కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/04 పేజీ 6
  • ప్రత్యేక సమావేశ దిన పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రత్యేక సమావేశ దిన పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—2004
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రాంతీయ సమావేశ పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2004
  • సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి నూతన ఏర్పాటు
    మన రాజ్య పరిచర్య—2004
  • క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం
    మన రాజ్య పరిచర్య—2004
  • ప్రత్యేక సమావేశదిన పునఃసమీక్ష
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2004
km 12/04 పేజీ 6

ప్రత్యేక సమావేశ దిన పునఃసమీక్ష

2005 సేవా సంవత్సరంలో జరిగే ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమాన్ని సమీక్షించేందుకు, పునఃసమీక్షించేందుకు ఈ సమాచారం ఉపయోగించబడుతుంది. ఈ ఇన్‌సర్ట్‌లోని 4వ పేజీలో కనిపించే “సమావేశ కార్యక్రమాలను పునఃసమీక్షించడానికి నూతన ఏర్పాటు” అనే ఆర్టికల్‌, ఈ పునఃసమీక్షను ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. పునఃసమీక్ష చేస్తున్నప్పుడు ప్రశ్నలన్నీ పరిశీలించేలా వాటికి సమయాన్ని కేటాయించుకోండి. అందించబడిన సమాచారాన్ని మనం ఎలా అన్వయించుకోవాలనే విషయంమీద పునఃసమీక్ష కేంద్రీకరించబడాలి.

ఉదయపు కార్యక్రమం

1. యెహోవా చెప్పేది వినవలసిన అవసరత ఎందుకు అంతకంతకూ అధికమవుతూనే ఉంది? వినడం అంటే అర్థం ఏమిటి? (“యెహోవా చెప్పేది ఎందుకు వినాలి?”)

2. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సంబంధించిన మంచి కార్యక్రమాన్ని కుటుంబాలు ఎలా అనుసరిస్తూ ఉండచవచ్చు? (“దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతో వినే కుటుంబాలు”)

3. అనియత సాక్ష్యం ఇచ్చే అవకాశాలను సర్క్యూట్‌లోని వారు ఎలా సద్వినియోగం చేసుకున్నారు? (“సమస్తమును దేవుని మహిమకొరకే చేయడం”)

4. హెబ్రీయులకు 3, 4 అధ్యాయాల్లోని హెచ్చరికా మాదిరినుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? నేడు యెహోవా మనతో ఎలా మాట్లాడుతున్నాడు? (“దేవుడు మాట్లాడినప్పుడు వినడం మనలను కాపాడుతుంది”)

5. బాప్తిస్మం ప్రసంగంనుండి మీరు ఎలా ప్రయోజనం పొందారు? (“సమర్పణ, బాప్తిస్మం”)

మధ్యాహ్న కార్యక్రమం

6. యేసు యౌవనునిగా గడిపిన జీవితంనుండి మనం ఏమి గ్రహించవచ్చు, సర్క్యూట్‌లోని యౌవనులు ఆయన మాదిరిని ఎలా అనుకరిస్తున్నారు? (“దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం మన యౌవనులను ఎలా బలపరుస్తుంది?”)

7. తల్లిదండ్రులు తమ పసిపిల్లలకు, చిన్నపిల్లలకు యెహోవా మార్గాల్లో శిక్షణను ప్రారంభించగల కొన్ని మార్గాలేవి? (“దేవుని మాటవిని నేర్చుకునే పిల్లలు”)

8. మనం యెహోవాకు, ఆయన కుమారునికి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి” అవధానం ఇవ్వవలసిన కొన్ని నిర్దిష్టమైన రంగాలేవి? (మత్త. 24:45) మనం అలా అవధానం ఇవ్వడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? (“దేవుని ఉపదేశానికి ఎల్లప్పుడూ అవధానం ఇవ్వండి”)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి