కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/05 పేజీ 7
  • వాక్యం లేకుండానే సాక్ష్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాక్యం లేకుండానే సాక్ష్యం
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • యెహోవాను మహిమపర్చే సత్క్రియలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • సత్ప్రవర్తన ద్వారా సాక్ష్యమివ్వడం
    మన రాజ్య పరిచర్య—1998
  • దేవుని ఆత్మ నిర్దేశాన్ని అనుసరిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 8/05 పేజీ 7

వాక్యం లేకుండానే సాక్ష్యం

1 యెహోవా భౌతిక సృష్టి, ఒక్కమాట కూడా మాట్లాడకుండానే ఆయన అదృశ్య లక్షణాల గురించి చాలా సమాచారాన్ని అందిస్తోంది. (కీర్త. 19:1-3; రోమా. 1:20) అలాగే మన మంచి ప్రవర్తన, క్రైస్తవ లక్షణాలు, నిరాడంబరంగా కనిపించే తీరు కూడా వాక్యం లేకుండానే ఆయన గురించి సాక్ష్యమిస్తాయి. (1 పేతు. 2:12; 3:1-4) మనం ప్రవర్తించే తీరు ద్వారా “అన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరిం[చాలనే]” కోరిక మనలో ప్రతీ ఒక్కరికి ఉండాలి.—తీతు 2:9.

2 బైబిలు బోధలకు ఆకర్షణను పెంచడం అపరిపూర్ణ మానవులకు ఎలా సాధ్యం? దేవుని వాక్య నిర్దేశం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే అలా చేయడం సాధ్యమవుతుంది. (కీర్త. 119:105; 143:10) దేవుని వాక్యం “సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉం[ది].” (హెబ్రీ. 4:12) అది మనలో లోతుగా చొచ్చుకొనిపోయి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. (కొలొ. 3:9, 10) పరిశుద్ధాత్మ మనలో దయ, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి కోరదగిన లక్షణాలను వృద్ధి చేస్తుంది. (గల. 5:22, 23) దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ మన జీవితాలపై ప్రభావం చూపించేందుకు మనం వ్యక్తిగతంగా అనుమతిస్తున్నామా?—ఎఫె. 4:30; 1 థెస్స. 2:13.

3 ఇతరులు గమనిస్తారు: మనం యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తూ, ఆయన లక్షణాలను ప్రతిబింబించడానికి కృషి చేస్తే ఇతరులు దాన్ని గమనిస్తారు. ఉదాహరణకు, పొట్టిగా ఉన్న కారణంగా సహోద్యోగుల ద్వారా హేళనకు గురైన ఒక వ్యక్తి ఉదాహరణనే పరిశీలించండి. అదే కార్యాలయంలో పని చేస్తున్న ఒక సహోదరి ఆయనతో ఎల్లప్పుడూ గౌరవమర్యాదలతో వ్యవహరించేది. ఆమె ఎందుకు అంత భిన్నంగా ఉందో అని ఆమెను అడగడానికి అది ఆయనను కదిలించింది. తన జీవితంలో బైబిలు సూత్రాలను అన్వయించుకున్న కారణంగా తాను మర్యాదతో ప్రవర్తిస్తున్నానని ఆమె వివరించింది. ఆమె ఆయనకు అద్భుతమైన రాజ్య నిరీక్షణ గురించి కూడా చెప్పింది. ఆ వ్యక్తి బైబిలు అధ్యయనం ప్రారంభించి చివరకు బాప్తిస్మం తీసుకొనేంతగా ప్రగతి సాధించాడు. ఆయన తన స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆయన బంధువులు ఆయన మంచి ప్రవర్తననుబట్టి ప్రభావితులై వారిలో చాలామంది సత్యాన్ని అంగీకరించారు.

4 పని స్థలాల్లో, పాఠశాలల్లో లేక బంధువులతో, పొరుగువారితో వ్యవహరిస్తున్నప్పుడు మన మంచి ప్రవర్తనతోపాటు మనమిచ్చే సాక్ష్యం ద్వారా, ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేలా చేయవచ్చు.—మత్త. 5:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి