కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/98 పేజీ 7
  • ఇరవై వేలు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇరవై వేలు!
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆగస్ట్‌ పతాక నెల అవుతుందా?
    మన రాజ్య పరిచర్య—1998
  • దైవపరిపాలనా వార్తలు
    మన రాజ్య పరిచర్య—1993
  • ఆగస్టు నెల చరిత్రలో నిలిచిపోవాలి!
    మన రాజ్య పరిచర్య—2014
  • 2000 ఏప్రిల్‌ను మన అపూర్వమైన నెలగా చేసుకోగలమా?
    మన రాజ్య పరిచర్య—2000
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 7/98 పేజీ 7

ఇరవై వేలు!

ఈ సేవా సంవత్సరం అంతానికల్లా ఇండియాలో రిపోర్టు చేసే ప్రచారకుల సంఖ్య ఇరవై వేలుకు చేరుకోవడాన్ని చూడాలనుకుంటున్నాము. మనం ఆ సంఖ్యను చేరుకునే అవకాశం ఉందా? అవును, ఉంది! ఆగస్టు 1997 చివరికల్లా ఇండియాలోని సంఘాల్లోని లెక్కలు, మొత్తం 18,781 ప్రచారకులు ఉన్నారని చూపించాయి. అయితే, ఆ నెలకు చూస్తే శిఖరాగ్ర సంఖ్య 17,534. దీనర్థం గత సేవా సంవత్సరంలో ఏ నెలను తీసుకున్నా 1,247 మంది ప్రచారకులు క్రమంగా రిపోర్టు చేయకుండా ఉన్నారన్నమాట. చాలామట్టుకు సంఘాల్లో కొద్దిమంది ప్రచారకులు క్రమంగా రిపోర్టు చేయడం లేదని సర్క్యూట్‌ పైవిచారణకర్తల రిపోర్టులు చూపిస్తున్నాయి. ప్రతి ప్రచారకుడు వర్షాకాలంలోని నెలల్లో పరిచర్యలో పాల్గొనేందుకు ఖచ్చితమైన ఏర్పాట్లు చేసుకుని, తాను చేసిన సేవను సమయానికి రిపోర్టు చేస్తే మనం తప్పకుండా 20,000 సంఖ్యను దాటగలము. నెలారంభంలోనే మొదలుపెడితే మనం సాక్ష్యపు పనిలో తప్పిపోకుండా కొంత సమయాన్ని గడపగలుగుతాము. సంఘంలోని పుస్తక పఠన నిర్వాహకులు తమ గ్రూపులో ఎవరైనా క్రమంగా రిపోర్టు చేయని ప్రచారకులు ఉంటే వారికి సహాయం చేయడానికి ప్రత్యేక ప్రయత్నాలను చేయాలి. గత నెలల్లో మీరు రెగ్యులర్‌ పబ్లిషర్‌గా లేనట్లైతే మీ పుస్తక పఠన నిర్వాహకుని సహాయాన్ని పొందమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము, ఆయన మీతో పనిచేయడానికై ఒక పార్ట్‌నర్‌ను ఏర్పాటు చేస్తాడు. సమష్ఠి ప్రయత్నాలతో మనం 20,000 శిఖరాగ్ర సంఖ్యను ఇండియాలో మొట్టమొదటి సారిగా దాటడాన్ని చూడాలి. అది యెహోవాకు ఎంతటి గొప్ప స్తుతి అవుతుంది!—కీర్త. 47:1.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి