కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/08 పేజీ 4
  • మీరు బోధించగలరు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు బోధించగలరు!
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • రాజ్య ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఈ పనిలో మనకు యెహోవా తర్ఫీదు ఇస్తున్నాడు
    మన రాజ్య పరిచర్య—2011
  • భాగము 3: ఇతరుల అభివృద్ధికి తోడ్పడుట
    మన రాజ్య పరిచర్య—1991
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2008
km 11/08 పేజీ 4

మీరు బోధించగలరు!

1 ఎవరికైనా సత్యం బోధించడం, పరిచర్య చేయడం వల్లవచ్చే గొప్ప ఆశీర్వాదాల్లో ఒకటి. వాళ్ళు రాజ్య సువార్తను విని దానికి అనుగుణంగా ప్రవర్తించడాన్ని చూసి, విశ్వ సర్వాధిపతికి దగ్గరయ్యేలా వాళ్ళకు సహాయం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం. (యాకో. 4:8) సత్యం తెలుసుకోవడం అవసరమని గుర్తించినవారికి బోధించడాన్ని, వాళ్ళు తమ లక్షణాల్లో, ఉద్దేశాల్లో, ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు చేసుకోవడానికి సహాయం చేయడాన్ని ప్రతీ రాజ్య ప్రచారకుడు గురిగా పెట్టుకోవాలి.—మత్త. 28:19, 20.

2 యెహోవా మీద ఆధారపడండి: పూర్వకాలంలో నమ్మకమైన సేవకులు, యెహోవా తమకిచ్చిన పనిని చేసే సామర్థ్యం తమకు లేదనుకున్నారు. మోషే, యిర్మీయా, ఆమోసు, ఇతర సాధారణ ప్రజలు యెహోవా దేవుని మీద ఆధారపడడం వల్ల అనుమానాలతో లేదా భయాలతో వెనుకాడకుండా ప్రాముఖ్యమైన పనిని పూర్తిచేయగలిగారు. (నిర్గ. 4:10-12; యిర్మీ. 1:6, 7; ఆమో. 7:14, 15) అపొస్తలుడైన పౌలు కూడా ‘ధైర్యం తెచ్చుకొని’ మాట్లాడాడు. ఆయనకు ఆ ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? “మన దేవుని” వల్లనే తనకు ధైర్యం వచ్చిందని ఆయన చెప్పాడు. (1 థెస్స. 2:2) మనమందరం, మంచి బైబిలు అధ్యయనాలు నిర్వహించడానికి అవసరమైన సహాయాన్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని యెహోవా ఖచ్చితంగా మనకిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—యెష. 41:9, 10; 1 కొరిం. 1:26, 27; 1 పేతు. 4:11.

3 శిక్షణ తీసుకోండి: బోధకులముగా మనం పూర్ణముగా సిద్ధపడివుండడానికి, మన మహోపదేశకుడైన యెహోవా దేవుడు ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన క్రమమైన కార్యక్రమం ద్వారా మనకు శిక్షణనిస్తున్నాడు. (యెష. 54:13; 2 తిమో. 3:16, 17) లేఖనాలపై మీకున్న అవగాహనను పెంచుకునేందుకు, బైబిలు సత్యాలను బోధించడంలో మీకున్న సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు అవకాశం దొరికినప్పుడు మీరు చేయగలిగినదంతా చేస్తూ ఈ శిక్షణను తీసుకోండి. ప్రాముఖ్యంగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలనూ, సేవాకూటాన్నీ ఇలాంటి శిక్షణనివ్వడానికే ఏర్పాటు చేసినప్పటికీ దేవుని వాక్యం నుండి బోధించడంలో సంఘ కూటాలన్నీ మనకు శిక్షణనిస్తాయి.

4 అర్థం చేసుకోవడానికి కష్టంగావుండే బైబిలు సత్యాలను కూడా సులభంగా బోధించే పద్ధతులను నేర్చుకోవడానికి కృషి చేయండి. “మీరు విషయాన్ని ఇతరులకు అర్థమయ్యేలా చెప్పబోతున్నట్లయితే, మీరు స్పష్టంగా అర్థం చేసుకొనివుండాలి” అని పరిచర్య పాఠశాల పుస్తకం, 227వ పేజీ వివరిస్తుంది. మనం కూటాల్లో వ్యాఖ్యానిస్తే, అవసరమైనప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికి వీలుగా ముఖ్యమైన అంశాలు మన మనసులో నాటుకుంటాయి. కాబట్టి చక్కగా సిద్ధపడండి, అప్పుడు బాగా బోధించగలననే నమ్మకం మీలో పెరుగుతుంది.

5 మొదటి నుండి క్రైస్తవ పరిచారకులు శిష్యులను చేసే పనిలో పాల్గొంటున్నప్పుడు ఒకరి నుండి ఒకరు నేర్చుకున్నారు. (లూకా 10:1) అవకాశముంటే పయినీర్లు, పెద్దలు, ప్రయాణ పైవిచారకర్తలతో సహా అనుభవజ్ఞులైన ప్రచారకులతో పునర్దర్శనాలకు, బైబిలు పఠనాలకు వెళ్ళండి. వాళ్ళు లేఖన సత్యాలను బోధించడానికి, మనం అధ్యయనానికి ఉపయోగించే ప్రచురణలలోని సులభమైన ఉపమానాలను, వాటిలోని ఇతర బోధనా సహాయకాలను ఎలా వాడుకుంటున్నారో గమనించండి. మీరు బాగా బోధించడానికి ఏమిచేయాలో వారిని సలహా అడగండి. (సామె. 1:5; 27:17) ఇలాంటి శిక్షణకు విలువివ్వండి, ఎందుకంటే అది దేవుని నుండే వస్తుంది.—2 కొరిం. 3:5.

6 యెహోవా మీద ఆధారపడి, ఆయనిచ్చే శిక్షణ తీసుకుని ప్రయోజనం పొందండి. మీరు అభివృద్ధి సాధించడానికి సహాయం కోసం ప్రార్థించండి. (కీర్త. 25:4, 5) ఇతరులూ మీలాగే దేవుని వాక్య బోధకులయ్యేలా వారికి సహాయం చేయడంలోవున్న ఆనందాన్ని మీరూ పొందవచ్చు!

[అధ్యయన ప్రశ్నలు]

1. ప్రతీ రాజ్య ప్రచారకునికి ఏ గొప్ప అవకాశం ఉంది?

2. బైబిలు అధ్యయనం నిర్వహించడానికి కొంతమంది ఎందుకు వెనుకాడుతుండవచ్చు, అలా వెనుకాడకుండా ఉండడానికి వాళ్ళకు ఏది సహాయం చేస్తుంది?

3, 4. దేవుని వాక్యాన్ని బోధించడంలో మనకు సహాయం చేయడానికి ఏ శిక్షణా కార్యక్రమం అందుబాటులో ఉంది?

5. బాగా బోధించడానికి శిక్షణ పొందడంలో, సంఘంలోని వారినుండి కూడా మనం ఎలాంటి సహాయాన్ని తీసుకోవచ్చు?

6. దేవుని వాక్యాన్ని బోధించాలంటే ముఖ్యంగా ఏమి చేయాలి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి