సేవా కూటాల పట్టిక
గమనిక: మన రాజ్య పరిచర్య, సమావేశం జరిగే నెలల్లోని ప్రతీవారానికి ఒక సేవా కూటాన్ని షెడ్యూల్ చేస్తుంది. “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశానికి హాజరవడానికి వీలయ్యేందుకు అవసరమైన సర్దుబాట్లు సంఘాలు చేసుకోవచ్చు. సముచితమైన చోట, సమావేశానికి హాజరయ్యే ముందు చివరి సేవా కూటంలో 15 నిమిషాలు ఉపయోగించి, ఈ నెల అనుబంధంలో ఇవ్వబడిన ఉపదేశంలో స్థానికంగా అన్వయించగల అంశాలను మళ్ళీ నొక్కిచెప్పండి. జనవరి నెలలో సమావేశపు కార్యక్రమంలోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించడానికి ఒక సేవా కూటం పూర్తిగా కేటాయించబడుతుంది. ఆ చర్చకు సిద్ధపాటుగా, మనందరము సమావేశంలో అర్థవంతమైన నోట్సు వ్రాసుకోవచ్చు, దానిలోనే మనం మన వ్యక్తిగత జీవితంలో క్షేత్ర పరిచర్యలో అన్వయించుకోవాలనుకునే నిర్దిష్టమైన పాయింట్ల లిస్టు కూడా వ్రాసుకోవాలి. అలా చేయడం వల్ల మనం సమావేశం హాజరైనప్పటి నుండి ఆ సలహాలను ఎలా అన్వయించుకోగలిగామో ఇతరులకు వివరించడం ద్వారా వారిని ప్రోత్సహించగలము.
జూలై 14తో ప్రారంభమయ్యే వారం
పాట 4 (43)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మొదటిది) జూలై 15 కావలికోటను సంఘానికి సంబంధించిన క్షేత్రంలో ఎలా ప్రతిపాదించవచ్చో చూపించే రెండు సహజమైన ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి.
15 నిమి: “యెహోవాను స్తుతించడానికి సమకూడడం.”a ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. మొదటి రోజు ఉదయం నుండి మూడవ రోజు మధ్యాహ్నం వరకూ ప్రతీ సెషన్‌కు హాజరవమని అందరినీ ప్రోత్సహించండి. కేవలం విని ఊరుకోవడం కాక మనం నేర్చుకున్నవాటిని అన్వయించుకోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పండి. జనవరిలో జిల్లా సమావేశపు ఉన్నతాంశాలను పునఃసమీక్షించేందుకు ఏర్పాటు చేయబడిన సేవా కూటం గురించి తెలియజేయడానికి పైన ఇవ్వబడిన గమనికను పరిశీలించండి. సమావేశంలో నోట్సు వ్రాసుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.
20 నిమి: “దేవుడు చూపిన దయపట్ల కృతజ్ఞత.”b 3వ పేరాను చర్చించేటప్పుడు అక్టోబరు 1998 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీపై ఆధారపడి పత్రికా మార్గాన్ని ప్రారంభించేందుకు సలహాలను తెలియజేయండి. బైబిలు అధ్యయనాలను ప్రారంభించడంలో తమకు సమర్థవంతంగా అనిపించిన పద్ధతిని వివరించమని ఒకరు లేదా ఇద్దరు సమర్థులైన ప్రచారకులను అడగండి. బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించి, దాన్ని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకొమ్మని అందరినీ ప్రోత్సహించండి.—om 91వ పేజీ.
పాట 8 (53), ముగింపు ప్రార్థన.
జూలై 21తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (224)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “సత్క్రియలు చేయడంలో మాదిరిగా ఉండండి.”c ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. మన ప్రయోజనార్థం చేయబడిన రూమింగ్ ఏర్పాట్లకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పండి. సమావేశమంతటిలో పరిశుభ్రతను కాపాడడం ఎందుకు ప్రాముఖ్యమో అందరూ గ్రహించేందుకు సహాయం చేయండి. అందరూ మర్యాదకరంగా ప్రవర్తించవలసిన అవసరం ఎందుకుందో వివరించండి.
20 నిమి: ప్రకటనా పనిలో వారు ప్రదర్శించిన ధైర్యాన్ని అనుకరించండి. దేవుణ్ణి ఆరాధించండి (ఆంగ్లం) పుస్తకంలోని 170-1 పేజీల ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. 7వ పేరాలో అడగబడిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని, ఇవ్వబడిన లేఖనాలను తమ వ్యాఖ్యానాల్లో చేర్చమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ఎంపిక చేసుకొన్న కొన్ని లేఖనాలను చదవండి. ఈ వృత్తాంతాలనుండి మనం నేర్చుకునే పాఠాలను, మనకివ్వబడిన ప్రకటనా నియామకాన్ని సరిగ్గా దృష్టించడానికి అవి మనకెలా సహాయపడతాయో నొక్కి చెప్పండి.
పాట 12 (113), ముగింపు ప్రార్థన.
జూలై 28తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (45)
10 నిమి: స్థానిక ప్రకటనలు. జూలై క్షేత్ర సేవా రిపోర్టులను ఇమ్మని ప్రచారకులకు గుర్తు చేయండి. 8వ పేజీలోని సలహాలను ఉపయోగిస్తూ జూలై-సెప్టెంబరు తేజరిల్లు!ను, (పత్రికల ప్రతిపాదన కాలమ్‌లో మూడవది) ఆగస్టు 1 కావలికోటను ఎలా ప్రతిపాదించాలో చూపించే రెండు ప్రదర్శనలను విడి విడిగా ప్రదర్శించండి. మాట్లాడేది ఒక పత్రిక గురించే అయినప్పటికీ ప్రతి ప్రదర్శనలోనూ రెండు పత్రికలను జంటగా ప్రతిపాదించాలి. ఒక ప్రదర్శనలో ప్రచారకుడు అనియత సాక్ష్యమిస్తున్నట్టు చూపండి.
15 నిమి: “తగుమాత్రపు వస్త్రములు దేవునికి గౌరవాన్ని తెస్తాయి.”d పెద్ద నిర్వహించాలి. ఇవ్వబడిన ప్రశ్నలు ఉపయోగించండి. సమర్థవంతంగా చదవగలిగే సహోదరుని చేత ప్రతీ పేరాను బిగ్గరగా చదివించండి.
20 నిమి: “కలిసి సాక్ష్యమివ్వడం ఆనందాన్నిస్తుంది.”e 3వ పేరాను చర్చించేటప్పుడు, సెప్టెంబరు 2001 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నా భాగంపై వ్యాఖ్యానాలను చేర్చండి. సంఘ పుస్తక అధ్యయన పైవిచారణకర్తను క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. ఆయన తన పుస్తక అధ్యయన గుంపు కోసం చేసిన క్షేత్ర పరిచర్య ఏర్పాట్ల గురించి, గుంపు కలిసి సాక్ష్యమివ్వడం ద్వారా పొందే ప్రయోజనాల గురించి చెప్పమని కోరండి.
పాట 23 (200), ముగింపు ప్రార్థన.
ఆగస్టు 4తో ప్రారంభమయ్యే వారం
పాట 20 (93)
10 నిమి: స్థానిక ప్రకటనలు. ఆగస్టు నెలలో ప్రతిపాదించే సాహిత్యాల గురించి తెలియజేయండి. సాహిత్యాలు ప్రతిపాదించేందుకు ఉపయోగించగల ఒకటి లేదా రెండు క్లుప్తమైన అందింపులను ప్రదర్శించండి.
20 నిమి: “వివిధ భాషలు మాట్లాడే ప్రజలుగల క్షేత్రంలో సాహిత్యాలను ప్రతిపాదించడం.”f ఇవ్వబడిన ప్రశ్నలను ఉపయోగించండి. 3వ పేరాను చర్చించేటప్పుడు స్థానిక క్షేత్రంలోని ప్రజలు ఉపయోగించే భాష అయినా ఆ భాషకు సంబంధించిన సంఘం లేని భాషలో సరళమైన అందింపును ప్రదర్శించండి.
15 నిమి: “అంగవైకల్యమున్నా ఫలవంతమైన సేవ చేయడం.”g ఆగస్టు 22, 1990, తేజరిల్లు! (ఆంగ్లం) 22-3 పేజీల్లోని “వాట్ కెన్ బి డన్?” అనే సబ్‌హెడ్డింగ్ క్రిందవున్న సమాచారం ఆధారంగా ఇతరులు ఎలా సహాయపడగలరో తెలియజేసే వ్యాఖ్యానాలను చేర్చండి.
పాట 16 (143), ముగింపు ప్రార్థన.
[అధస్సూచీలు]
a ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
b ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
c ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
d ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
e ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
f ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.
g ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను ఒక నిమిషం కన్నా తక్కువ సమయానికి పరిమితం చేసి, ప్రశ్నా జవాబులతో చర్చను కొనసాగించండి.