కలిసి సాక్ష్యమివ్వడం ఆనందాన్నిస్తుంది
1 యేసు 70 మంది శిష్యులను ప్రకటనా పని కోసం పంపించేటప్పుడు, పరిచర్యలో వారేమి చెప్పాలో నేర్పించి, ఇద్దరిద్దరినిగా వారిని విభజించి, వారు ప్రకటించవలసిన సేవాక్షేత్రం గురించి తెలియజేశాడు. ఇది వారు పరిచర్యలో ఆనందించడానికి సహాయంచేసింది. (లూకా 10:1-17) అలాగే నేడు సహోదరులతో కలిసి సాక్ష్యమివ్వడం దేవుని ప్రజలను ప్రకటనా పనికోసం సిద్ధపరచడానికి, సంస్థీకరించడానికి, ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.
2 పెద్దలు నాయకత్వం వహిస్తారు: ప్రచారకులందరూ ప్రకటనా పనిలో క్రమంగా భాగం వహించేలా వారికి సహాయం చేయడంలో పెద్దలు ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారం మధ్యలో ప్రకటనా పని కోసం ఏర్పాట్లు చేయడంలో సేవా పైవిచారణకర్త నాయకత్వం వహిస్తాడు. ప్రతీ పుస్తక అధ్యయన గుంపు పైవిచారణకర్త, తన గుంపుకు సంబంధించిన కార్యకలాపాలను వ్యవస్థీకరించేందుకు, ప్రత్యేకించి వారాంతంలో ప్రకటనా పనిని వ్యవస్థీకరించేందుకు బాధ్యత వహించాలి. క్షేత్ర సేవ చేయడానికి సంఘమంతా కలుసుకునే సందర్భాల్లో, ఉదాహరణకు కావలికోట అధ్యయనం తర్వాత పరిచర్య చేసే సందర్భాల్లో, ప్రతీ పుస్తక అధ్యయన పైవిచారణకర్త తన గుంపుకు సంబంధించిన అవసరాలను చూసుకోవాలి.
3 “మర్యాదగాను క్రమముగాను”: క్షేత్ర సేవా కూటాన్ని నిర్వహించవలసిన సహోదరుడు కూటాన్ని సమయానికి ప్రారంభించి 10 లేదా 15 నిమిషాల్లో ముగించాలి. ఆయన కూటాన్ని ప్రార్థనతో ముగించేముందు (ముందు చెప్పబడినట్లుగా ఆ పనిని పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు చూసుకోని పరిస్థితుల్లో) సాక్ష్యమిచ్చే గుంపులను విభజించి వారికి క్షేత్రాన్ని నియమిస్తే మంచిది. ప్రచారకులు క్షేత్రంలో గుంపుగా కలుసుకుంటే అది మన పనికున్న గౌరవాన్ని తగ్గించడమే కాక మన పనిని ఇష్టపడని వారు మనల్ని సులభంగా వ్యతిరేకించడానికి అవకాశమిస్తుంది, కాబట్టి పైన ప్రస్తావించిన ఏర్పాటును అనుసరించడం ద్వారా ప్రచారకులు క్షేత్రంలో ఒక గుంపుగా కలుసుకునే అవసరం ఉండదు. అది పౌలు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా కూడా ఉంటుంది: “సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనియ్యుడి.” (1 కొరిం. 14:39) ఈ కూటాలకు హాజరయ్యే వారందరూ ఆ ఏర్పాటు విజయవంతమవ్వడానికి, సమయానికి హాజరవడం ద్వారా, నాయకత్వం వహిస్తున్న సహోదరుడికి పూర్తిగా సహకరించడం ద్వారా, కూటం ముగిసిన వెంటనే క్షేత్రానికి వెళ్ళిపోవడం ద్వారా మద్దతునివ్వాలి.
4 ఐకమత్యం ద్వారా సన్నిహితమవ్వడం: కలిసి సాక్ష్యమివ్వడానికి చేసే ఏర్పాట్లు, సంఘంలోని ఇతరులను తెలుసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తాయి. మనం ఒక వ్యక్తితో కలిసి పనిచేయడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి అభ్యంతరమేమీ లేకపోయినా, అలాంటి ముందు ఏర్పాట్లేమీ లేకుండా క్షేత్ర సేవా కూటాలకు హాజరవ్వడం కూడా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. మనకు ముందు అంత బాగా తెలియని వ్యక్తితో కలిసి పనిచేయడానికి మనం నియమించబడవచ్చు, అది మనం మన ప్రేమను ‘విశాలపరచుకోవడానికి’ సహాయపడుతుంది.—2 కొరిం. 6:11-13.
5 సహోదరులతో కలిసి సాక్ష్యమివ్వడం మనల్ని ప్రోత్సహిస్తుంది, ‘సత్యమునకు సహాయకులుగా’ మనల్ని సన్నిహితం చేస్తుంది. (3 యోహా. 8) మనం దానిలో సంపూర్ణంగా భాగం వహించుదుము గాక!