ప్రాంతీయ సమావేశ పునఃసమీక్ష
2005 సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు, పునఃసమీక్షించేందుకు ఈ సమాచారం ఉపయోగించబడుతుంది. ఈ ఇన్‌సర్ట్‌లోని 4వ పేజీలో కనిపించే “సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి నూతన ఏర్పాటు” అనే ఆర్టికల్, ఈ పునఃసమీక్షను ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. పునఃసమీక్ష చేస్తున్నప్పుడు ప్రశ్నలన్నీ పరిశీలించగలిగేలా వాటికి సమయం కేటాయించుకోండి. అందించబడిన సమాచారాన్ని మనం ఎలా అన్వయించుకోవాలనే విషయంమీద పునఃసమీక్ష కేంద్రీకరించబడాలి.
మొదటి దిన ఉదయం (లేదా మధ్యాహ్నం) కార్యక్రమం
1. దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?
2. సువార్తతో చాలామంది ప్రజలను చేరుకునేందుకు సర్క్యూట్‌లోవున్న వారు ఎలాంటి కృషి చేశారు?
మొదటి దిన మధ్యాహ్నం (లేక సాయంత్రం) కార్యక్రమం
3. అంతరంగంలో నిష్కల్మషంగా ఉండడం క్రైస్తవులకు ఎందుకు ప్రాముఖ్యమైనది? దీనిని మనం ఎలా సాధించవచ్చు?
4. మన సహోదరులతో సమాధానంగా ఉంటున్నామని మనమెలా చూపించవచ్చు?
5. సహేతుకత అంటే ఏమిటి, మనం మన సమయాన్ని ఉపయోగించుకునే విధానంలో మనం దానినెలా చూపించవచ్చు?
6. సౌలు, నోవహు మాదిరులనుండి మనం ఏమి నేర్చుకుంటాము? మనం ‘సులభంగా లోబడుతున్నామని’ ఏయే విధాలుగా చూపించవచ్చు? (యాకో. 3:17)
7. క్రైస్తవులు ద్వంద జీవితం జీవించకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు?
8. దేవుని జ్ఞానంతో మాట్లాడడంలో పౌలు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు?
రెండవ దిన ఉదయకాల కార్యక్రమం
9. మనం అనుసరించే కార్యకలాపాలను ఎన్నుకొనే విషయంలో మనమెందుకు జాగ్రత్త తీసుకోవాలి, మనమలా చేసేందుకు మనకు ఏమి సహాయం చేస్తుంది?
10. కూటాలకు క్రమంగా హాజరవడానికి సర్క్యూట్‌లోని వారు ఎలాంటి కృషి చేస్తున్నారు, అలా కృషి చేయడంవల్ల వారు ఎలాంటి ప్రయోజనాన్ని పొందారు?
11. కుటుంబ శిరస్సులు తమ కుటుంబాలను ఆధ్యాత్మికంగా ఎలా బలపరచవచ్చు?
12. సర్క్యూట్‌కు సంబంధించిన ఏ అవసరతలు మన దృష్టికి తీసుకురాబడ్డాయి?
రెండవ దిన మధ్యాహ్న కార్యక్రమం
13. బహిరంగ ప్రసంగంలో పేర్కొనబడినట్లుగా, పైనుండి వచ్చు జ్ఞానం ఎలాంటి నీతి ఫలాలను ఫలిస్తుంది?
14. మనపై మనం నమ్మకముంచడం లేక దేవుని జ్ఞానంతో నడిపించబడని వారిపై నమ్మకముంచడం ఎందుకు మూర్ఖతయై ఉన్నది? ఏయే రంగాల్లో మనం జాగ్రత్తవహించాలి?
15. దేవుని జ్ఞానం మనల్ని ఏయే ఉరులనుండి కాపాడుతుంది?
16. ప్రాంతీయ సమావేశంలో అందించబడిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం మనకు ఎందుకు ప్రాముఖ్యమైనది?