పత్రికల గురించి ఏమి చెప్పాలి?
కావలికోట జన.–మార్చి
“కుటుంబంలో నొప్పించేలా మాట్లాడకుండా ఉండడం గురించి మేము మా పొరుగువారితో మాట్లాడుతున్నాం. ఈ విషయంలో కొన్ని ఆచరణాత్మక సలహాలు చర్చించడం మీకిష్టమేనా? [గృహస్థుడు వినడానికి సుముఖంగా ఉంటే, మానవులకుండే ఈ బలహీనత గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో మీకు చదివి వినిపించమంటారా అని మీరు ఆయనను అడగవచ్చు. ఆయన అంగీకరిస్తే యాకోబు 3:2 చదవండి.] మన కుటుంబంలోని వారిని మన మాటలద్వారా బాధపెట్టకుండా ఉండేందుకు కొన్ని ఆచరణాత్మక సలహాలను ఈ ఆర్టికల్ చర్చిస్తుంది.” 10వ పేజీలో మొదలయ్యే ఆర్టికల్‌ను చూపించండి.
కావలికోట ఏప్రి.–జూన్
“నేడు మనకెన్నో సమస్యలున్నా నిజమైన మనశ్శాంతిని పొందడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] ఈ పత్రికలో ఉన్న ఒక అభిప్రాయాన్ని నేను మీకు చదివి వినిపించనా? [గృహస్థుడు వినడానికి సుముఖంగా ఉంటే, 8-9 పేజీల్లోవున్న ఒక లేఖనాన్ని చదవండి.] మనమెలా ఉనికిలోకి వచ్చాము, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలను ఈ పత్రిక చర్చిస్తుంది.”