కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 4/15 పేజీలు 15-17
  • మీరు కృతజ్ఞత గలవారేనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు కృతజ్ఞత గలవారేనా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా తానే కృతజ్ఞుడై ఉన్నాడు
  • యేసు—ప్రగాఢమైన మెప్పుదలగల వ్యక్తి
  • సాతానుకున్న విమర్శనాత్మకమైన స్ఫూర్తి
  • దేవుణ్ని క్రీస్తును అనుకరించండి
  • ‘కృతజ్ఞులై ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2008
  • యెహోవా కృతజ్ఞతగల దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “కృతజ్ఞులై యుండుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • జీవితంలో మీరు ఎవరికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 4/15 పేజీలు 15-17

మీరు కృతజ్ఞత గలవారేనా?

పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మిషనరీ గృహంలో ఒకప్పుడు టెడ్డీ అనే కావలి కుక్క ఉండేది. ఎవరైనా ఈ టెడ్డీకి మాంసం ముక్క వేస్తే అది అమాంతం మింగేసేది, రుచిచూడ్డం ఉండదు, నమలడం అంతకన్నా ఉండదు. ఎండ వేడిలో నాలుక బయటపెట్టి వగరుస్తూ అది మరో మాంసం ముక్క కోసం కాచుక్కూర్చునేది. దాన్ని కూడా గుటుక్కుమన్పించిన తర్వాత తన దారినది పోయేది.

తనకు దొరికిన దానిపట్ల టెడ్డీ ఇసుమంతైనా కృతజ్ఞతను ఎన్నడూ వ్యక్తం చేయలేదు. దాన్నుండి కృతజ్ఞతలను ఎవరూ ఆశించలేదు కూడా. ఎంతైనా అది కుక్కే కదా.

కృతజ్ఞత వ్యక్తం చేసే విషయానికి వస్తే మనం జంతువుల దగ్గరనుండికన్నా తోటి మానవుల దగ్గరనుండే ఎక్కువగా ఆశిస్తాము. సాధారణంగా మనకు ఎదురయ్యేది నిరాశే. చాలామంది తమ జీవితంలో దొరికినదాన్ని ఆత్రంగా అందిపుచ్చుకుని ఇంకా దొరుకుతుందేమోనని ఎదురుచూస్తారు. ఇది కూడా అంత ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. అంత్యదినాల్లో ప్రజలు కృతజ్ఞతలేనివారిగా ఉంటారని బైబిలు ముందే చెప్పింది.—2 తిమోతి 3:1, 2.

అయినప్పటికీ, దేవుని సేవకులకు దీనికి భిన్నమైన స్ఫూర్తి ఉంది. వారు “కృతజ్ఞులై యుండుడి” అని తన తోటి విశ్వాసులను ప్రబోధించిన అపొస్తలుడైన పౌలు సలహాను లక్ష్యపెడతారు.—కొలొస్సయులు 3:15.

యెహోవా తానే కృతజ్ఞుడై ఉన్నాడు

మెప్పుదలను చూపించడంలో యెహోవా దేవుడే పరిపూర్ణమైన మాదిరిని ఉంచుతున్నాడు. ఆయన తన నమ్మకమైన సేవకులను ఎలా దృష్టిస్తాడో పరిశీలించండి. హెబ్రీ క్రైస్తవులకు పౌలు దైవప్రేరేపణతో ఇలా వ్రాశాడు: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”—హెబ్రీయులు 6:10.

యెహోవా నమ్మకంగా ఉన్న తన సేవకులపట్ల మెప్పుదలను ప్రదర్శించిన ఉదాహరణలు కోకొల్లలు. ఆయన అబ్రాహాము అక్షరార్థ సంతానాన్ని “ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను” విస్తరింపజేయడం ద్వారా ఆయన్ను ఆశీర్వదించాడు. (ఆదికాండము 22:17) శ్రమల్లో యోబు నమ్మకంగా ఉన్నందుకు మెప్పుదలగా యెహోవా యోబుకున్న గొప్ప సిరిసంపదల్ని తిరిగి ఇవ్వడం మాత్రమే కాక మునుపుకన్నా “రెండంతలు అధికముగా” ఇచ్చాడు. (యోబు 42:10) సహస్రవర్షాలపాటు మానవులతో యెహోవా వ్యవహరించిన విధానం ఈ మాటల్లోని సత్యసంధతను రుజువుపర్చింది: “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.”—2 దినవృత్తాంతములు 16:9.

తన చిత్తాన్ని చేయడానికి ప్రయత్నించేవారిపట్ల దేవునికున్న మెప్పుదల, వారికి ప్రతిఫలాన్నివ్వాలనే సుముఖత అనేవి ఆయన వ్యక్తిత్వంలో ప్రధాన లక్షణాలు. దాన్ని గుర్తించడమే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రకం. పౌలు ఇలా వ్రాశాడు: ‘విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు తన్ను వెదకువారికి ఆయన ఫలము దయచేయువాడని నమ్మవలెను.’—హెబ్రీయులు 11:6.

దానికి బదులుగా, ఒకవేళ యెహోవా కాఠిన్యతతో కూడిన స్ఫూర్తిని, విమర్శతో కూడిన స్ఫూర్తిని ప్రదర్శించి ఉన్నట్లైతే మనందరం దోషులమని తేలతాము. ఈ విషయాన్ని కీర్తనల గ్రంథకర్త ఎంతోకాలం ముందే తెలిపాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) యెహోవా మెప్పుదల లేనివాడూ కాదు, విమర్శకుడూ కాదు. తన సేవచేసేవారంటే ఆయనకు ప్రీతి. తాను కృతజ్ఞుడని ఆయన చూపిస్తాడు.

యేసు—ప్రగాఢమైన మెప్పుదలగల వ్యక్తి

తన పరలోకపు తండ్రి లక్షణాలను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తూ, ఇతరులు విశ్వాసంతో చేసిన కార్యాలపట్ల తాను కృతజ్ఞుడనై ఉన్నానని యేసుక్రీస్తు చూపించాడు. యెరూషలేములోని దేవాలయంలో ఒకసారి ఏమి జరిగిందో చూడండి: “కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన [యేసు] పారజూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి—ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలను వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను.”—లూకా 21:1-4.

డబ్బుపరంగా చూస్తే, ప్రాముఖ్యంగా ఆ ధనవంతులు వేసిన దానితో పోల్చి చూస్తే ఆమె వేసిన చందా చాలా తక్కువ. అక్కడున్న వారిలో అత్యధికులు అసలు ఆమెను పట్టించుకునే ఉండకపోవచ్చు. అయినప్పటికీ యేసు మాత్రం ఆ విధవరాలిని చూశాడు. ఆయన ఆమె స్థితిగతుల్ని గ్రహించాడు. యేసు ఆమెను చూసి ఆమెను ఘనంగా ఎంచాడు.

మరో సంఘటన మరియ అనే ఒక ధనవంతురాలికి సంబంధించినది. యేసు భోజనానికి కూర్చొంటుండగా ఆమె యేసు పాదాలమీద, తలమీద మిక్కిలి విలువైన అత్తరు పోసింది. కొందరు ఆమె చర్యను విమర్శించారు, అత్తరును అమ్మి ఆ డబ్బును బీదలకు సహాయం చేసేందుకు ఉపయోగించి ఉండవచ్చు గదా అని తర్కించారు. యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆయనిలా అన్నాడు: “ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడు[ను].”—మార్కు 14:3-6, 9; యోహాను 12:3.

ఆ అమూల్యమైన అత్తరును వేరే విధంగా ఉపయోగించలేదని యేసు విమర్శనాత్మకంగా ఆక్షేపణ చేయలేదు. మరియ తన ప్రేమను విశ్వాసాన్ని ఉదారపూర్వకంగా వ్యక్తం చేయడాన్ని మెచ్చుకున్నాడు. ఆమె చేసిన చక్కని కార్యానికి జ్ఞాపకార్థముగా బైబిలులో ఈ సంఘటన నమోదు చేయబడింది. ఈ వృత్తాంతాలూ మరితర సంఘటనలూ యేసు ప్రగాఢమైన మెప్పుదలగల వ్యక్తి అని చూపిస్తున్నాయి.

మీరు దేవుని సేవకుడు/రాలు అయినట్లైతే, యెహోవా దేవుడూ యేసుక్రీస్తూ స్వచ్ఛారాధను అభివృద్ధిపర్చడానికి మీరు చేస్తున్న కృషిపట్ల ప్రగాఢమైన మెప్పుదలను కలిగివున్నారన్న నిశ్చయతను కలిగివుండవచ్చు. ఈ విషయం తెలిసివుండడం మనల్ని వారివైపుకి ఆకర్షిస్తుంది, అంతేగాక మనం కూడా కృతజ్ఞులమై ఉన్నామని రుజువు చేసుకోవడం ద్వారా వారిని అనుకరించడానికి ప్రేరేపిస్తుంది.

సాతానుకున్న విమర్శనాత్మకమైన స్ఫూర్తి

ఇప్పుడు మనం కృతఘ్నుడైన ఒక వ్యక్తి ఉదాహరణను పరిశీలిద్దాము—ఆ వ్యక్తి అపవాదియైన సాతాను. సాతానుకు మెప్పుదల కొరవడడం, దేవునికి విరుద్ధంగా ఒక వినాశకరమైన తిరుగుబాటును రేకెత్తించడానికి ఒక కారణమైంది.

అసంతృప్తితో కూడిన ఒక విమర్శనాత్మకమైన స్ఫూర్తిని తనలో పెంపొందించుకుంటూ సాతాను దాన్ని ఇతరుల్లో నాటడం ప్రారంభించాడు. ఏదెను వనంలో జరిగిన సంఘటనల్ని పరిశీలించండి. యెహోవా మొదటి స్త్రీని పురుషుడ్ని సృష్టించి వారిని పరదైసు వంటి తోటలో ఉంచి, ఇలా చెప్పాడు: “ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును.” అక్కడ ఉన్నది ఒకే ఒక్క ఆంక్ష. దేవుడిలా అన్నాడు: “అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు; నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెద[వు].”—ఆదికాండము 2:16, 17.

అయితే ఎంతోకాలం గడువకముందే, సాతాను యెహోవా సత్యసంధతని సవాలు చేశాడు. తాను తిరుగుబాటు చేసినట్లుగానే, హవ్వ కూడా యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసేంత కృతఘ్నత చూపేలా ఆమెను ప్రభావితం చేయడం సాతాను ఉద్దేశంలో ఒక భాగం. “ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని సాతాను అన్నాడు. (ఆదికాండము 3:1) అంటే, హవ్వ కండ్లను తెరిపించి ఆమెను దేవునిలాగే చేయగల ఏదో అమూల్యమైనది ఇవ్వకుండా దేవుడు అట్టేపెట్టుకుంటున్నాడు అన్నది సాతాను చెప్పిన దానిలో అంతర్నిహితంగా ఉన్న విషయం. యెహోవా తనపై కుమ్మరించిన అనేకానేకమైన ఆశీర్వాదాలపట్ల కృతజ్ఞత చూపించడానికి బదులుగా హవ్వ వద్దన్నదాన్ని ఆశించడం ఆరంభించింది.—ఆదికాండము 3:5, 6.

దాని మూలంగా కల్గిన వినాశకరమైన పర్యవసానాలు స్పష్టంగా ఉన్నాయి. “ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి” అయివుండాల్సింది గనుక హవ్వ అనే పేరు ఇవ్వబడినా, మరో భావంలో ఆమె మరణిస్తున్న ప్రతివానికిని తల్లి అయింది. ఆదాము నుండి మానవులందరూ మరణాన్ని తెచ్చే పాపాన్ని వారసత్వంగా పొందారు.—ఆదికాండము 3:20; రోమీయులు 5:12.

దేవుణ్ని క్రీస్తును అనుకరించండి

సాతానుకూ యేసుకూ ఉన్న తేడా చూడండి. సాతాను, “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది” అని వర్ణించబడ్డాడు. (ప్రకటన 12:10) యేసు, “తనద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు.”—హెబ్రీయులు 7:25.

సాతాను దేవుని సేవకులమీద నేరము మోపుతున్నాడు. యేసు వారిని మెచ్చుకొని వారి పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. క్రీస్తును అనుకరిస్తున్నవారిగా క్రైస్తవులు ఒకరిలో మరొకరు మంచిని వెదకడానికి కృషిచేయాలి, ఒకరినొకరు మెచ్చుకుంటూ విలువైనవారిగా ఎంచుకుంటూ ఉండాలి. అలా చేయడం ద్వారా వారు, మెప్పుదలను చూపించడంలో అత్యుత్తమ మాదిరినుంచిన యెహోవా దేవునికి తాము కృతజ్ఞులుగా ఉన్నట్లు ప్రదర్శిస్తారు.

[17వ పేజీలోని చిత్రం]

మరియ చేసిన చక్కని క్రియపట్ల యేసు మెప్పుదలను వ్యక్తం చేశాడు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి