పత్రికల గురించి ఏమని చెప్పాలి?
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“ప్రకృతిలో ఉన్న అతి వినాశకరమైన అతి శక్తివంతమైన శక్తుల్లో భూకంపాలు కూడా ఉన్నాయి. బ్రతికి బయటపడినవారు తరచూ ఇళ్ళు లేకుండా, తిరిగి కోలుకునే మాధ్యమం లేకుండా మిగిలిపోతారు. భూకంపం తర్వాతి పరిస్థితులను బాధితులు తట్టుకుని ఎలా నిలబడగలిగారో తేజరిల్లు! యొక్క ఈ సంచిక చూపిస్తుంది. భూకంపాలు చాలా ప్రాముఖ్యమైన ఒక బైబిలు ప్రవచనంలో భాగంగా ఎలా ఉన్నాయో కూడా ఇది వివరిస్తుంది.”
కావలికోట ఆగస్టు 15
“ఎవరికి విశ్వసనీయంగా ఉండడం సర్వశ్రేష్ఠమైనదని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] నిజమైన దేవునికి విశ్వసనీయంగా ఉండడాన్ని ఈ ఆర్టికల్ నొక్కి చెబుతుంది. [5వ పేజీ చూపించి, 2 సమూయేలు 22:26 చదవండి.] దేవునికి విశ్వసనీయంగా ఉండడం, ప్రజలు ఇతరులపట్ల ప్రేమలేకుండా ప్రవర్తించడాన్ని నివారించడానికి సహాయపడుతుందని మీకు ఇంతకుముందు తెలుసా? దాని గురించి చదవడాన్ని మీరు తప్పకుండా ఆనందిస్తారని నాకు తెలుసు.”
తేజరిల్లు! జూలై-సెప్టెం.
“గర్భస్థ శిశువును పోగొట్టుకోవడం ఒక తల్లికి చాలా బాధాకరమైన అనుభవంగా ఉండవచ్చు. ఆ బాధను తగ్గించడానికి కుటుంబ సభ్యులు ఏమి చేయవచ్చు? [జవాబు చెప్పనివ్వండి.] కుటుంబ సభ్యులు ఇవ్వగల నిర్దిష్టమైన ఆచరణాత్మక సహాయాన్ని ఈ పత్రిక వివరించడమే కాకుండా, ఈ సమస్యను సమీప భవిష్యత్తులో దేవుడు నిర్మూలించబోతున్నాడన్న సంతోషకరమైన నిరీక్షణను కూడా ఇస్తుంది. [ప్రకటన 21:3, 4 చదవండి.] మీరు ఈ సమాచారాన్ని పంచుకోగల వారెవరైనా మీకు తెలిసి ఉండవచ్చు.”
కావలికోట సెప్టెం. 1
“మునుపటిలా కాకుండా, ఇప్పుడు చాలాప్రాంతాల్లో ఇరుగుపొరుగు వారిలో ఒకరి గురించి ఒకరికి తెలియదని మీరు గమనించారా? [జవాబు చెప్పనివ్వండి.] మంచి పొరుగువారిగా ఉండడానికి కీలకమైన ఒక సూత్రాన్ని యేసు తెలియజేశాడు. [మత్తయి 7:12 చదవండి.] మనం మంచి పొరుగువారిగా ఉండి, ఇతరులు కూడా అలా ఉండడానికి ఎలా ప్రోత్సహించవచ్చో ఈ ఆర్టికల్‌లు చూపిస్తాయి.”