరమౌతుండవచ్చు. ఒకవేళ పెద్ద మార్పులేమీ చేయాల్సిన అవసరం లేకపోతే దాన్ని మార్చడం గురించి ఇప్పుడే ఆలోచించాలి. అలా కుదరకపోతే రాజ్యమందిరానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు, బోర్డు మార్చే సమయంలో మార్పులు చేస్తే సరిపోతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి