కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/00 పేజీ 1
  • దినమెల్లా యెహోవాకు భయపడండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దినమెల్లా యెహోవాకు భయపడండి
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాకు భయపడేలా మీహృదయాన్ని మలచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • యెహోవా భయంలో ఆనందాన్ని కనుగొనేందుకు నేర్చుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మనుష్యులకు కాక దేవునికి ఎందుకు భయపడవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • యెహోవాకు భయపడి ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 12/00 పేజీ 1

దినమెల్లా యెహోవాకు భయపడండి

1 “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” (కీర్త. 111:10) అది మంచి పనులు చేసేలా మనలను ప్రేరేపించి చెడు నుండి వైదొలిగేలా సహాయం చేస్తుంది. (సామె. 16:⁠6) మన సృష్టికర్తకు చూపించే ప్రగాఢమైన భక్తే ఆ భయం. అది, ఆయనకు అప్రీతికరమైన వాటిని చేయకుండా, అవిధేయత చూపించకుండా ఉండేలా మనల్ని ప్రేరేపిస్తుంది. మనం అలవర్చుకొని దినమెల్లా ప్రదర్శించాల్సిన లక్షణమై ఉందది.​—సామె. 8:13.

2 ప్రతీరోజు, సాతాను ఆధీనం క్రింద ఉన్న ఈ లోకాత్మ దాని దుష్ట మార్గాలను అవలంబించేలా మనపైకి విపరీతమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. (ఎఫె. 6:11, 12) మన అపరిపూర్ణ శరీరం పాపభరితమైనది. అది చెడు వైపుకు సహజంగా మొగ్గు చూపుతుంది. (గల. 5:17) అందుకే యెహోవా ఆజ్ఞలకు విధేయత చూపించేందుకూ, సంతోషంగా ఉండి జీవాన్ని పొందేందుకూ మనం దినమెల్లా ఆయనకు భయపడాలి.​—ద్వితీ. 10:12, 13.

3 హెబ్రీయులు 10:24, 25లలో ఒకరినొకరు పురికొల్పుకునేందుకు సమకూడాలని, మనం జీవించే ఈ కాలాల్లో “మరి యెక్కువగా” సమకూడాలని ఆదేశించబడ్డాము. ఈ అంత్యదినాల నుండి కాపాడబడాలంటే క్రమంగా కూటాలకు హాజరవ్వడం ప్రాముఖ్యం. దేవుణ్ని అసంతోషపర్చకుండా ఉండాలనే మన భయం, కూటాలకు హాజరయ్యేలా, వాటి సంకల్పాన్ని ఉన్నతంగా ఎంచేలా మనల్ని ప్రేరేపిస్తుంది. దేవునికి భయపడేవారు క్రైస్తవ కూటాల్లో భాగం వహించడాన్ని ఒక పవిత్రమైన ఆధిక్యతగా దృష్టిస్తారు.

4 దేవునిపై మనకున్న భయాన్ని ప్రదర్శించే మరొక మార్గం రాజ్యాన్ని గూర్చిన సువార్తను ప్రకటించాలన్న ఆజ్ఞకు విధేయత చూపించడమే. (మత్త. 28:19, 20; అపొ. 10:42) మన ప్రకటన పని యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటంటే యెహోవా పట్ల భయాన్ని అలవర్చుకునేలా, ఆయన చిత్తానికి లోబడేలా ఇతరులకు సహాయం చేయడమే. పునర్దర్శనాలు చేయడం ద్వారా, గృహ బైబిలు పఠనాలను ప్రారంభించేందుకు కృషి చేయడం ద్వారా, ఆ పై దేవుని ఆజ్ఞలన్నింటిని గురించీ బోధించడం ద్వారా మనం దాన్ని సాధించగలం. అలా మనం యెహోవా పట్ల భయాన్నీ, పొరుగువాని పట్ల ప్రేమనూ ప్రదర్శిస్తాము.​—మత్త. 22:37-39.

5 దేవునికి భయపడని వాళ్లు, ఆధ్యాత్మిక విషయాలపట్ల ప్రశంసాత్మకమైన వైఖరిని పెంపొందించుకోవడంలో విఫలమౌతారు. ప్రాణాంతకమైన ఈ లోకపు మృతతుల్యమైన వాయువుకు అంటే ఈ లోకపు మానసిక వైఖరికి లొంగిపోతారు. (ఎఫె. 2:2) “భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవచేయుద[మ]”నే దృఢనిశ్చయాన్ని కలిగివుందాము. (హెబ్రీ. 12:28) అలా చేసినప్పుడు దినమెల్లా యెహోవాకు భయపడే వ్యక్తులు పొందే ఆశీర్వాదాలను మనం కూడా పొందుతాము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి