దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2009 ఏప్రిల్ 27వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2009 మార్చి 2 నుండి ఏప్రిల్ 27 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. మన మనస్సాక్షికి శిక్షణనిస్తూ, అది చెప్పేదానికి స్పందించడం గురించి యోసేపు వృత్తాంతం ఏమి ఉదాహరిస్తోంది? (ఆది. 39:7-12) [w07-TU 10/15 23వ పేజీ, 16వ పేరా]
2. మనపట్ల తప్పుచేసిన వారిని క్షమించడంలో యోసేపు ఎలా ఒక మంచి మాదిరిగా ఉన్నాడు? (ఆది. 45:4, 5) [w99-TU 1/1 31వ పేజీ, 2-3 పేరాలు]
3. “దండము,” “రాజదండము” వీటి భావమేమిటి? (ఆది. 49:10) [w04-TU 1/15 29వ పేజీ]
4. “మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెను” అని యోసేపు చెప్పడం ఎలాంటి ప్రభావం చూపించింది? (ఆది. 50:25) [w07-TU 6/1 28వ పేజీ, 10వ పేరా]
5. కష్టమైన నియామకాన్ని అందుకున్నప్పుడు మనకు ఏది నమ్మకాన్నిస్తుంది? (నిర్గ. 4:10, 13) [w04-TU 3/15 25వ పేజీ, 5వ పేరా]
6. ఫరోతో యెహోవా వ్యవహరించిన విధానంవల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఆ సంఘటనలు మనల్ని ఎలా ప్రభావితం చేయాలి? (నిర్గ. 9:13-16) [w05-TU 5/15 21వ పేజీ, 8వ పేరా]
7. మనకాలంలో కూడా ఏమి జరుగుతుందని నిర్గమకాండము 14:30, 31 చూపిస్తోంది? [w04-TU 3/15 26వ పేజీ, 6వ పేరా]
8. నిర్గమకాండము 16:1-3 చూపిస్తున్నట్లుగా ఫిర్యాదు చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏమిటి? [w06-TU 7/15 15వ పేజీ, 4-5 పేరాలు]
9. నిర్గమకాండము 19:5, 6లో పేర్కొనబడిన ధర్మశాస్త్ర నిబంధన షరతులకు అనుగుణంగా, ఇశ్రాయేలు ఎంతమేరకు “యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను” ఉందని చెప్పవచ్చు? [w95-TU 7/1 16వ పేజీ, 8వ పేరా]
10. లోభత్వం గురించి ఇవ్వబడిన పదవ ఆజ్ఞ మానవ నిర్మిత చట్టాల కంటే ఏ విధంగా ఉన్నతమైనది? (నిర్గ. 20:17) [w06-TU 6/15 23, 24 పేజీలు, 16వ పేరా]