కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/05 పేజీ 7
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2005
మన రాజ్య పరిచర్య—2005
km 8/05 పేజీ 7

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు ఆగస్టులో: ఇక్కడ ప్రస్తావించబడిన 32 పేజీల బ్రోషుర్‌లలో దేన్నైనా ఉపయోగించవచ్చు: “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను,” జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, భూమిపై నిరంతరజీవితమును అనుభవించుము!, మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది? (ఆంగ్లం) మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషుర్‌లను ప్రతిపాదించవచ్చు. సెప్టెంబరులో: మీ పట్ల శ్రద్ధచూపే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా, జీవం—ఇక్కడికెలా వచ్చింది? పరిణామం ద్వారానా, సృష్టి ద్వారానా? (ఆంగ్లం)లేదా పాతబడి, రంగువెలసిన 192 పేజీల పాత పుస్తకం ఏదైనా ప్రతిపాదించవచ్చు. పుస్తక ప్రతిపాదనను గృహస్థుడు అంగీకరించకపోతే అప్రమత్తంగా ఉండండి! బ్రోషుర్‌ను అందించండి. అక్టోబరులో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు. ఆసక్తి చూపించిన చోట దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్‌ను పరిచయం చేయండి. నవంబరులో: గొప్ప బోధకుని నుండి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం ఇవ్వండి, తమకు పిల్లలులేరని చెప్పిన వారికి జ్ఞానము పుస్తకాన్ని లేదా మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? అనే కరపత్రాన్ని ఇవ్వండి.

◼ అక్టోబరులో ఐదు వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు చేయడానికి అది చాలా అనువుగా ఉంటుంది.

◼ 2006వ సేవా సంవత్సరపు ప్రాంతీయ, ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాలకు సంబంధించి ఉపయోగించడానికి మన రాజ్య పరిచర్య ఈ సంచికలోని 5, 6 పేజీలను భద్రపరచుకోండి.

◼ సంఘ పైవిచారణకర్త లేక ఆయన నియమించిన వ్యక్తి సెప్టెంబరు 1వ తారీఖున లేదా ఆ తర్వాత వీలైనంత త్వరగా సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌ చేయాలి. నిర్వహణ లేదా నిర్మాణ ఏర్పాట్లకు సంబంధించి మరో బ్యాంక్‌ ఖాతా ఉంటే, ఆ అక్కౌంటును కూడా ఆడిట్‌ చేయాలి. ఆడిట్‌(లు) పూర్తవగానే తరువాతి అకౌంట్సు రిపోర్టుతో పాటు దానిని లేదా వాటిని చదవాలి.

◼ ఎలాంటి వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలకైనా ఏ సమయంలోనైనా బ్రాంచి కార్యాలయపు అడ్రసును రిటర్న్‌ లేదా తిరుగుటపా అడ్రసుగా ఉపయోగించకూడదు అని గుర్తు చేయబడుతుంది. ఆసక్తిగల ప్రజలకు, ఇంట్లో లేని ప్రజలకు, చేరుకోలేని ప్రాంతాల్లో నివసిస్తున్నవారికి సాక్ష్యమిచ్చేందుకు పోస్టు చేసే అన్ని ఉత్తరాలకు, సాహిత్యాలకు కూడా బ్రాంచి కార్యాలయపు అడ్రసును తిరుగుటపా అడ్రసుగా ఉపయోగించకూడదు. ఒక ప్రచారకుడు చేసే పరిచర్యలో దేవునికి అతను చేస్తున్న వ్యక్తిగత సేవ ఉంది కాబట్టి అతను తన సొంత అడ్రసునే తిరుగుటపా అడ్రస్‌గా ఉపయోగించాలి. (మత్త. 28:19, 20; రోమా. 10:14, 15) అయితే పోస్టు ద్వారా సాక్ష్యమిస్తున్నప్పుడు తన సొంత తిరుగుటపా అడ్రసు ఉపయోగించడం జ్ఞానయుక్తం కాదని ఆయన భావిస్తే, ఆయన తన పేరును, రాజ్యమందిరానికి సంబంధించిన తిరుగుటపా అడ్రసును ఉపయోగించవచ్చు.—మన రాజ్య పరిచర్య మే 2002 ప్రశ్నా భాగాన్ని చూడండి.

◼ సంఘ కార్యదర్శులు, సంఘంలోని ప్రతీ ఒక్క క్రమ పయినీరుకు సంబంధించిన పయినీర్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ (S-202) తమ దగ్గర ఉండేలా చూసుకోవాలి. ఆ ఉత్తరం తమ దగ్గర లేనట్లయితే, దయచేసి బ్రాంచి కార్యాలయానికి రాయండి. (పెద్దల సభలన్నిటికీ రాయబడిన జూలై 5, 1999 తేదీగల ఉత్తరాన్ని చూడండి.)

◼ స్టాకులో ఉన్న పత్రికలతో సహా సాహిత్యాలన్నింటి వార్షిక ఇన్వెంటరీ ఆగస్టు 31, 2005న లేదా ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలి. ప్రతీనెల లిటరేచర్‌ కో-ఆర్డినేటర్‌ లెక్కించే విధంగానే ఈ ఇన్వెంటరీ చేయాలి, అలా లెక్కించిన స్టాకు వివరాలను లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారంలో ఎక్కించాలి. స్టాకులో ఉన్న పత్రికల మొత్తం సంఖ్యను పత్రికా సేవకుని(ల) నుండి పొందవచ్చు. ఈ ఇన్వెంటరీని కో-ఆర్డినేటింగ్‌ సంఘ కార్యదర్శి పర్యవేక్షించాలి. ఆయనతోపాటు కో-ఆర్డినేటింగ్‌ సంఘ పైవిచారణకర్త కూడా ఆ ఫారం మీద సంతకాలు చేస్తారు. ప్రతి కో-ఆర్డినేటింగ్‌ సంఘం మూడు లిటరేచర్‌ ఇన్వెంటరీ (S-18) ఫారాలు అందుకుంటాయి. దయచేసి ఒరిజినల్‌ కాపీని బ్రాంచి కార్యాలయానికి సెప్టెంబరు 6వ తేదీకి ముందే పంపించండి. మీ ఫైళ్ళ కోసం ఒక కాపీ ఉంచుకోండి. మూడవ కాపీని చిత్తు ప్రతిగా ఉపయోగించుకోవచ్చు.

◼ లభ్యమయ్యే క్రొత్త ప్రచురణలు:

యెహోవాకు స్తుతి గీతాలు పాడండి—పదకూర్పు మాత్రమే —ఆంగ్లం

పదకూర్పు మాత్రమేవున్న (Ssbly) పాటల పుస్తకం సంగీత చిహ్నాలు లేని చిన్న సైజు పుస్తకం.

◼ మళ్ళీ లభ్యమయ్యే ప్రచురణలు:

మనం మరణించినప్పుడు మనకేమి సంభవిస్తుంది?—ఉర్దూ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి