కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/99 పేజీ 7
  • ప్రశ్నా భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నా భాగం
  • మన రాజ్య పరిచర్య—1999
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆరోగ్యం విషయంలో అత్యవసర పరిస్థితి రాకముందే సిద్ధపడండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • విశ్వాసమును—సవాలుచేయు వైద్యపరిస్థితిని ఎదుర్కొనుటకు నీవు సిద్ధముగా యున్నావా?
    మన రాజ్య పరిచర్య—1990
  • రక్త దుర్వినియోగమునుండి మీపిల్లలను సంరక్షించండి
    మన రాజ్య పరిచర్య—1992
  • రక్తం విషయంలో దేవుని అభిప్రాయం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1999
km 9/99 పేజీ 7

ప్రశ్నా భాగం

◼ తక్షణం చర్య తీసుకోవలసిన ఆకస్మిక పరిస్థితుల కోసం మీరు సిద్ధపడుతున్నారా?

ఆధునిక ప్రపంచంలో, ‘కాలమూ, అనూహ్య సంఘటనలూ’ ఏకమై, రక్తాన్ని ఎక్కించుకోమనే ఒత్తిడితో సహా, వైద్యపరంగా తక్షణ చర్యతీసుకోవలసిన ఆకస్మిక పరిస్థితిని సృష్టిస్తాయి. (ప్రసంగి 9:11, NW) కాబట్టి, రాగల అలాంటి పరిస్థితి కోసం మనం సిద్ధపడి ఉండగల్గేందుకుగాను, యెహోవా తన సంస్థ ద్వారా అనేక విధాలుగా సహాయాన్ని అందిస్తున్నా, ఆయన మన వంతు మనం చేయాలని నిరీక్షిస్తున్నాడు. మీకు సహాయపడే చెక్‌లిస్టు క్రింద ఇవ్వబడింది.

• ప్రస్తుత సంవత్సరపు అడ్వాన్స్‌ మెడికల్‌ డైరెక్టివ్‌/రిలీజ్‌ కార్డ్‌ను ఎల్లప్పుడూ మీతోపాటు ఉంచుకోండి.

• ప్రస్తుత సంవత్సరపు ఐడెంటిటీ కార్డు ఎల్లప్పుడూ మీ పిల్లలతోపాటు ఉండేలా చూడండి.

• మన రాజ్య పరిచర్య అక్టోబరు 1992 ఇన్‌సెర్ట్‌ను పునఃసమీక్షించి, మీ పిల్లవానికి చేయవలసిన ట్రీట్‌మెంట్‌కు సంబంధించి డాక్టర్లతోనూ, జడ్జీలతోనూ ఎలా సహేతుకంగా మాట్లాడవచ్చో రిహార్సల్‌ చేసుకోండి.

• రక్త ధాతువులను గురించీ, రక్తమార్పిడి ప్రత్యమ్నాయాలను గురించీ ప్రచురించబడిన శీర్షికలను పునఃసమీక్షించండి. (సిఫారసు చేయబడిన శీర్షికలు: కావలికోట అక్టోబరు 1, 1994, 31వ పేజీ; జూన్‌ 1, 1990 (ఆంగ్లం) 30-1 పేజీలు; మార్చి 1, 1989 (ఆంగ్లం) 30-1 పేజీలు; తేజరిల్లు! డిశంబరు 8, 1994, 23-7 పేజీలు; నవంబరు 8, 1993, 24-6 పేజీలు; డిశంబరు 8, 1992 10వ పేజీ; మన రాజ్య పరిచర్య అక్టోబరు 1992, డిశంబరు 1990 ఇన్‌సెర్ట్‌లు. అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేలా వాటిని ఒక ఫైలులో ఉంచుకోండి.)

• దేహానికి వెలుపల మీ రక్తాన్ని ప్రసరింపజేసే యంత్రాల్ని ఉపయోగించడానికి మీరు అనుమతించగలరా, లేదా రక్త ధాతువులున్న ఉత్పత్తుల్ని మీరు అంగీకరించగలరా అన్న విషయాన్ని మనస్సాక్షిపూర్వకంగా నిర్ణయం తీసుకోండి.

• ఆసుపత్రికి వెళ్ళే ముందు, సాధ్యమైతే, పెద్దలకు తెలియజేయండి. వాళ్ళు మీకు మద్దతునివ్వగల్గుతారు, అవసరమైతే వాళ్లు ఆసుపత్రి అనుసంధాన కమిటీని (హెచ్‌.ఎల్‌.సి) సంప్రదిస్తారు. చిన్న పిల్లవాని విషయంలోనైతే, ఆసుపత్రి అనుసంధాన కమిటీకి తెలియజేయమని పెద్దలను అడగండి.

మీరు రక్తాన్ని ఎక్కించుకోరన్న విషయాన్ని స్పష్టం చేయండి: కొంతమంది సహోదర సహోదరీలు, తాము రక్తాన్ని ఎక్కించుకోమన్న విషయాన్ని తమకు చికిత్స చేస్తున్న డాక్టర్లకు చివరి క్షణంలో చెబుతారని రిపోర్టులు చూపిస్తున్నాయి. వైద్య సిబ్బందితో అలా వ్యవహరించడం న్యాయం కాదు, అది రక్తాన్ని ఎక్కించే ప్రమాదాన్ని తెస్తుంది. మీ నమ్మకాలూ, మీ అభీష్టాలూ నిర్దిష్టమైన మీ నిర్దేశాలను తెలియజేసే డాక్యుమెంట్ల ద్వారా అంటే మీరు సంతకం చేసిన డాక్యుమెంట్ల ద్వారా బలపర్చబడ్డాయని డాక్టర్లకు తెలిస్తే, జాప్యం జరగకుండా చికిత్స చేయడంలో ముందుకు సాగడానికి వారికి సహాయపడుతుంది. అలా చేయడం, రక్తరహిత చికిత్స చేసేలా అదనపు చికిత్సా ఎంపికలను చేసుకోవడానికి వారికి అవకాశాన్నిస్తుంది.

వైద్యపరంగా తక్షణ చర్య తీసుకోవలసిన ఆకస్మిక పరిస్థితి ఏ సమయంలోనైనా తలెత్తవచ్చు, మీరు ఎదురుచూడని సమయంలోనే తలెత్తవచ్చు. కాబట్టి, రక్త మార్పిడి నుంచి మిమ్మల్నీ, మీ పిల్లల్నీ కాపాడుకోడానికి చర్యల్ని ఇప్పుడే చేపట్టండి.—సామె. 16:20; 22:3.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి