మన పొరుగువారు సువార్తను వినాల్సిన అవసరం ఉంది
1 ‘మనుష్యులందరు రక్షణపొంది సత్యాన్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానముగలవారై ఉండాలనేదే’ దేవుని చిత్తం. (1 తిమో. 2:4) ‘మనుష్యులందరిలో’ మన పొరుగువారు కూడా చేరివుంటారు. మన పొరుగువారికి సువార్తను అందజేయడానికి, మనం కలుసుకొనే ప్రతీ వ్యక్తికీ అనుగుణంగా మన అందింపులను మార్చుకొనే నైపుణ్యమూ, మరి ఆ వ్యక్తి ఆసక్తిని చూరగొనే దానిపై శ్రద్ధనిలపడమూ అవసరమౌతాయి. (1 కొరిం. 9:19-23) ‘నిత్యజీవమునకు నిర్ణయంపబడిన వారందరి’ హృదయాల్నీ చేరుకోవడానికి మనకు సహాయపడగల్గే పనిముట్లను యెహోవా సంస్థ దయచేసింది. (అపొ. 13:48) మన పొరుగువారి ఆధ్యాత్మిక అవసరాలతో వ్యవహరించేందుకు జూలై, ఆగస్టు నెలల్లో వివిధ బ్రోషూర్లను మనమెలా ఉపయోగించవచ్చో పరిశీలిద్దాం.
2 అందించాల్సిన బ్రోషూర్లు: ఆయా బ్రోషూర్లను అందించేటప్పుడు ఉపయోగకరంగా ఉండగల్గే సూచనలు క్రింద ఇవ్వబడ్డాయి. ప్రతీ సూచనకూ (1) సంభాషణను ఆరంభించడానికి ఆలోచనను రేకెత్తించే ఒక ప్రశ్న, (2) బ్రోషూర్లలో మాట్లాడదగు అంశాలు ఎక్కడెక్కడున్నాయో తెలియజేసే ఒక రిఫరెన్సు (3) చర్చ జరుగుతుండగా చదవడానికి ఆ చర్చకు తగ్గట్టుగా ఉండే ఒక లేఖనము జత చేబడ్డాయి. వ్యక్తి ప్రతిస్పందననుబట్టి, మీరు అందింపులో మిగిలిన భాగాన్ని మీ సొంత మాటల్లో చెప్పవచ్చు. అనేక బ్రోషూర్లకు, ఆ బ్రోషూర్ల కొరకైన మరింత వివరణాత్మక అందింపు ఉన్న మన రాజ్య పరిచర్య యొక్క గత సంచికలు ఇవ్వబడ్డాయి.
దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?
దౌర్జన్యం మూలంగా బాధకు గురైన ప్రజలకు సహాయపడడానికి ఏ నిరీక్షణ ఉందని మీరు అనుకుంటారు?—27-8 పేజీలు, 23-7 పేరాలు; యెష. 65:17, 18; km 7/97 పేజీ 8.
జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?
నేడు అనేకమంది ప్రజలు తమ జీవితాలతో అసంతృప్తి చెందినట్టుగా ఎందుకు కనబడుతున్నారు?—29-30 పేజీలు, 2, 25-6 పేరాలు; కీర్త. 145:16; km 7/96 పేజీ 4.
భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!
యేసుక్రీస్తు ఇప్పుడేమి చేస్తున్నాడని మీరెప్పుడైనా ఆలోచించారా?—41-42 చిత్రాలు; ప్రక. 11:15; km 8/96 పేజీ 8.
పరదైసును తీసుకొనివచ్చు ప్రభుత్వము.
యేసుక్రీస్తు ఏ రాజ్యాన్ని గురించి ప్రార్థించమని మనకు బోధించాడో ఆ రాజ్యాన్ని గురించి తెలుసుకోవడానికి మీరు ఇష్టపడతారా?—3వ పేజీ; మత్త. 6:9, 10.
మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే.
తమకెంతో ప్రియమైన వారిని మరణమందు కోల్పోయిన వ్యక్తిని ఓదార్చడమెలా అని మీరెప్పుడైనా ఆలోచించారా?—26వ పేజీ, 2-5 పేరాలు; యోహా. 5:28, 29; km 7/97 పేజీ 8.
త్రిత్వమును మీరు నమ్మవలయునా?
దేవుని నిజ అస్థిత్వాన్ని గూర్చిన మన అవగాహన మన భవిష్యత్తుకు ప్రాముఖ్యమంటారా?—3వ పేజీ, 3, 7-8 పేరాలు; యోహా. 17:3.
3 ఇతర బ్రోషూర్లు: హిందూ, ముస్లిమ్, బౌద్ధ, యూదా మతస్థులకు సాక్ష్యమిచ్చేందుకు ప్రత్యేకంగా తయారుచేయబడిన ఇతర ప్రచురణల జాబితా మన రాజ్య పరిచర్య ఫిబ్రవరి 1998 సంచికలోని ఇన్సెర్ట్లో ఉంది. ఆ జాబితాలో బ్రోషూర్లు కూడా ఉన్నాయి. మనం కలుసుకొన్న ప్రజలకు, తగినవనిపిస్తే బహుశా ఆ బ్రోషూర్లను ప్రతిపాదించవచ్చు. తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలోని 21-4 పేజీలతోపాటుగా ఆ సంచికలోని 4-6 పేజీల్లో ఉన్న ఇన్సెర్ట్నందలి సలహాల్ని మీరు పునఃసమీక్షించి, ఆ ప్రజలలో ఆసక్తిని రేకెత్తించే క్లుప్తమైన అందింపులను సిద్ధం చేసుకోవచ్చు.
4 బాగా చదువుకున్నవారైనప్పటికీ, బైబిల్ని గురించి అంతంత మాత్రంగానే తెలిసిన ప్రజలకు సహాయపడేందుకు మరో బ్రోషూరు తయారుచేయబడింది. అది, దేవుని వాక్యాన్ని పరిశీలించేలా వారిని ప్రేరేపించేందుకు రూపొందించబడింది. తగినచోట, మీరీ క్రింది బ్రోషూర్లను ప్రతిపాదించడానికి బహుశా ఎంపికచేసుకోవచ్చు:
సర్వమానవాళి కొరకైన గ్రంథము.
సమగ్రమైన విద్యను సముపార్జించడంలో, బైబిల్లో ఏమి ఉందనే దాన్ని గురించిన కొంత పరిజ్ఞానాన్ని పొందడం కూడా చేరివుందని మీరు అంగీకరిస్తారా?—3వ పేజీ, 1-3 పేరాలు అలాగే 30వ పేజీ, 2వ పేరా; ప్రసం. 12:9, 10.
5 బైబిలు పఠన బ్రోషూరు: మొదటి సందర్శనంలోనైనా లేదా అటుతర్వాత చేసే పునర్దర్శనంలోనైనా సరే బైబిలు పఠనాన్ని ప్రారంభించాలన్నదే పరిచర్యలో ఎల్లప్పుడూ మన లక్ష్యమై ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి, గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించి నిర్వహించడానికి మనకు అంటే ఎంతో సులభంగా ఉపయోగించగల్గే ఈ బ్రోషూరు ఉంది:
దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
కేవలం వారానికి 30 నిమిషాలుగానీ లేదా అంతకన్నా తక్కువగానీ వెచ్చిస్తే 16 వారాల్లో మీరు బైబిల్ని గూర్చిన ప్రాథమిక అవగాహనను సంపాదించవచ్చుననే విషయం మీకు తెలుసా?—పాఠము 2, 6వ పేరా; 2 తిమో. 3:16, 17; km 3/97 పేజీ 4.
6 మంచి పొరుగువాడైన సమరయుని గూర్చిన ఉపమానంలో, ఆపదలో ఉన్న మరొకరికి సహాయం చేసేందుకు ప్రేమనూ దయనూ చూపించేవాడే నిజమైన పొరుగువాడనే విషయాన్ని యేసు స్పష్టపర్చాడు. (లూకా 10:27-37) మన పొరుగువారు ఆధ్యాత్మిక ఆపదలో ఉన్నారు. వాళ్లు సువార్తను వినాల్సిన అవసరం ఉంది. వారితో సువార్తను పంచుకొనే బాధ్యతను నెరవేరుద్దాం, ఆ విధంగా యేసుక్రీస్తు నిజమైన శిష్యులమని మనం రుజువుచేసుకుందాం.—మత్త. 24:14; గలతీ. 5:14.