పాత పుస్తకాలను బాగా ఉపయోగించండి
1 మానవుడు ప్రపంచ నలుమూలల లక్షల కొలది పాత పుస్తకాలను గ్రంథాలయాల్లో భద్రపరిచాడు. మరి, అవి మానవజాతికి నిరంతర ప్రయోజనాన్ని ఏమన్నా తీసుకొచ్చాయా? (ప్రసం. 12:12) దేవుని రాజ్యం మీద, అది మానవజాతికి ఏం చేయబోతున్నదన్న విషయాలపై దృష్టిని సారింపజేసే సాహిత్యాలు అత్యంత విలువైనవి. అనేక సంఘాల్లో అటువంటి వివిధ పుస్తకాల స్టాకు ఉంది. జనవరిలో మనం ప్రజలకు ఈ పాత పుస్తకాలను ప్రతిపాదిస్తాము.
2 అవి నిజమైన విలువను కల్గి ఉన్నాయి: క్రొత్త సాహిత్యాలతో పోల్చి చూస్తే ఈ పుస్తకాలు గడువుతీరిపోయిన పుస్తకాలని మనలో అనేకులం భావించవచ్చు, అయితే అవి లేఖనాధార సత్యాన్ని కల్గి ఉన్నాయన్న విషయాన్ని మాత్రం తప్పక గుర్తించుకోవాలి. అవి వివరించే రాజ్యవర్తమానం ఈనాడు కూడా విలువైనదే, దాన్ని లక్ష్యపెడితే, అది జీవితాల్ని రక్షించగలదు. (యోహా. 17:3) కాబట్టి, ఈ పాత పుస్తకాలను బాగా ఉపయోగించేందుకు మనం నిజమైన ప్రయత్నం చేయాలి.
3 తన అమ్మమ్మ నుండి పాత వాచ్ టవర్ ప్రచురణలను వారసత్వంగా పొందిన ఒక స్త్రీ అనుభవం ఈ పాత సాహిత్యాల నిజమైన విలువను నొక్కి చెబుతున్నాయి. ఈ ప్రచురణల విలువ మీకు తెలుసా అని ఒక సాక్షి ఈ స్త్రీని అడిగింది. “నాకు వాటి విలువ తెలీదు, నాకెలా తెలుస్తుంది?” అని ఆ స్త్రీ అడిగింది. ఆ స్త్రీ బైబిలు పఠనాన్ని అంగీకరించింది, సత్యంలోకి వచ్చింది, అటుతర్వాత తన అమ్మమ్మ గ్రంథాలయాన్ని ఆమె అమూల్యమైనదిగా ఎంచింది. పాత పుస్తకాల సంచయం ఎంతటి విలువైన వారసత్వంగా నిరూపించబడింది!
4 వాటిని పంపిణీ చేయండి: ఇంటింటి పరిచర్యలో పాత పుస్తకాలను ప్రతిపాదించడానికి తోడు, మన సాహిత్యాలను చదివి ఆనందించే ప్రజలను పునర్దర్శించేటప్పుడు వారికి కూడా ప్రతిపాదించడం మరిచిపోవద్దు. కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాలను కట్టిన వారికీ, మ్యాగజైన్ రూట్లో ఉన్నవారికీ పాత పుస్తకాలను ప్రతిపాదించండి. మీతో ఎవరైతే కలిసి బైబిలు పఠిస్తున్నారో వారికి మీరు ఎంపిక చేసిన పాత పుస్తకాలను అందిస్తే, వారికి సత్యాన్ని గూర్చిన అవగాహనను పెంచడానికి సహాయం చేస్తాయి. మీ వ్యక్తిగత సేకరణలో ఏవైనా పాత పుస్తకాలు లేనట్లయితే, వాటిని సంపాదించడం మరిచిపోవద్దు. ఈ విధంగా, విలువైన దైవపరిపాలనా గ్రంథాలయాన్ని తయారుచేసుకుంటారు, అది మీ వ్యక్తిగత పఠన సమయాన్ని ఫలభరితం చేసుకునేలా ఉపయోగపడగలదు.
5 మన పాత పుస్తకాలను కేవలం భద్రపరచడానికి బదులు, “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచు” ప్రజలను కలిసినప్పుడు వారిని ప్రోత్సహించడానికి వాటిని బాగా ఉపయోగిద్దాము.—ప్రసం. 12:13.