మీ పిల్లలు ముఖ్యమైన నిర్ణయం తీసుకోగలరా?
1. రక్తం ఉపయోగించే విషయంలో యౌవనసాక్షులు ఎలాంటి మనోవైఖరి కనుపరిచారు? ఒక ఉదాహరణ ఇవ్వండి.
1 దేని విషయంలో ముఖ్యమైన నిర్ణయం? రక్తమార్పిడుల విషయంలో. కావలికోట మే 1, 1992 సంచికలో “యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము” అనే ఆర్టికల్లో చూపించినట్లుగా యెహోవాసాక్షుల పిల్లలు, రక్తం విషయంలో దేవుని నియమానికి లోబడాలనే తమ కోరిక తమ తల్లిదండ్రులకు ఎంత బలంగా ఉందో తమకూ అంతే బలంగా ఉందని నిరూపించుకునేంత స్థిరమైన మనోవైఖరి కనుపరచవలసి వచ్చింది. మైనర్లుగావున్న మీ పిల్లల విషయంలో కూడా ఇది అవసరమా?
2. రక్తమార్పిడి నిరాకరించిన ఒక మైనర్ బాలిక విషయంలో ఒక కోర్టు ఎలాంటి చట్టబద్ధమైన ప్రమాణాన్ని అన్వయించింది, క్రైస్తవ తల్లిదండ్రులు, వారి మైనర్ పిల్లలు దాని నుండి ఏమి నేర్చుకోవచ్చు?
2 చట్టం ఏమి చెబుతోంది? రక్తమార్పిడులను నిరాకరించే విషయంలో పరిణతిగల మైనర్కున్న హక్కు విషయంలో తీర్పు చెప్పిన అమెరికాలోని అత్యున్నత న్యాయస్థానం, ఇల్లినోయస్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం. 17 సంవత్సరాల సహోదరి కేసును సమీక్షిస్తున్నప్పుడు కోర్టు ఇలా ఆదేశించింది: “ఒక మైనర్ బాలిక తన చర్యల పర్యవసానాలను అర్థం చేసుకోవడమే కాక, ఒక ఎదిగిన వ్యక్తి చూపించేంత వివేచనను చూపించగల పరిణతి ఉన్నట్లు నిరూపించే రుజువు స్పష్టంగా నమ్మించే విధంగా ఉన్నట్లయితే, ఆమె పరిణతిగల మైనర్ అనే సూత్రం ఆధారంగా వైద్య చికిత్స అంగీకరించే లేక తిరస్కరించే సాంప్రదాయక ధర్మపు హక్కు ఆమెకు లభిస్తుంది.” కాబట్టి పిల్లలు సొంత నిర్ణయం తీసుకొనేంతగా పరిణతి చెందారా లేదా నిర్ణయించడానికి వైద్యులు, అధికారులు రక్తం తీసుకోవడంలో రోగికున్న వ్యక్తిగత అభ్యంతరాన్ని వినేందుకు వారిని ఇంటర్వ్యూ చేయవచ్చు. వాళ్ళు తమ వైద్య పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో, తాము ఎంపిక చేసుకున్న చికిత్సవల్ల కలిగే పర్యవసానాలు ఏమిటో సహేతుకంగా అర్థం చేసుకొని, రక్తం విషయంలో దేవుడిచ్చిన నియమం గురించి తమ మతసంబంధ నమ్మకాన్ని స్పష్టంగా దృఢంగా వ్యక్తం చేయగలగాలి.
3. తల్లిదండ్రులు ఏ ప్రశ్నల గురించి గంభీరంగా ఆలోచించాలి, ఎందుకు?
3 మీ పిల్లలు ఏమి చెబుతారు? రక్తం విషయంలో దేవుని నియమం గురించి మీ పిల్లలు తమ అభిప్రాయాన్ని చెప్పగలరా? ‘రక్తాన్ని విసర్జించండి’ అనేది దేవుని నియమమని వారు హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? (అపొ. 15:28; 21:25) వారు తమ నమ్మకాన్ని లేఖనాధారంగా వివరించగలరా? పిల్లవాని ప్రాణం ప్రమాదంలో ఉందని వైద్యులు నమ్మిన సందర్భంలో, తమ తల్లిదండ్రులు దగ్గరలేకపోయినా వారు ధైర్యంగా తమ స్థిర నిర్ణయాన్ని సమర్థించుకోగలరా? “[మనమందరం] కాలవశానికి, అనూహ్య సంఘటనలకు గురవుతుంటాం” కాబట్టి, తమ యథార్థతకు అనుకోని విధంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి మీ పిల్లలను మీరెలా సిద్ధం చేయవచ్చు?—ప్రసం. 9:11, NW; ఎఫె. 6:4.
4, 5. (ఎ) తల్లిదండ్రులకు ఏ బాధ్యత ఉంది, దానిని వారెలా నిర్వర్తించవచ్చు? (బి) తల్లిదండ్రులకు సహాయం చేయడానికి ఏ సహాయకాలు అందుబాటులో ఉన్నాయి?
4 తల్లిదండ్రులారా, మీరు ఏమి చేయవచ్చు? రక్తం విషయంలో దేవుని దృక్పథం గురించి మీ పిల్లలకు బోధించే బాధ్యత మీకుంది. (2 తిమో. 3:14, 15) దాని గురించి స్పష్టమైన వివరణ తర్కించండి (ఆంగ్లం) పుస్తకంలోని 70-4 పేజీల్లో ఉంది. దానిని మీ కుటుంబంతో శ్రద్ధగా అధ్యయనం చేయండి. తాము ఏమి నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అనే విషయాలను వివరించడంలో అనుభవం గడించేలా మీ పిల్లలకు సహాయం చేయడానికి 74-6 పేజీల్లో ఉన్న “ఇఫ్ సమ్వన్ సేస్—” (“ఎవరైనా ఇలా అంటే—”) అనే భాగాన్ని వారితో కలిసి అభ్యాసం చేయండి. (1 పేతు. 3:15) రక్తము నీ జీవమును ఎట్లు కాపాడగలదు? అనే బ్రోషుర్, కావలికోట జూన్ 15, 2004, 14-24 పేజీలు వంటి ఇతర సహాయకాలు కూడా రక్తానికి సంబంధించిన విషయంలో మనకు బోధిస్తాయి. అంతేకాక, మార్పిడి ప్రత్యామ్నాయ ఆరోగ్య సంరక్షణ—రోగి అవసరాలు, హక్కులు తీర్చడం, రక్త రహిత చికిత్స—వైద్య శాస్త్రం ఆ సవాలును ఎదుర్కొంటుంది వంటి వీడియో కార్యక్రమాలు మార్పిడి ప్రత్యామ్నాయాలు—డాక్యుమెంటరీ పరంపర అనే పేరుతో డీవీడీ రూపంలో లభ్యమవుతుంది, రక్తరహిత చికిత్స, రక్తరహిత శస్త్రచికిత్స ఎంత సహేతుకతమైనవనే దాని గురించి, వాటివల్ల కలిగే ప్రయోజనం గురించి ఒప్పించే సమాచారాన్ని ఇస్తాయి. మీ కుటుంబం ఇటీవల ఆ వీడియోలను చూసి, వాటిలోని విషయాలను చర్చించిందా?
5 మీ పిల్లలు రక్తం విషయంలో “ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు” వారికి సహాయం చేయండి. అప్పుడు వారు యెహోవా ఆశీర్వాదం ఉన్న పరిణతిగల నిర్ణయాన్ని తీసుకుంటారు.—రోమా. 12:2.