కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/09 పేజీలు 1-2
  • వాళ్ళు ఎలా వింటారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్ళు ఎలా వింటారు?
  • మన రాజ్య పరిచర్య—2009
  • ఇలాంటి మరితర సమాచారం
  • సువార్తను ప్రకటించడంలో నిలుపుదల లేదు
    మన రాజ్య పరిచర్య—1996
  • మన పరిచర్యను మానక కొనసాగించుట
    మన రాజ్య పరిచర్య—1990
  • మనం పదే పదే ఎందుకు తిరిగి వెళతాం?
    మన రాజ్య పరిచర్య—2007
  • మానకుండా ప్రకటించండి
    మన రాజ్య పరిచర్య—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2009
km 1/09 పేజీలు 1-2

వాళ్ళు ఎలా వింటారు?

1 యెహోవా దినం త్వరగా సమీపిస్తోంది కాబట్టి, ఇంకా అనేకమంది దేవుని గురించి, మానవుల విషయంలో ఆయనకున్న సంకల్పం గురించి ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకొనేలా వారికి అత్యవసరంగా సహాయం చేయవలసిన అవసరం ఉంది. (యోహా. 17:3; 2 పేతు. 3:9, 10) కొన్నిసార్లు ఇది ఎంతో కష్టమైనదిగా అనిపించవచ్చు ఎందుకంటే చాలామంది ఉదాసీనంగా ఉంటున్నారు లేదా మనం చేసే ప్రకటనాపనిని బట్టి వాళ్ళు మనల్ని అపహాస్యం చేయవచ్చు. (2 పేతు. 3:3, 4) అయినప్పటికీ, ఒకసారి సువార్త వింటే దానిని అంగీకరించేవారు మన క్షేత్రంలో ఇంకా ఎంతోమంది ఉన్నారని నమ్మడానికి తగిన కారణమే ఉంది. అలాంటి వాళ్ళు, ఎవరో ఒకరు ప్రకటించనిదే ఎలా వింటారు?—రోమా. 10:14, 15.

2 వ్యతిరేకతను ఎదుర్కోవడం: రాజ్య సందేశాన్ని వినడానికి సుముఖత చూపించేవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనం నిరుత్సాహపడకూడదు. ఐరోపాలో అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడాన్ని విన్న మొదటి పట్టణం ఫిలిప్పీ. ఆయనపై, సీలపై తప్పుడు ఆరోపణలు చేయబడినప్పుడు, వారిని బెత్తములతో కొట్టి చెరసాలలో పడేశారు. (అపొ. 16:16-24) అలాంటి చేదు అనుభవం పౌలు భయంతో వెనుకంజ వేసేలా చేయలేదు. తన మిషనరీ ప్రయాణంలో తర్వాతి పట్టణమైన థెస్సలొనీకకు వెళ్ళినప్పుడు ఆయన ‘దేవునియందు ధైర్యము తెచ్చుకొన్నాడు.’ (1 థెస్స. 2:2) పౌలు మాదిరి, మనం ‘విసుకకుండా’ ఉండడానికి కారణాన్ని సోదాహరణంగా తెలియజేయడం లేదా?—గల. 6:9.

3 ఎన్నో సంవత్సరాలపాటు వినడానికి నిరాకరించినవాళ్ళు ఇప్పుడు మన సందేశాన్ని వినడానికి మొగ్గుచూపుతున్నారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, కుటుంబంలో ఎవరైనా మరణించడం, ప్రపంచ పరిస్థితుల్లో కలవరానికి గురిచేసే సంఘటనల గురించిన నివేదికలు వంటివి వాళ్ళలో అలాంటి మార్పు రావడానికి కారణం కావచ్చు. (1 కొరిం. 7:31) మన సందేశాన్ని వినడానికి వ్యతిరేకించిన తల్లిదండ్రుల పిల్లలు ఇప్పుడు పెద్దవారై దాన్ని వినడానికి సుముఖత చూపిస్తున్నారు. మనం ఎడతెగక ప్రకటనాపనిలో కొనసాగితే ఇలాంటి వారు ఇంకా ఆలస్యం కాకముందే ‘యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేసే’ అవకాశాన్ని పొందుతారు.—రోమా. 10:13.

4 “మానక” ప్రకటించడం: దేవుని పట్ల, పొరుగువారి పట్ల మనకున్న ప్రేమ, మొదటి శతాబ్దంలో అపొస్తలులు చేసినట్లే, ప్రకటనాపనిలో, శిష్యులను చేసేపనిలో “మానక” కొనసాగేందుకు మనల్ని పురికొల్పుతుంది. (అపొ. 5:42) నేడు అనేకమంది, ఇప్పుడు జరుగుతున్న ‘హేయకృత్యములనుగూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్నారు.’ (యెహె. 9:4) అలాంటి వారు సువార్త విన్నప్పుడు వారికి ఎంతటి ఉపశమనం, నిరీక్షణ కలుగుతాయో కదా! చాలామంది వినడానికి నిరాకరించినా, మన కృషినిబట్టి యెహోవా ఎంతో సంతోషిస్తాడని మనకు లేఖనాధారిత హామీ ఉంది.—హెబ్రీ. 13:15, 16.

[Study Questions]

1. ప్రకటనాపని ఎందుకు ఎంతో కష్టమైనదిగా ఉండవచ్చు, అయినప్పటికీ మనమెందుకు పట్టుదలతో ఆ పనిలో కొనసాగుతాము?

2. అపొస్తలుడైన పౌలు మాదిరి మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

3. కొందరికి గతంలో ఆసక్తిలేకపోయినా ఇప్పుడు ఆసక్తి ఏర్పడడానికి ఏది కారణం కావచ్చు?

4. పరిచర్యలో “మానక” కొనసాగేందుకు మనల్ని ఏది పురికొల్పుతుంది?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి