మన పరిచర్యను మానక కొనసాగించుట
1 అంత్యకాల అతిచివరి దశకు మనము చేరుకొలది ఈ లోకపునటన బహువేగముగా మారుచున్నది. (1 కొరిం. 7:31) బైబిలు ప్రవచనముల నెరవేర్పుగా ప్రపంచమును కదలించివేయు సంఘటనలు జరుగుచున్నవి. మనచుట్టూవున్న లోకములోను మరియు దైవపరిపాలనా సంస్థలోను జరుగుచున్న వాటిని తలంచుకొలది రాజ్య “సువార్తను” మనము ప్రకటించుట ఎంత అత్యవసరమో గుణగ్రహించగలము.—మార్కు 13:10.
2 మన నాయకుడును, మాదిరికర్తయునైన యేసుక్రీస్తు మనకు శిష్యులను చేయుమను ఆ ఆజ్ఞను యిచ్చియున్నాడు. అట్లు చేయుటలో విజయము లభిస్తుందను అభయమిస్తూ ఆయన యిలా వాగ్దానము చేసెను, “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను. . . . ” (మత్త. 28:19, 20) యేసు శిష్యులు ఆయన మాటలను గంభీరముగా తీసుకొని చివరకు బలమైన వ్యతిరేకతయందును “క్రీస్తు యేసును గూర్చిన సువార్తను మానక బోధించుచు, ప్రకటించుచునుండిరి.” (అపొ. 5:42, NW.) వారు మనకెంతటి మంచి మాదిరిని ఉంచియున్నారు!
3 1990 ఇయర్ పుస్తకమును మనము చదువుకొలది క్రొత్త శిష్యుల విషయములో మంచి అభివృద్ధిని తెచ్చుట ద్వారా యెహోవా మన పరిచర్యను ఆశీర్వదించాడని చూడగలము. కొన్ని దేశములలో రిపోర్టు చేయబడిన అభివృద్ధి నిజమునకు చూడముచ్చటగా ఉన్నది. ప్రపంచవ్యాప్తముగా జరిగిన మొత్తము అభివృద్ధి కేవలము కొద్ది సంవత్సరముల క్రితము మనమెవరము ఊహించనంతగా యున్నది. (యెష. 60:22) అయితే మన స్థానికప్రాంత విషయమేమి? మన వ్యక్తిగత పరిచర్య విషయమేమి? పరిచర్యలోని మన భాగమందును, అలాగే ప్రతిచోటయున్న మన తోటిపనివారల మొత్తపు పరిచర్యయందును మనము సంతోషించుచున్నామా? మన పరిచర్యలోని వ్యక్తిగత కృషియందును మనము మానక కొనసాగుచున్నామా?
మన వ్యక్తిగతభాగము
4 నిశ్చయముగా, అన్నిప్రాంతములు ఒకేరీతిగా ఫలించునవికావు. (మత్తయి 13:23ను పోల్చుము.) ఐర్లాండ్, క్యుబెక్ మొదలగు కొన్ని ప్రాంతములు ఆసక్తిగల పరిచారకులు కష్టించి పనిచేసిన అనేక సంవత్సరముల తర్వాత మాత్రమే ఫలించెననునది కూడా సత్యమైయున్నది. కొన్ని ప్రాంతములలో అనేకమంది వ్యతిరేకులు కలరు. ఇంకొన్ని ప్రాంతములలో సాధారణముగా ప్రజలు రాజ్యవర్తమానమును నిర్లిప్తతతో చెవినబెట్టనివారైయున్నారు. మరికొన్నిచోట్ల పనివారలు ఎక్కువమందియుండగా చేయబడవలసిన ప్రాంతము తక్కువగాయున్నది. అయితే ఎటువంటి ప్రాంతములో మనము పనిచేసినను మన ఆసక్తిమాత్రము లోపము లేనిదైయుండవలెను. అపొస్తలుడైన పౌలు యిలా వ్రాసెను, “మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగినకాలమందు పంటకోతము.” (గల. 6:9) ఆయనయొక్క ఈ మాటలు క్రైస్తవులందరికిని అన్వయించును. మనమెట్లు దానిని చేయగలము? మన పరిచర్యను మానక కొనసాగించుటకు మనకు సహాయపడునదేమి?
5 యెహోవాయందు నమ్మికయుంచి మనలను బలపరచగల ఆయన బలముపైన మనము ఆధారపడినయెడల చురుకుగాయుండి మన పరిచర్యలో విజయము పొందగలము. ప్రాంతమును ఫలవంతము చేయునది యెహోవాయే అనుదానిని ఎల్లప్పుడు మనస్సున ఉంచుకొనుము. (1 కొరిం. 3:6) మన ప్రార్థనలకు జవాబుగా యెహోవా సలహాను, అభ్యాస యుక్తమైన బోధను, మనకొరకు మరియు ఆయనను తెలుసుకొనునట్లు ఇతరులకు సహాయము చేయుటకొరకు విస్తారమైన బైబిలు సాహిత్యములను ఆయన దయచేయుచున్నాడు. ఈ ఏర్పాటులను మనము పూర్తిగా వినియోగించుకొనుచున్నామా?
సరైన దృక్పథమును కాపాడుకొనుము
6 మనము వ్యతిరేకమైన దృక్పథమును కలిగియున్న యెడల ప్రతిఫలదాయకమైన మన పరిచర్యకు అది గంభీరమైన ఆటంకము కాగలదు. ఇంతకుమునుపు వినలేదను దానినిబట్టి మన ప్రాంతములోని ప్రజలపై అననుకూలమైన అభిప్రాయమును పెంచుకుంటే, మన స్వరములోను, ముఖభావములలో, ప్రాంతీయ సేవకు సరిగా సిద్ధపడకుండుటలోను ఆ దృక్పథము ప్రతిబింబించును. బోధించుడి, ప్రకటించుడి అను పనిని అప్పగింప బడియున్నామేగాని, ఆ పని ముగించబడియున్నదని చెప్పబడలేదు. దైవిక నడిపింపునకు లోబడి విధేయులమై యుండవలెనను మన కోరిక మన పరిచర్యను మానక కొనసాగించుటకు నడింపవలెను.
7 దుష్టులను హెచ్చరించుట శిష్యులను సమకూర్చుటకును గూర్చిన యెహోవా సంకల్పము అంతమురాకముందు నెరవేరును. మన పరిచర్యలో మానక కొనసాగుటద్వారా మన విశ్వాసమును, ప్రేమను, కనపరచినయెడల యిప్పుడు పరిచర్యయొక్క ఆనందములోను, దేవుని ప్రజల మధ్య నిత్య ఆశీర్వాదములలోను పాలుపొందుటకు ఎదురుచూడగలము.