ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు డిసెంబరులో: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని ప్రతిపాదించండి. సంఘ స్టాకులో ఉన్నట్లయితే ప్రత్యామ్నాయంగా నా బైబిలు కథల పుస్తకము, బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం), లేదా మీరు పరదైసు భూమిపై నిరంతరం జీవించగలరు వంటి పుస్తకాలను ప్రతిపాదించండి. జనవరిలో: 192 పేజీల ఏ పాత పుస్తకమైనా లేక 1991వ సంవత్సరానికి ముందు ప్రచురించబడిన ఏ పుస్తకాన్నైనా ప్రతిపాదించవచ్చు. గృహస్థులు పుస్తక ప్రతిపాదనను అంగీకరించకపోతే, అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ను ప్రతిపాదించండి. ఫిబ్రవరిలో: యెహోవాకు సన్నిహితమవండి పుస్తకాన్ని అందించాలి. ఈ పుస్తకం స్టాకులోలేని సంఘాలు, ప్రకటన ముగింపు! పుస్తకాన్ని లేక స్టాకులో అధికంగా ఉన్న వేరే పాత పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని ప్రతిపాదించి బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేక కృషి చేయండి.
◼ 2006వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రాలు ప్రతీ సంఘపు ప్రాథమిక భాషలో ప్రతీ సంఘానికి త్వరలో పంపించబడతాయి. మీ క్షేత్రంలో వేరే భాషలు మాట్లాడేవారి కోసం వారి భాషలో ఆ ఆహ్వాన పత్రాలు మీకు కావాలంటే వాటికోసం వీలైనంత త్వరగా లిటరేచర్ రిక్వెస్ట్ ఫామ్ (S-14) ద్వారా రిక్వెస్టు చేయాలి. మీ క్షేత్రంలో అవసరమయ్యే భాషలకు సంబంధించి మాత్రమే ఆహ్వానపత్రాలను రిక్వెస్టు చేయండి.
◼ 2007వ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ సోమవారం, ఏప్రిల్ 2న, సూర్యాస్తమయం తర్వాత అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటి కంటే ఎక్కువ సంఘాలు ఉపయోగిస్తున్నట్లయితే, సహోదరులు అందుబాటులో ఉన్న ఇతర హాళ్ళను బుక్ చేసుకోవడానికి లేక కాంట్రాక్టులు తీసుకోవడానికి వీలుగా ఈ తేదీ ఇంత ముందుగా తెలియజేయబడుతోంది. జ్ఞాపకార్థ ఆచరణ ప్రశాంతంగా, క్రమబద్ధంగా జరిగేలా ఆ భవనంలోని ఇతర కార్యకలాపాలవల్ల భంగంవాటిల్లకుండా ఉండేందుకు పెద్దలు హాలు యాజమాన్యంతో ఒప్పందం చేసుకోవాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకున్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఆ సందర్భంలో ప్రసంగం ఇవ్వడానికి పెద్దలసభ ప్రతి సంవత్సరం ఒకే సహోదరుణ్ణి ఎంపిక చేసుకునే బదులు లేదా తామే వంతులవారీగా ఇస్తూ ఉండే బదులు యోగ్యులైన పెద్దలలో ఒకరిని ఎంపికచేసుకోవాలి. ప్రసంగమిచ్చేందుకు పూర్తి అర్హతలుగల అభిషిక్తుడైన పెద్ద ఉన్నట్లయితే ఆయననే ఎంపిక చేసుకోండి.
◼ కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో మన రాజ్య పరిచర్యను పొందే సంఘాలకు ఆ భాషల్లో “ప్రతిలేఖనము”—విశ్వసనీయమైనది, ప్రయోజనకరమైనది అనే బ్రోషుర్ పంపించబడుతోంది. 2006వ సంవత్సరంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నిర్వహించబడే మొదటి నియామకానికి సంబంధించిన మూలసమాచారం ఆ బ్రోషుర్‌లో ఉంది. కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో సవరించబడిన 2006వ సంవత్సరపు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక త్వరలో పంపించబడుతుంది. వేరే భాషా సంఘాలు పైన పేర్కొనబడిన ఏ భాషల్లోనైనా బ్రోషుర్‌ను ఉపయోగించాలనుకుంటే లిటరేచర్ రిక్వెస్ట్ ఫామ్ (S-14) ద్వారా తమ రిక్వెస్టులను పంపించవచ్చు.
◼ లభ్యమయ్యే క్రొత్త కాంపాక్ట్ డిస్క్‌లు:
గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి —కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
నా బైబిలు కథల పుస్తకము—కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
నిత్యజీవానికి నడిపించే జ్ఞానము—కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
కుటుంబ సంతోషానికిగల రహస్యము—కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి—కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా పొందవచ్చు?—కాంపాక్ట్ డిస్క్‌లో (ఎమ్‌పి 3 ఫార్మెట్)—ఆంగ్లం
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?—కాంపాక్ట్ డిస్క్‌లో—ఆంగ్లం, కన్నడ, బెంగాలీ, మలయాళం
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే—కాంపాక్ట్ డిస్క్‌లో—ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, హిందీ
మన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మెప్పుదల—కాంపాక్ట్ డిస్క్‌లో (నాటకం)—హిందీ