ఆగస్ట్ పతాక నెల అవుతుందా?
1 1963వ సంవత్సరం యెహోవా ప్రజల పతాక సంవత్సరంగా ఉండింది. ఎందుకో మీకు తెలుసా? ప్రపంచవ్యాప్త ప్రచారకుల సంఖ్య పదిలక్షలకు చేరుకుంది అప్పుడే. ఆ సమయంలో మీరు సత్యంలో ఉండినట్లయితే, అంతమంది రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నందుకు మనం ఎంతగా ఉత్తేజితులమయ్యామన్న విషయం మీకు గుర్తుండవచ్చు! ఇప్పుడు అమెరికాలోనే అంత మంది ప్రచారకులు ఉన్నారు. అయితే, ప్రతి నెలా, కేవలం అమెరికాలోనే సరాసరి 90,000 మంది ప్రచారకులు పరిచర్యలో పాల్గొన్నట్లు రిపోర్టు చేయడమే లేదు. ఇప్పుడు ఇండియాలో కూడా అలాంటి పరిస్థితే ఉంది.
2 సవాలును స్వీకరించండి: ఆగస్ట్‌లో అమెరికాలో ప్రచారకుల సంఖ్యను మునుపటికన్నా ఎక్కువగా, అంటే పది లక్షలుగా చేయాలని సొసైటీ గట్టి ప్రయత్నం చేస్తోంది. ఇండియాలో మన లక్ష్యం 20,000. మన ప్రయత్నాలు విజయవంతమౌతే, ఇక్కడ కూడా ఆగస్ట్ పతాక నెలగా ఉంటుంది! మనమందరమూ మన వంతు చేస్తే, దాన్ని సాధించగలం.
3 సెలవులకు వెళ్ళడానికి పథకం వేసుకునే వాళ్ళు సెలవులకు వెళ్ళే ముందు పరిచర్యలో కొంత సమయాన్ని గడపవచ్చు. మీరు సెలవుల్లో కలిసే వారితో సాక్ష్యమిచ్చేందుకు కరపత్రాలనూ, బ్రోషూర్‌లనూ, లేదా పత్రికలను మీతో పాటు తీసుకెళ్లండి. అలాగే, మీరు వెళ్ళే చోట స్థానిక ప్రచారకులతో మీరు పరిచర్యలో పాల్గొని ఆనందించవచ్చు.
4 మీకు అనారోగ్యంగా ఉన్నా కూడా మీరు పరిచర్యలో భాగం వహించవచ్చు. మీరు డాక్టర్లకూ, నర్సులకూ, లేదా సందర్శకులకూ సాక్ష్యమివ్వవచ్చు. బహుశా మీరు ఉత్తరం ద్వారా లేదా టెలిఫోన్ ద్వారా సాక్ష్యమివ్వవచ్చు.
5 ఆగస్ట్‌లో ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేందుకు ఇవ్వబడే మద్దతును కొందరు నిస్సందేహంగా మెచ్చుకుంటారు. పెద్దలు, పరిచర్య సేవకులు, పఠన నిర్వాహకులు ఈ సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలి. ఏది ఏమైనా, మీరు ఆగస్ట్‌లో ప్రచారకునిగా ఎంచబడేందుకు, నెల చివరిలో అతి త్వరగా మీ ప్రాంతీయ పరిచర్య రిపోర్టును ఇవ్వడాన్ని ఎంతమాత్రం మరిచిపోకండి.
6 ఆధిక్యతను ప్రియమైనదిగా ఎంచండి: పరిచర్య అనేది “చక్కని నిక్షేపం.” (2 తిమో. 1:14, NW) సువార్తను ప్రకటించేందుకు మనకివ్వబడిన ఆధిక్యతను మనం గుణగ్రహిస్తాం. (1 థెస్స. 2:4) యెహోవా మన కోసం చేసిన ప్రతి దానినీ మనం పరిగణించినప్పుడు, మనం ఈ ప్రాముఖ్యమైన పనిని చేయడంలో సంవత్సరమంతా కొనసాగేందుకు మనం కదిలించబడాలి. మనం క్రమంగా ప్రకటనా పనిలో పాల్గొనడాన్ని ఆపేందుకు దేన్నీ అనుమతించకూడదు. మనం ఈ ఆగస్ట్‌ను యెహోవా సేవలో పతాక నెలగా చేద్దాం, ఆ తర్వాత ప్రతి నెలా కూడా ఆయన గురించి సాక్ష్యమివ్వాలని దృఢనిశ్చయం చేసుకుందాం!—కీర్త. 34:1.