‘కృతజ్ఞులై ఉండండి’
1 యేసు పదిమంది కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు వారిలో ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగివచ్చాడు. అప్పుడు యేసు, “పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?” అని అడిగాడు. (లూకా 17:11-19) మన పరలోక తండ్రియైన యెహోవా దేవుడు ప్రేమతో ఉదారంగా మనపై కుమ్మరిస్తున్న శ్రేష్ఠమైన ప్రతీ ఈవికి సంపూర్ణమైన ప్రతీ వరానికి మనం మెప్పుదల కలిగివుండి, కృతజ్ఞత చూపించడం ఎంత ప్రాముఖ్యమో కదా!—యాకో. 1:17; కొలొ. 3:15.
2 మనం ఏ విషయాలపట్ల కృతజ్ఞులై ఉండాలి? దేవుడు మానవజాతికిచ్చిన అత్యంత గొప్ప బహుమానమైన విమోచనా క్రయధనంపట్ల మనం కృతజ్ఞులై ఉన్నాం. (యోహా. 3:16) మనల్ని తనవైపుకు ఆకర్షించుకున్నందుకు కూడా మనం యెహోవాకు కృతజ్ఞులై ఉన్నాం. (యోహా. 6:44) క్రైస్తవులముగా మన మధ్యనుండే ఐక్యత కూడా మనం కృతజ్ఞులై ఉండడానికి మరో కారణం. (కీర్త. 133:1-3) ఇలా యెహోవా అనుగ్రహించిన మరెన్నో బహుమానాలు మీకు గుర్తుకొస్తుండవచ్చు. యెహోవా తమ కోసం చేసినవాటిని మరచిపోయిన ఇశ్రాయేలీయుల్లా అవ్వాలని ఎప్పటికీ కోరుకోము.—కీర్త. 106:12, 13.
3 కృతజ్ఞత చూపించండి: యేసు తమను స్వస్థపరచినందుకు బహుశా పదిమంది కుష్ఠరోగులకీ మెప్పు ఉన్నా, వారిలో ఒక వ్యక్తి మాత్రమే కృతజ్ఞత చూపించడానికి తిరిగివచ్చాడు. (లూకా 17:16) అలాగే మనం కూడా ఉత్సాహంగా పరిచర్యలో భాగం వహించడం ద్వారా మన కృతజ్ఞతను చూపిస్తాం. ప్రేమగల మన పరలోక తండ్రి మన కోసం చేసిన వాటన్నిటిపట్ల నిజంగా మనకు కృతజ్ఞత ఉంటే ఆయన గురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన చూపించిన ప్రేమను, ఉదారతను మనం హృదయపూర్వకంగా అనుకరిస్తాం. (లూకా 6:45) అలా యెహోవా ‘మన యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను ఆయనకున్న తలంపులను’ మనం ఇతరులకు తెలియజేసినప్పుడు యెహోవాపట్ల మనకున్న ప్రేమ, మెప్పుదల అధికమౌతాయి.—కీర్త. 40:5.
4 కృతజ్ఞత చూపించేలా ఇతరులను పురికొల్పండి: మన పిల్లలు, బైబిలు విద్యార్థులు కృతజ్ఞత పెంపొందించుకొనేందుకు సహాయం చేయడానికి మనం ప్రయత్నించాలి. పిల్లల్లో కృతజ్ఞతను పెంపొందించే ఎన్నో అవకాశాలు తల్లిదండ్రులకు ఉంటాయి. ఉదాహరణకు పిల్లలతో కలిసి యెహోవా సృష్టిని తిలకిస్తున్నప్పుడు అలా చేయవచ్చు. (రోమా. 1:20) బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, “మనం చదివిన దాన్నిబట్టి యెహోవా గురించి మనకేమి తెలుస్తుంది” అని విద్యార్థిని అడగవచ్చు. విద్యార్థికి దేవునిపట్ల మెప్పుదల పెరుగుతున్న కొద్దీ దేవునిపట్ల ప్రేమ అధికమై, ఆయనను సంతోషపర్చాలనే తీర్మానం కూడా బలపడుతుంది.
5 ఈ అంత్యదినాల్లో చాలామంది మెప్పులేనివారిగా, కృతజ్ఞత లేనివారిగా ఉన్నారు. (2 తిమో. 3:1, 2) కాబట్టి ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొంటూ దైవభక్తిగల తన సేవకులు కృతజ్ఞత చూపిస్తున్నందుకు యెహోవా ఎంత ఆనందిస్తాడో కదా!—యాకో. 1:22-25.