కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 8/02 పేజీ 8
  • సంభాషించేవారిగా ఉండండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంభాషించేవారిగా ఉండండి!
  • మన రాజ్య పరిచర్య—2002
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనసులో మాటను ఆరోగ్యకరమైన విధంగా తెలియజేసుకోవడం—మంచి వివాహ జీవితానికి ఒక కీలకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సిద్ధంగా ఉండడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తి చూపించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2002
km 8/02 పేజీ 8

సంభాషించేవారిగా ఉండండి!

1 ప్రకటించి, శిష్యులను చేయమని మనకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చడానికి మనం ఇతరులకు సమాచారాన్ని అందివ్వాలి. (మత్త. 24:14; 28:19, 20) స్నేహితుల మధ్య కూడా సంభాషణ జరగడం కష్టంగానే ఉండవచ్చు. అపరిచితులతో సువార్త గురించి ప్రభావవంతంగా సంభాషించడానికి మనకు ఏది సహాయపడగలదు?

2 స్నేహపూర్వకంగా ఉండండి: మీరు పరిచర్యలో కలిసే ప్రజల స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవడానికి ప్రయత్నించండి. నేడున్న లోక పరిస్థితులను బట్టి, కొందరు అపరిచితులంటే అనుమానపడవచ్చన్నదీ చివరికి భయపడవచ్చన్నదీ అర్థం చేసుకోదగినదే. ఇది సంభాషణను ఆటంకపర్చగలదు. మీరు కలిసే వ్యక్తులు మొదట్లో చూపించే భయాన్ని మీరు ఎలా పోగొట్టవచ్చు? మనం ఒక్క మాట కూడా మాట్లాడకుండానే, నిరాడంబరమైన మన పైరూపం ద్వారా వారితో సంభాషించవచ్చు. చక్కని వస్త్రధారణ, ప్రశాంతమైన మన వైఖరి వారి భయాలను తగ్గించడానికి సహాయపడతాయి.—1 తిమో. 2:9, 10.

3 సంభాషించడానికి మరో సహాయకం, ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉండడం. ఇలా ఉండడం, ఇతరులు ఇబ్బంది పడకుండా, మనం చెప్పేది వినేందుకు మరింత సుముఖంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ విషయంలో మంచి సిద్ధపాటు అవసరం. మనం ఏమి చెప్పబోతున్నామో మన మనస్సులో స్పష్టంగా ఉంచుకుంటే మనం మరింత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ప్రశాంతతతో కూడిన మన ఈ వైఖరి మన సందేశం వైపుకు ఇతరులను ఆకర్షించగలదు. ఒక సాక్షి తనను సందర్శించడాన్ని గురించి ఒక స్త్రీ ఇలా చెప్పింది: “చిరునవ్వు చిందిస్తున్న ఆమె ముఖంలో నాకు బాగా గుర్తున్నది ఆమె ప్రశాంతతే. అది నా ఆసక్తిని చూరగొన్నది.” ఆ స్త్రీ సువార్తను వినడానికి అది మార్గాన్ని తెరచింది.

4 ఆకర్షించే లక్షణాలు: మనం ఇతరులపట్ల యథార్థమైన వ్యక్తిగత శ్రద్ధను కలిగివుండాలి. (ఫిలి. 2:4) ఇలా చేయడానికి ఒక మార్గమేమిటంటే సంభాషించేటప్పుడు మనమే ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం. నిజానికి సంభాషించడంలో వినడం కూడా ఇమిడి వుంది. మన శ్రోతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మనం వారిని ఆహ్వానించి వారు చేసే వ్యాఖ్యానాలను శ్రద్ధగా వింటే, మనం వారిపట్ల శ్రద్ధ కలిగివున్నామని వారు గ్రహిస్తారు. కాబట్టి మీ శ్రోతలు మాట్లాడుతుంటే, మీరు సిద్ధపడిన సమాచారాన్ని అందించడానికి తొందరపడకండి. మీరు వారిని యథార్థంగా ప్రశంసించగలిగితే ప్రశంసించండి, వారు చెప్పే విషయాలకు అనుగుణంగా మీ వ్యాఖ్యానాలను మలుచుకోండి. వారి వ్యాఖ్యానాలు వారి హృదయంలో ఉన్నదాన్ని వెల్లడి చేస్తే, మీ అందింపును వారి చింతలకు తగ్గట్టు మలుచుకోండి.

5 వినయం, దీనమనస్సు సంభాషణ సాఫీగా సాగేటట్లు చేస్తాయి. (సామె. 11:2; అపొ. 20:19, NW) యేసు ‘సాత్వికుడు దీనమనస్సు గలవాడు’ కాబట్టి ప్రజలు ఆయన వైపుకు ఆకర్షించబడ్డారు. (మత్త. 11:29) మరోవైపు, అధికులమన్న దృక్పథం ఇతరులు మన నుండి దూరంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి, మన దగ్గర సత్యం ఉందని మనం దృఢంగా నమ్ముతున్నప్పటికీ మొండిపట్టుదలతో మాట్లాడడాన్ని జ్ఞానవంతంగా నివారిస్తాము.

6 ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలు, బైబిలు బోధించేదానితో పొందికగా లేని నమ్మకాలను ప్రతిబింబిస్తే ఎలా? ఆయనను సరిచేసే బాధ్యత మనకుందా? అవును, మనం చివరికి చేయాలనుకునేది అదే, కానీ మొదటిసారి సందర్శిస్తున్నప్పుడే అలా చేయడానికి మనం ప్రయత్నించనవసరం లేదు. ఎదుటి వ్యక్తికి స్వీకరించడం కష్టంగా అనిపించగల బైబిలు బోధలను ఆ వ్యక్తితో పంచుకునే ముందు, ఆయనకూ మీకూ ఆసక్తికరంగా ఉండే విషయాలను చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడానికి ఓర్పు, నేర్పు అవసరం. అరేయొపగులోని న్యాయాధిపతులకు సాక్ష్యమిస్తున్నప్పుడు ఈ విషయంలో పౌలు ఒక చక్కని మాదిరిని ఉంచాడు.—అపొ. 17:18, 22-31.

7 అన్నింటినీ మించి, నిస్వార్థ ప్రేమ మనం సమర్థవంతంగా సంభాషించేవారిగా ఉండడానికి సహాయపడుతుంది. “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజలపై యేసు కనికరపడినట్లుగానే మనం కూడా కనికరపడాలి. (మత్త. 9:36) మనం వారికి సువార్తను అందించి, వారు జీవమార్గంలోకి రావడానికి సహాయం చేసేందుకు ఇది మనలను కదిలిస్తుంది. మనది ప్రేమకు సంబంధించిన సందేశం, కాబట్టి దానిని ప్రేమపూర్వకంగానే చెబుతూ ఉందాము. అలా చేయడం ద్వారా, మనం విశ్వంలోనే ప్రధాన సంభాషకులైన యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తును అనుకరిస్తాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి