ప్రాంతీయ సేవలో పూర్ణ హృదయులై యుండుడి
భాగము 3: ఇతరుల అభివృద్ధికి తోడ్పడుట
1 పెద్దవాడైన సహోదరుడగు పౌలుకు భక్తిగల యౌవనుడైన తిమోతికి మధ్యగల సంబంధము పరిచర్య కొరకైన శిక్షణకు చక్కని ఉదాహరణగా తరచు పేర్కొనబడినది. (1 కొరిం. 4:17) తాను పొందిన అదే జ్ఞానమును మరియు శిక్షణ ఇతరులకు పంచిపెట్టవలెనని పౌలు తిమోతిని నిర్దేశించెను. (2 తిమో. 2:1, 2) అదే పద్ధతిని మనమీనాడు సంఘములో అనుసరించుట మంచిది.
2 ఇతరులకు శిక్షణనిమ్ము: ఇండియాలో మూడు సంవత్సరముల క్రితము లేని ప్రచారకులకంటే ఈనాడు 3,500 మంది ఎక్కువ ఉన్నారని విషయమును మనము గ్రహించినప్పుడు శిక్షణకొరకైన అవసరము స్పష్టమగుచున్నది. అనుభవజ్ఞులైన ప్రచారకులు యిచ్చు శిక్షణనుండి వీరిలో అనేకులు బహుశ నిశ్చయముగా ప్రయోజనము పొందెదరు. సాధారణముగా, ప్రాంతీయ సేవలో నెలలో కేవలము ఒకటి రెండు గంటలు మాత్రమే గడుపు ఒక సహోదరి, అనుభవజ్ఞుడైన ప్రచారకుని సహాయము వలన గుమ్మము వద్ద ప్రభావశీలముగా మాట్లాడుటను నేర్చుకొనెను. పరిచర్యలో పాల్గొనుటలో ఆమెకు గతమందుండిన నిర్లక్ష్యము మటుమాయమయ్యెను, కాగా ఆమె సువార్తను ఆసక్తి ప్రకటించు ప్రచారకురాలయ్యెను. ఇప్పుడు ప్రావీణ్యము పొందిన పయనీరుగా, ఆమె వెనుకకు తిరిగిచూస్తు ఇట్లనుచున్నది: “నేనేమి చెప్పవలెనా నాకు నేర్పుటే నాకు కావలసియుండెను, మరియు ఆ పిమ్మట పరిచర్యలో నేను ఆనందించుటకు ఆరంభించితిని.”
3 నీవొక పెద్ద, ఒక పరిచారకుడు, ఒక పయనీరు, లేక అనుభవముగల ప్రచారకుడవైనట్లయిన, ఇతరుల అభివృద్ధికి నీవెట్లు తోడ్పడగలవు? మరొక ప్రచారకునికి నీవు సహాయము చేయుటకు యిష్టపడుచున్నావని మీ సంఘపుస్తక పఠన నిర్వాహకునికి తెలియజేయుట మొదటి చర్యయైయుండును.
4 వ్యవస్థీకరించుకొనుము మరియు సిద్ధపడుము: కలిసి పనిచేయుటకు ఒక ఖచ్చితమైన నియామకమును కలిగియుండుటకు ఇది సహాయపడును. మీ సహవాసి మొదట నీరసముగాను లేక తనకుతాను అనిశ్చయముగా ఉండవచ్చును, అయితే అవసరమేర్పడినప్పుడు తనకు సహాయపడుటకు ఎవరో సహాయపడుచున్నారనుటను అతడు ప్రశంసించును. (ప్రసం. 4:9) సాధ్యమైనట్లయిన, బైబిలు అంశములను సంభాషించుటకు ఆసక్తిచూపు ప్రజలుగల ప్రాంతమును ఎంచుకొనుము. ఇది క్రొత్త వ్యక్తి చేరియుండుటకు మరియు అలాగే నమ్మకము సంపాదించుటకు సహాయము చేయును.
5 ప్రగతిశీల శిక్షణను కొనసాగించుటకు, ఆసక్తి చూపినచోట పునర్దర్శనము ఎట్లు చేయవలెనో చర్చించుట ప్రయోజనకరమగును. మరలా తిరిగివచ్చినప్పుడు జవాబిచ్చులాగున యింటి యజమానికి ఒక ప్రశ్నను వేయుటద్వారా మొదటి దర్శనములోనే పునాది వేయుట ఇందుచేరియున్నది. అనుభవము తక్కువగాయున్న ప్రచారకుడు సిద్ధపడులాగున అతనికి సహాయపడి, పునర్దర్శనమునకు అతనితోకూడ వెళ్లుటను మరువకుము. పఠనము ప్రారంభమై, ఈ క్రొత్త ప్రచారకుడు ఇంకను తన సామర్థ్యమును శంకించుచున్నట్లయిన, ఈ క్రొత్త ప్రచారకుడు నిర్వహించుటకు అర్హత సంపాదించువరకు అనుభవజ్ఞుడైన ప్రచారకుడు కొన్నిసార్లవరకు ఆ పఠనమును జరిగించుటకు ఇష్టపడవచ్చును.
6 సంస్థలోనికి క్రొత్తవారు విరివిగా వచ్చుచున్నందున, ప్రాంతీయ సేవలో తీవ్రమైన విద్యాబోధన సమకూర్పు అవసరత జ్ఞానము దానంతటదే స్పష్టమగుచున్నది. ప్రకటించు పనిలో నైపుణ్యత సంపాదించిన వారినుండి సహాయము అవసరము. నీవు ఒకరికి సహాయపడినట్లయిన, తగిన సమయమున అతడుకూడ, “ఇతరులకు బోధించుటకు సామర్థ్యము”గలవాడగును.—2 తిమో. 2:2.