ఆసక్తిగల వారిని కనుగొనుటకై బ్రోషర్లను ఉపయోగించుట
1 బ్రోషర్లు చాల శక్తివంతమైన పరికరాలు. కేవలం 32 పేజీలలోనే, ఒక బ్రోషూరు లేఖనాధార సత్యాలను కచ్ఛితంగా నిరూపించి, దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న బోధలను, తర్కాలను పడద్రోయగలదు.—2 కొరిం. 10:5.
2 జెహోవాస్ విట్నెసస్—యునైటెడ్లీ డూయింగ్ గాడ్స్ విల్ వరల్డ్ వైడ్, అనే బ్రోషూరును చదివిన తరువాత ఒక వ్యక్తి ఇలా వ్రాయడానికి కదిలింప బడ్డాడు: “ఇటువంటి సంస్థీకరణను నేనెప్పుడూ చూడలేదు. . . . ఎంతో మతవేషధారణ వున్న ఈ కాలంలో దేవుని చిత్తాన్ని అంత గంభీరంగా తీసుకునే ప్రజలను కనుగొనడం అద్భుతం.” భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము! అనే బ్రోషూరును ఆఫ్రికాలోని ఒక మాంత్రికుడు చదివాడు. అది అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆయన తన మంత్రాచారాలను మాని, తన మొదటి భార్యను తప్ప తనతో జీవిస్తున్న ఇతర స్త్రీలను విడిచిపెట్టాడు. తరువాత ఆమెను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నాడు.
3 త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషూరు విపులంగా వ్రాయబడింది, కారణసహితమైంది మరియు సత్యం యొక్క ప్రభావవంతమైన పరికరం. వెస్ట్ ఇండీస్, జమైకాలోని ది సన్డే గ్లీనర్ కొరకు వ్రాస్తూ ఒక మత రచయిత ఇలా వ్యాఖ్యానించాడు: “ఈ ప్రచురణ . . . సాక్షుల చతురతతో కూడినపని, ఇప్పుడు ఏ త్రిత్వవాది లేక ద్వివాది కూడా క్షేమంగా వుండలేడు. త్రిత్వ సిద్ధాంతం బైబిలు నుండి తీసుకొనబడింది కాదని చూపించుటకు చారిత్రాత్మక, వేదాంత గ్రంథములనుండి ఆ కరపత్రం ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నది. . . . యేసు దేవుడనే ఉద్దేశానికి విరుద్ధంగా సాక్షులు క్రమబద్ధం చేసిన బలవంతపెట్టే, అధికారంగల తర్కాలకు సగటు—లేక సగటు కంటే ఎక్కువైన—చర్చి సభ్యుడు ఎలా జవాబివ్వగలడనేది చూడడం ఈ మత రచయితకు చాలా కష్టంగా వుంది.”
4 వాటిని సరిగా ఉపయోగించండి: ఈ ఆకర్షణీయమైన, అధికారపూర్వకమైన పరికరాలు ప్రభావవంతంగా ఉండాలంటే, వాటిని చదివేవారికి వాటిని అందజేయాలి. వేరు వేరు ఇతివృత్తాలతో వ్యవహరించే అనేక బ్రోషర్లు మనవద్ద ఉన్నాయి గనుక, మనం సాక్ష్యం యిస్తున్న వ్యక్తికి తగినది అని నిర్ణయించిన దానినే అందజేయటానికి ప్రయత్నించాలి. మన బ్రోషర్ల గురించి బాగా తెలుసుకుని, మన వద్ద రకరకాల బ్రోషర్లను ఉంచుకున్నట్లైతే, ప్రాంతీయ సేవలో, ఇంటివద్ద లేక మరెక్కడైనా మనం వాటిని సరైన విధంగా ఉపయోగించడం సులభమౌతుంది.
5 ఉదాహరణకు, జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఒకరు కృంగిపోయి వున్నట్లైతే, లేక భవిష్యత్తు పట్ల కొంత నిరీక్షణ వ్యక్తపరచినట్లైతే, ఏ బ్రోషూరును మీరు అందిస్తారు? ప్రేమగల దేవుడు దుష్టత్వమును ఎందుకు అనుమతించునని ఎవరైనా అడిగితే, ఏ బ్రోషూరు తగినట్లుంటుంది? ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ అవసరతను గూర్చి ఒక వ్యక్తి శ్రద్ధ వ్యక్తపరిస్తే, అతనికి ఏ బ్రోషూరు తగినదై యుంటుంది?
6 ఏ బ్రోషూరును ఉపయోగించాలి అనేది తెలుసుకోవడమే కాకుండా, దానిలోని విషయాలను గూర్చి ఆ వ్యక్తి యొక్క ఆసక్తిని పెంచుటకు ప్రయత్నించండి. ఒకవేళ పరిస్థితులు అనుమతిస్తే, విషయాన్ని చదువుటకు అతని ఆసక్తిని రేకెత్తించే ఒక వ్యాఖ్యానాన్ని లేక ఉపమానాన్ని ఎత్తిచూపించండి. లేకపోతే, ఒకటి లేక రెండు పేరాలు అతనితో కలిసి చదవండి, చూపబడిన లేఖనాలను తెరచి చూడండి, విషయాన్ని చర్చించండి. ఈ విధంగా అనేక మంచి బైబిలు పఠనాలు ప్రారంభించబడ్డాయి.
7 లోకంలో జరుగుచున్న హేయకృత్యముల విషయమై మూల్గు లిడుచు ప్రలాపించుచున్న వారికి మన బ్రోషర్లు లేఖనాధార జవాబులను అందజేసి, నిరీక్షణనిస్తాయి. (యెహెజ్కేలు 9:4 పోల్చండి.) ఆ సాహిత్యంలో ఉన్న సమాచారానికి గొర్రెలాంటి ప్రజలు ప్రతిస్పందిస్తారు. ఆసక్తి గలవారి కొరకు మనం వెదుకుతుండగా, మన పరిచర్యలోని ప్రతి రంగములోను బ్రోషర్లను సరిగా ఉపయోగించ గలుగుట మనకొక గొప్ప ఆధిక్యత.