దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2005 డిసెంబరు 26వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2005 నవంబరు 5 నుండి డిసెంబరు 26 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు. [గమనిక: ప్రశ్న తర్వాత రెఫరెన్సులు లేకపోతే, మీరే స్వయంగా పరిశోధించి జవాబులను తెలుసుకోవాలి.—పరిచర్య పాఠశాల, 36-7 పేజీలను చూడండి.]
ప్రసంగ లక్షణాలు
1. “ప్రేమనుబట్టి” ఉద్బోధిస్తున్నామని నిశ్చయపరచుకొనేందుకు మనం ఏమి చేయవచ్చు? (ఫిలే. 8-9) [be 266]
2. “హితబోధ”తో మనం ఏ యే విధాలుగా ‘హెచ్చరించవచ్చు’? (తీతు 1:9) [be 266వ పేజీ 5వ పేరా నుండి 267వ పేజీ 1వ పేరా వరకు]
3. మన ప్రసంగాలు ప్రోత్సాహకరంగా ఉండేలా చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం, దీనిని మనమెలా చేయవచ్చు? [be 268వ పేజీ 1-3 పేరాలు, బాక్సు]
4. మోషేను అనుకరిస్తూ, యెహోవా తన ప్రజలకోసం చేసినదాన్ని గుర్తుతెచ్చుకొనేలా ఇతరులకు సహాయం చేయడం ఎలా ధైర్యాన్నిస్తుంది? (ద్వితీ. 3:28; 31:1-8) [be 268వ పేజీ 5వ పేరా నుండి 269వ పేజీ 1వ పేరా వరకు]
5. యెహోవా ప్రస్తుతం చేస్తున్న వాటి గురించి, భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి ఆనందంగా మాట్లాడడం మన ప్రేక్షకులకు ఎందుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది? [be 270-1 పేజీలు]
ఒకటవ నియామకం
6. మనం చదువుతున్న బైబిలు భాగాలను ఏ నాలుగు దృక్కోణాలను ఉపయోగించి ప్రయోజనకరంగా విశ్లేషించవచ్చు? [wt 28, 30 పేజీలు]
7. బైబిలు ప్రవచనాలు యేసు గురించి ఎంతమేరకు సూచించాయి? [wt 32వ పేజీ 1-2 పేరాలు]
8. యేసు బలిపై మనకు నిజంగా విశ్వాసముంటే మనమేమి చేస్తాము? [wt 39వ పేజీ, 14 పేరా]
9. నిజ క్రైస్తవత్వం మనకు ఎలాంటి స్వాతంత్ర్యాలను ఇస్తుంది? [wt 45వ పేజీ, 8వ పేరా]
10. అపరిపూర్ణ మానవులుగా మనం నిజంగా యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నామని నిరూపించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? [wt 56, 57 పేజీలు, 14వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. దావీదుకు ఆలయ నిర్మాణ అనుమతి ఇవ్వబడలేదన్న వాస్తవం, దావీదు చేసిన యుద్ధాలను యెహోవా ఆమోదించలేదని సూచిస్తుందా? (1 దిన. 22:6-10)
12. సొలొమోను చేసిన ఆలయ ప్రతిష్ఠాపనా ప్రార్థనలో, యెహోవాకు ఒక జనసమూహంగా తన సేవకుల అవసరాలపట్ల శ్రద్ధ ఉండడమేగాక, తనకు భయపడే ప్రతీ వ్యక్తి విశేష పరిస్థితి గురించి కూడా తెలుసని ఎలా అంగీకరించాడు? (2 దిన. 6:29, 30)
13. రెండవ దినవృత్తాంతములు 11:15 లో ప్రస్తావించబడిన “[‘మేకల ఆకారమున్న,’ NW] దయ్యములు” ఏమిటి?
14. బయెషా పరిపాలన “ఆసా యేలుబడిలో మూడవ సంవత్సరమందు” ప్రారంభమై కేవలం 24 సంవత్సరాలే సాగింది కాబట్టి, బయెషా “ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున . . . యూదావారిమీద దండెత్తి” రావడాన్ని మనమెలా పొందికపరచవచ్చు? (1 రాజు. 15:33; 2 దిన. 16:1)
15. సాతాను ప్రపంచానికి ఏమి జరగబోతోందో 2 దినవృత్తాంతములు 20:22, 23 సుస్పష్టంగా ఎలా వర్ణిస్తోంది?