ప్రశ్నా భాగము
◼ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయంలో ఏ ప్రచురణలను పెట్టాలి?
దేవుని ప్రజల ప్రయోజనార్థమై ఆత్మీయ ప్రచురణలను సమృద్ధిగా అందించడం జరిగింది. అనేకమంది ప్రచారకులకు వీటి స్వంత కాపీలు లేవు కనుక, రాజ్యమందిరంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయం, మరో విధంగా లభ్యంకాని ప్రచురణల్లో పరిశోధన చేసుకునేందుకు సహాయపడుతుంది. కనుక, వివిధ బైబిలు అనువాదాలతో, సంస్థ విడుదల చేసిన ఇటీవలి ప్రచురణలు, మన రాజ్య పరిచర్య ప్రతులూ, కావలికోట, తేజరిల్లు! పత్రికల బైండ్ చేసిన సంపుటులూ అలాగే కావలి కోట ప్రచురణల ఇండెక్స్‌లు ఉండాలి. దానికి తోడు, మంచి ఆధునిక నిఘంటువు ఒకటి ఉండాలి. అందుబాటులో ఉన్నట్లైతే, ఎన్‌సైక్లోపీడియాలూ, అట్లాసులూ, లేక వ్యాకరణం మరియు చరిత్రపై రెఫరెన్సు పుస్తకాలూ ఉన్నట్లైతే ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ముఖ్యంగా అవధానం ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందించిన ప్రచురణలపై ఉండాలి.—మత్త. 24:45.
కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నార్థకమైన పుస్తకాలను దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయంలో పెట్టడం జరిగిందని నివేదించబడింది. కాల్పనిక సాహిత్యాలనూ ఉన్నత విమర్శను ఉన్నతపర్చే బైబిలు వ్యాఖ్యానాలూ లేక తత్త్వశాస్త్రానికి, అభిచారానికి సంబంధించిన పుస్తకాలను చేర్చడం సమంజసంగా ఉండదు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయంలో, దాన్ని ఉపయోగించేవారు ఆత్మీయ అభివృద్ధిని సాధిస్తూనే ఉండేటువంటి పుస్తకాలను మాత్రమే చేర్చాలి.—1 తిమో. 4:15.
గ్రంథాలయానికి పాఠశాల అధ్యక్షుడు బాధ్యుడు, అయితే దాన్ని చూసుకునేందుకు ఆయనకు సహాయం చేసేందుకు మరో సహోదరుణ్ణి నియమించవచ్చు. కొత్త ప్రచురణలు అందుబాటులోకి వచ్చినవెంటనే వాటిని గ్రంథాలయంలో చేర్చడం ద్వారా, ఆ గ్రంథాలయం ఎల్లప్పుడూ కొత్త ప్రచురణలను కల్గివుండేలా అతను చూడాలి. ప్రతి పుస్తకంలోనూ, అది ఏ సంఘానికి చెందుతుందో సూచించేలా దాని లోపలి కవరుపైన స్పష్టంగా రాయాలి. సంవత్సరానికి ఒకసారి పుస్తకాలకు రిపేరుగానీ లేక వాటికి బదులు కొత్తప్రతుల అవసరం గానీ ఉందేమో పరిశీలించాలి.
గ్రంథాలయాన్ని చూసుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించవచ్చు. పుస్తకాలను పట్టుకోవడంలోనూ ఉపయోగించడంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు వాటితో ఆడుకునేందుకు అనుమతించకూడదు, లేక వాటిలో ఎవరూ గుర్తులు పెట్టుకోకూడదు. పుస్తకాలను రాజ్యమందిరం వెలుపలికి తీసుకువెళ్లకూడదని చెప్పే ఒక చక్కని బోర్డును జ్ఞాపికగా పెట్టండి.
నిరంతరం కొత్త సంఘాలు తయారౌతున్నాయి కనుక, చాలా గ్రంథాలయాలకు ఎక్కువ స్థలం లేకపోయే అవకాశం ఉంది. మన ప్రచురణల్లో పాతవి ఉన్న ప్రచారకులు వాటిని సంఘానికి ఇవ్వాలనుకోవచ్చు. సంస్థ పునఃప్రచురించిన కావలికోట బౌండ్ సంపుటులు లభ్యమౌతున్నట్లయితే లేదా లభ్యమౌతున్నప్పుడు వాటి కొరకు ఆర్డరు చేయాలని పెద్దలు అనుకోవచ్చు. ఈ విధాల్లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గ్రంథాలయం జ్ఞానాన్నీ, వివేకాన్నీ, గ్రహింపునూ ఇచ్చే దేవుని వాక్యంలో దాగివున్న సంపదను మనం వెలికి తీసేందుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.—సామె. 2:4-6.