శిష్యులను తయారు చేసే బైబిలు పఠనాలు
1 ఫిలిప్పు ఐతియోపీయుడైన నపుంసకునికి ‘యేసునుగూర్చిన సువార్త ప్రకటించిన తర్వాత’ అతడు, “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని” అడిగాడు. (అపొ. 8:27-39) నపుంసకుని విషయంలోనైతే, అతనికి దేవుని ప్రేరేపిత వ్రాతల ఎడల ముందే ఇష్టముండేది, ఫిలిప్పు ద్వారా ఆత్మీయ సహాయాన్ని పొందిన తర్వాత శిష్యునిగా తయారు కావడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. కానీ తమకై తాము లేఖనాలను పరిశీలించ వలసిన అవసరం ఉందని ప్రజలందరూ ఒప్పించబడలేదు.
2 కృతజ్ఞతాపూర్వకంగా, మన కాలం కొరకు ఇవ్వబడిన బైబిలు సందేశాన్ని ప్రజలు స్వల్పకాలంలోనే పరిశీలించడానికి సహాయపడేందుకు యెహోవా సంస్థ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ను అందజేసింది. ఈ బ్రోషూర్లోని సమాచారం, విద్యావంతులే అయినప్పటికీ బైబిలు గురించి ఎక్కువ తెలియని యథార్థవంతులైన ప్రజలను ఆకట్టుకుంటుంది. బైబిలును పరిశీలించాలని ఇష్టపడేలా ప్రజలను పురికొల్పడానికి ఈ చక్కని ఉపకరణం రూపొందించబడింది.
3 ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించేటప్పుడు, జ్ఞానం పుస్తకం ద్వారా ఫలవంతమైన పఠనాన్ని ఎలా నిర్వహించవచ్చుననే దాని గురించి జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్లో ప్రచురించబడిన శ్రేష్ఠమైన సలహాలను పునఃపరిశీలించడం సహాయకరంగా ఉంటుంది. పఠనం జరుగుతున్న కాలంలో, ఏ అంశాల్లో విద్యార్థికి మరింత అవధానాన్నివ్వవలసిన అవసరం ఉందో నిశ్చయించుకోగలిగేలా మీరు విద్యార్థి సాధిస్తున్న అభివృద్ధిని పరిశీలించండి. లేఖనాలను తెరిచి చూస్తూ ముందుగానే పాఠాలను సిద్ధపడమని విద్యార్థిని ప్రోత్సహించండి. తన స్వంత మాటల్లో చేసే వ్యాఖ్యానాలు సత్యం ఎడల అతనికున్న హృదయపూర్వక మెప్పును ప్రతిబింబించవచ్చు. సంస్థ ప్రచురణలను అదనంగా చదువుతూ, సంఘ కూటాలకు క్రమంగా హాజరయ్యేవారు సాధారణంగా త్వరితగతిన అభివృద్ధి సాధిస్తారు. తాను నేర్చుకుంటున్న దాన్ని అనియతంగా ఇతరులతో మాట్లాడమని అతన్ని ప్రోత్సహించండి. ఆత్మీయ అభివృద్ధిని సాధించడానికి అతడు ఏమి చేయవలసి ఉందో అతనికి దయాపూర్వకంగా తెలియజేయండి. నిర్ణయంతీసుకోలేక పోతున్న వారితో మనం పఠనాలను అనిర్దిష్టంగా నిర్వహించకూడదు. విద్యార్థులు నేర్చుకోవడానికి చొరవ తీసుకుని, సత్యం ఎడల దృఢమైన స్థానాన్ని వహించి, సమర్పణా బాప్తిస్మంల దిశగా అభివృద్ధి సాధించాలి.
4 కుటుంబంలోని వివిధ వ్యక్తులు వేర్వేరు పఠనాలను కలిగివున్నందున కొన్ని గృహాల్లో ఒకటికంటే ఎక్కువ పఠనాలు నిర్వహించబడుతుంటాయి. అయితే, అనేక సందర్భాల్లో, కుటుంబమంతా కలిసి పఠించడం మంచిది, ఎందుకంటే కుటుంబం ఆత్మీయంగా సన్నిహితమవ్వడానికి అది సహాయపడుతుంది.
5 మనం వెళ్లి శిష్యులను తయారుచేయాలనేదే యేసు ఆజ్ఞ. (మత్త. 28:19) అలా చేయాలంటే, “నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని” అడిగేంత స్థాయికి ఇతరులు పురోభివృద్ధి చెందేలా వారికి సహాయం చేసే బైబిలు పఠనాలను మనం నిర్వహించాలి.