బైబిలు విద్యార్థులను అభివృద్ధి చెందుటకై ప్రోత్సహించుము
1 ప్రపంచము ముఖ్యముగా సాంకేతిక మరియు వస్తు సంబంధమైన విషయాలలో అభివృద్ధి గాంచుటను గూర్చి తలంచును. అయితే యెహోవా ప్రజలు అలా కాదు. ఆత్మీయముగా అభివృద్ధి చెందుటకు మనకై మనము పోరాడుచుందుము. చురుకైన మరియు ఫలవంతమైన క్రీస్తు శిష్యులగుటకు మనలను నడిపించిన ప్రోత్సాహమును పొందియున్నందుకు మనము సంతోషించుదుము.—యోహా. 15:8; 2 పేతు. 1:5-8.
2 సువార్తలందు “శిష్యుడు” అను పదము ముఖ్యముగా క్రీస్తు బోధలను నమ్ముటయేగాక వాటిని సన్నిహితముగా అనుసరించువారికి అన్వయించబడియున్నది. (మత్త. 28:19, 20) బైబిలు విద్యార్థులు ఆ సత్యమును గుణగ్రహిస్తున్నారా? శిష్యులగుటలో అభివృద్ధి చెందుమని వారినెట్లు మనము ప్రోత్సహించగలము?
ఆసక్తిని సంస్థవైపు మళ్లించుము
3 ఒక విద్యార్థియొక్క అభివృద్ధియనేది తాను యెహోవాసంస్థను గుణగ్రహించుటతో తప్పక సంబంధమును కలిగియున్నది. బోధకులముగా మనము కలిగియున్న బాధ్యతలో ఒక భాగమేమనగా విద్యార్థి ఆసక్తిని దేవుని సంస్థవైపు మళ్లించుట. ప్రతి బైబిలు పఠన సమయమందును, ఐదు లేక పది నిముషములు సంస్థను గురించి ఏదో ఒక విషయమును వివరించుటకు సమయమును తీసుకొనుమని మనము అనేక సంవత్సరములుగా ప్రోత్సహించబడియున్నాము. దీనిని చేయుటకు జెహోవాస్ విట్నెసెస్—డూయింగ్ గాడ్స్ విల్ వరల్డ్ వైడ్ అను బ్రొషూరు శ్రేష్టమైన నమూనానివ్వగలదు. మీ బైబిలు విద్యార్థి ఒక ప్రతిని కలిగియున్నాడా? అట్లు లేనట్లయిన వెంటనే ఒకటి పొందునట్లు చూడుము. దానిని చదవమని ప్రోత్సహించి ప్రతి పఠనమందును, అందులోని కొద్దిభాగమును నీవు పరిశీలిస్తావని వివరించుము.
4 డూయింగ్ గాడ్స్విల్ (బ్రొషూరులోని 14 మరియు 15 పేజీలలోని సమాచారము సంఘములో జరుగు ఒక్కొక్క కూటముయెడల మెప్పును పెంచుటకై తయారుచేయబడినది. ప్రతివారము ఒకటి లేక రెండు పేరాగ్రాఫ్‌లను ఎందుకు పరిశీలించకూడదు? ఒక్కొక్క అవసరతను తీర్చుటకై ఒక్కొక్క కూటము ఎట్లు తర్ఫీదును మరియు బోధను అందించునో చూపుము. “సమాజముగా కూడుకొనుట” ద్వారా ఆత్మీయ అభివృద్ధి ప్రాప్తించగలదని గ్రహించునట్లు విద్యార్థికి సహాయపడుము. (హెబ్రీ. 10:24, 25) రాజ్యమందిరములో మనతో కలవమని ఆప్యాయముగా ప్రోత్సహించుము. యెహోవాయొక్క సమాజముగా కూడిన ప్రజలముగా అచ్చట మనము ఆనందించు ప్రేమ మరియు ఐక్యతను ఆయన అనుభవించును.—కీర్త. 133:1; యోహా. 13:35.
ఆత్మీయ పెరుగుదలను పురికొల్పుము
5 క్రొత్తవారు జ్ఞానమందును, గ్రహింపునందును, సూత్రముల అన్వయింపునందును వృద్ధిచెందుచూ నిజమైన బైబిలు విద్యార్థులుగా కావలసిన అవసరతయున్నది. ఇందునిమిత్తమే వీటిని పూర్తిచేయకముందు విద్యార్థి బాప్తిస్మము పొందినను లివ్‌ఫరెవర్, యునైటెడ్ వర్షిప్ లేక ట్రూపీస్ పుస్తకములను పఠించుటను మనము కొనసాగించుదుము. అనేక నెలల వరకు రెండవ పుస్తక పఠనమును ప్రారంభించుటకు విద్యార్థి సిద్ధము కాకపోయినను ఈ పుస్తక ప్రతులను విద్యార్థి పొందవచ్చును. ఇది తన ఆత్మీయదాహామును తీర్చుచు తన అభివృద్ధిని త్వరితము చేయుటకు అదనముగా చదువునట్లు పురికొల్పును. మరియు “తగినవేళ అందించు ఆహారమును” తీసుకొంటూ యుండులాగున వాచ్‌టవర్ మరియు అవేక్ చందాలను, సొసైటి ఇతర ప్రచురణలను కలిగియుండు విలువను మనము ఎత్తిచూపవలెను. (లూకా 12:42) అట్లు చేయువారు విశ్వాసమందు పాతుకుపోయి, నిర్మించబడి, స్థిరపరచబడుదురు.—కొలొస్స. 2:7.
6 భవిష్యత్తులో మన తోటి యెహోవాసాక్షులుగా కాబోవు బైబిలు విద్యార్థులు పరిపక్వతకు ఎదగాలంటే వారికి మన సహాయము అవసరము. (హెబ్రీ. 5:14) అభివృద్ధిని ప్రోత్సహించుటకు తగిన విధముగా అభినందించుటయు అవసరము. (ఫిలి. 3:16) తాను నేర్చుకొనుచున్న విషయములను తన కుటుంబము మరియు పరిచయస్థులతో పంచుకొనుచున్నాడా? అర్హుడైనట్లయిన దైవపరిపాలనా పాఠశాలలో చేరియున్నాడా? సువార్తయొక్క ప్రచారకుడగు కోరికను కల్గియున్నాడా?
7 బోధకులముగా మనము మన భాగమును చేసినట్లయిన యెహోవా యొక్క నిండైన ఆశీర్వాదములకు యెహోవావైపు చూడగలము. (2 కొరిం. 9:6) బైబిలు విద్యార్థుల నిమిత్తమై మనము చేయు ప్రార్థనా శక్తిని మనమెన్నటికిని మరువకూడదు. వారు నేర్చుకొను దానికి తగిన ప్రత్యుత్తరమిచ్చునట్లు వారిని నడపమని యెహోవాను అడుగుము. (1 కొరిం. 3:6, 7) సంఘముతో చురుకుగా సహవసించి, దేవునినామమునకు మహిమ మరియు ఘనతను కలుగజేయుటకై తీర్మానపూర్వకమైన చర్యను వారు తీసుకొందురు గాక.