రాజ్య వార్త నెం. 36పై ఏర్పడిన ఆసక్తిని పెంపొందించడం
1 మీకు కేటాయించిన రాజ్య వార్త నెం. 36 ప్రతులన్నింటినీ పంచిపెట్టేశారా? అది, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సమయానుకూలమైన ఒక ప్రశ్నను అడుగుతుంది, అదేమిటంటే: “నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?” 2000వ సంవత్సరం సమీపిస్తుండగా నూతన సహస్రాబ్ది ఏమి తెస్తుందోనని ప్రజలు పరిపరి విధాలుగా ఆలోచించారు. అలాంటి కొన్ని నిరీక్షణలను రాజ్య వార్త నెం. 36 పరిశీలిస్తుంది, అలాగే ప్రపంచంలోని పరిస్థితులు ఆశావాదానికి ఎటువంటి ఆధారాన్ని అందించడంలేదని గుర్తు చేస్తుంది. చాలామంది కోరుకుంటున్న శాంతి భద్రతలను ఒకే ఒక్క సహస్రాబ్ది, క్రీస్తు యేసు వెయ్యేండ్ల పరిపాలన మాత్రమే తీసుకువస్తుందని అది తెలియజేస్తుంది. ఆయన రాజ్యం ఎంతో వాస్తవికమైనదన్న మన ప్రగాఢ విశ్వాసం, సాధ్యమైనంతమందికి రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టడానికి మనలను ప్రేరేపించింది.
2 రాజ్య వార్తకు ప్రతిస్పందనలు: ఇంతకు ముందు మనం పంచిపెట్టిన రాజ్య వార్త ప్రతులు మన పనికి చక్కని ప్రేరకాలుగా ఉన్నాయి. రాజ్య వార్త నెం. 35 గురించి కెనడా బ్రాంచి ఇలా వ్రాసింది: “క్షేత్రంలో, ఈ ప్రత్యేక కార్యకలాపానికి ప్రచారకులు, పయినీర్లు ఉత్సాహంతో మద్దతునిచ్చారు, ప్రోత్సాహకరమైన అనేక అనుభవాలను ఆనందించారు.” ఇప్పుడు రాజ్య వార్త నెం. 36ను పంచిపెట్టడంలో కూడా మీరు అలాంటి ఉత్సాహాన్నే చూపించారనడంలో ఎంత మాత్రమూ సందేహంలేదు.
3 ప్రస్తుత రాజ్య వార్తను పంచే లక్ష్యం 2000, నవంబరు 30తో ముగిసింది. మీ సంఘానికి నియమించబడిన ప్రాంతం మొత్తం పూర్తి చేసేశారా? అలా చేయలేకపోతే, డిసెంబరు నెలలో కూడా ఈ ప్రత్యేక కార్యకలాపాన్ని కొనసాగించమని పెద్దలు మీకు చెప్పవచ్చు.
4 మీ ప్రాంతంలో రాజ్య వార్త నెం. 36 పంచిపెడుతున్నప్పుడు ఇప్పటి వరకు ప్రతిస్పందన ఎలా ఉంది? చాలా కొద్దిమంది మాత్రమే దేవుడు ఏమి కోరుతున్నాడు బ్రోషూర్ గురించి మరియు గృహ బైబిలు పఠనం గురించి కూపన్ నింపి పంపిస్తారు. సహస్రాబ్ది విషయంపై ప్రారంభంలోనే శ్రద్ధ చూపించిన చాలామంది, ఒక యెహోవాసాక్షి మళ్ళీ వెళ్తేనే కానీ చర్యతీసుకోరు. ఎవరైతే ఆసక్తి కనపర్చారో వారందరిని పునర్దర్శించాలి. అలా చేసేందుకు ఏది సరైన సమయం? పునర్దర్శనాలు సాధ్యమైనంత త్వరగా చేయాలి.
5 రాజ్య వార్త నెం. 35 అందించిన తర్వాత పునర్దర్శించడం మూలంగా వచ్చిన ఫలితాల అనుభవాలను గమనించండి. ఐర్లాండులోని ఒక పయినీరు రాజ్య వార్తను ఒక రెస్టారెంట్ యజమానురాలికి ఇచ్చింది. ఆమె ఆ సందేశానికి ప్రభావితురాలై ఆ సహోదరిని మళ్ళీ రమ్మని ఆహ్వానించింది. రెండు రోజుల్లో ఆ సహోదరి వచ్చి, బైబిలు పఠనం ప్రారంభించింది. డెన్మార్క్‌లో ఎవరూ లేని ఒక ఇంట్లో రాజ్య వార్త ప్రతిని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. అదే రోజు, అక్కడ ఆ ఇంట్లో నివసిస్తున్న స్త్రీ బ్రాంచి ఆఫీసుకు ఆ కూపన్‌ను పంపించింది, బ్రాంచి దాన్ని స్థానిక సంఘానికి తిరిగి పంపించడం జరిగింది. ఆ వారంలోనే ఇద్దరు సహోదరీలు వెళ్ళి ఆమెతో పఠనాన్ని ఏర్పాటు చేశారు, ఆ స్త్రీ తన మొదటి కూటానికి హాజరయ్యేందుకు రాజ్యమందిరానికి వచ్చింది!
6 మీరు తిరిగి సందర్శించినప్పుడు ఏమి చెప్పాలి: రాజ్య వార్త పంచిపెట్టిన తర్వాత పునర్దర్శనాలు చేయడం చాలా సులభం. అలాగే మన పరిచర్యలో ఆనందించదగిన అంశం కూడాను. పునర్దర్శనాలకు వెళ్ళేటప్పుడు మీతోపాటు రాజ్య వార్త నెం. 36 ఒక కాపీని తీసుకువెళ్ళడం మంచిది, ఎందుకంటే ఇంటి వారి వద్ద ఆ కాపీ ఉండకపోవచ్చు. ఈ క్రింద ఇవ్వబడిన సూచనలను మీరు పాటించవచ్చు.
7 మీరెవరో గృహస్థులకు గుర్తు చేసిన తర్వాత మీరిలా చెప్పవచ్చు:
◼ “‘నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?’ అనే ఒక కరపత్రాన్ని మీకు ఇచ్చాను. దాంట్లో, త్వరలో క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన, భూవ్యాప్త తోటలాంటి పరదైసు పరిస్థితులను ఈ భూమిపైకి తీసుకువస్తుందని చదవడం ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది కదూ? [రాజ్య వార్త నెం. 36లోని పరదైసుకు సంబంధించిన చిత్రాలను చూపించండి.] దాని వెనుక పేజీలో దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ గురించి మరింత సమాచారం తెలుసుకోమన్న ఆహ్వానం ఉంది.” బ్రోషూర్‌ను వాళ్ళకు చూపించి, 5వ పాఠాన్ని తెరచి, దాంట్లోని మొదటి ప్రశ్నను, 1, 2 పేరాలను చదివి, ఆ గృహస్థుడ్ని వ్యాఖ్యానించమనండి. ఒకటి లేక రెండు లేఖనాలను చదివి చర్చించండి. అవకాశముంటే, మరో ప్రశ్నను, పేరాను పరిశీలించి, మళ్ళీ వచ్చి చర్చను కొనసాగించే ఏర్పాటును చేసుకోండి.
8 డిసెంబరు నెలలోని ప్రతిపాదన “జ్ఞానము” పుస్తకం కాబట్టి, మీరిలా చెప్పవచ్చు:
◼ “ఇటీవల నేను మిమ్మల్ని కలిసినప్పుడు, ‘నూతన సహస్రాబ్ది—అది మీకు ఎలాంటి భవిష్యత్తును తీసుకువస్తుంది?’ అనే ఒక కరపత్రాన్ని మీకు ఇచ్చాను. అందులో ఉచిత గృహ బైబిలు పఠనాన్ని గూర్చిన ప్రస్తావన ఉంది. ఆ పఠనానికి మేము ఉపయోగించే సహాయకాన్ని మీకు చూపించేందుకు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను. [జ్ఞానము పుస్తకం 188-9 పేజీలను తెరిచి వారికి చూపించండి.] ఈ చిత్రంలో మీరు చూస్తున్న ఇలాంటి పరిస్థితులను తీసుకొని వచ్చేది బైబిలులో చెప్పబడుతున్న ఆ సహస్రాబ్ది మాత్రమే. పరదైసులో జీవించడానికి అర్హులవ్వాలంటే దేవుని గూర్చిన నిజమైన జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మేము బైబిలు పఠనం ఎలా చేస్తామో క్లుప్తంగా మీకు ప్రదర్శించనివ్వండి.”
9 రాజ్య వార్త నెం. 36 ప్రతిని పంచిపెట్టడం, మనం పరిచర్యలో పాల్గొనేందుకు మనల్ని మరింత చైతన్యవంతులను చేసింది, భారీ ఎత్తున సాక్ష్యాన్నిచ్చింది. అలాగే మీ సంఘ ప్రాంతంలోని అనేకమందిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఆసక్తిని పెంపొందించడానికి మనందరం కలిసి యెహోవా సహాయంతో చేసే ఈ కృషి, మరెందరో గొర్రెల్లాంటివారిని సంతోషానందాలతో కనుగొనేందుకు నడిపిస్తుంది.—మత్త. 10:11; అపొ. 13:48-50, 52.