పైవిచారణ కర్తలు నేతృత్వం వహిస్తారు—సంఘ పుస్తక పఠన నిర్వాహకులు
1 సంఘ పుస్తక పఠన నిర్వాహకుడిగా సేవ చేయడం యోగ్యత గల పెద్ద లేదా పరిచర్య సేవకుడికి ఒక విశిష్టమైన ఆధిక్యత. ఆయన తన గుంపు యొక్క ఆధ్యాత్మికావసరాలను చూసుకోవడమనేది ఒక గంభీరమైన బాధ్యత. ఆయన పనులు మూడు భాగాలుగా విభజించబడ్డాయి.
2 సామర్థ్యంగల బోధన: ప్రతి వారం తన గుంపు అర్థం చేసుకొనే రీతిలో పుస్తక పఠనాన్ని అందించడానికై సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు బాగా సిద్ధపడాలి. పఠించబడుతున్న సమాచారం పట్ల మెప్పుదలను అధికం చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. పఠనం జరుగుతూండగా వ్యాఖ్యానాలను అధికంగా చేయడానికి బదులు పాఠంలోని ముఖ్యాంశాలను రాబట్టడానికై ప్రస్తావించబడుతున్న అంశానికి తగినన్ని చిన్న ప్రశ్నలను కూడా తయారుచేస్తాడు. పఠనం ఆసక్తిగాను, ప్రబోధనాత్మకంగాను, ప్రతి ఒక్కరు చర్చలో భాగం వహించేలా చేయడమే ఆయన లక్ష్యం. ఆధ్యాత్మికంగా బలపర్చడం, పఠనం యొక్క ఆచరణాత్మక విలువను నొక్కిచెప్పడం, సమాచారాన్ని హృదయానికి మనస్సుకు చేరేలా చేయడం ఆయన గురి.—1 థెస్స. 2:13.
3 సహాయకర కాపరిపని: సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును.” (యెష. 32:2) ఆయన తన గుంపులోని అందరి పట్ల నిజమైన శ్రద్ధను చూపుతాడు, ఏ ఒక్కరు నిరుత్సాహపడినా వారికి ఆధ్యాత్మికంగా సహాయాన్ని అందించడానికై చూస్తాడు.—యెహె. 34:15, 16; 1 థెస్స. 2:7, 8.
4 ఉత్సాహపూరితమైన ప్రకటనాపని: సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు తన గ్రూపులోని అందరూ క్షేత్ర పరిచర్యలో పూర్తిగా భాగం వహించేలా వివేకయుక్తంగా ఆచరణాత్మక ఏర్పాట్లను చేస్తాడు. సేవ విషయమై తాను కనపరిచే క్రమబద్ధత, ఉత్సాహం, ఎడతెగని ప్రయత్నం తన గ్రూపులోని మిగిలిన వారిపై ప్రభావం చూపుతుందని తెలుసుకొని ఆయన ప్రకటనా పనిలో నాయకత్వం వహిస్తాడు. (కొలొ. 4:17; 2 థెస్స. 3:9) అదే సమయంలో, ఆయన సేవలో ప్రతి ఒక్కరితో కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తాడు. పరిచర్యలో మన ప్రకటనా, బోధనా సామర్థ్యాలను పదును పెట్టుకోవాలనుకొంటే, మన లక్ష్యాన్ని సాధించడానికి సంఘ పుస్తక పఠన నిర్వాహకుడు తోడ్పడగలడు.—1 తిమో. 4:16; 2 తిమో. 4:5.
5 ఆధ్యాత్మిక సహాయం, ప్రేమపూర్వక మద్దతును అందించడానికి సంసిద్ధతతో ఉన్న ఈ మనుష్యులలోని ఈవులను బట్టి మనం నిజంగా ఆశీర్వదించబడినవారమే. (1 థెస్స. 5:14) మనం పుస్తక పఠనంలో క్రమంగా పాల్గొనడం ద్వారా, ప్రకటనా పనికి నమ్మకమైన మద్దతును ఇవ్వడం ద్వారా యెహోవా నుండి వచ్చిన ఈ అద్భుతకరమైన ఏర్పాటు పట్ల మెప్పుదలను ప్రదర్శించవచ్చు.—హెబ్రీ. 10:25.