సెప్టెంబరులోని సేవా కూటాలు
సెప్టెంబరు 1తో ప్రారంభమయ్యే వారం
పాట 26 (3)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “అతిప్రాముఖ్యమైన విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి.” ప్రశ్నాజవాబులు. సమయం అనుమతించినట్లయితే, తేజరిల్లు! (ఆంగ్లం) ఫిబ్రవరి 22, 1987 నందలి 8-9 పేజీల్లో ఉన్న “సరియైన ప్రాధాన్యతలను ఏర్పరచుకోవడం” అనే దానిపై వ్యాఖ్యానించండి.
20 నిమి: “కుటుంబ సంతోషానికిగల రహస్యమును ఇతరులతో పంచుకోవడం.” 1 మరియు 6-8 పేరాల్లో నుండి ఒక ప్రసంగం. 2-5 పేరాలను ప్రదర్శించండి. శిష్యులను చేయడం, పఠనాలను ప్రారంభించాలనే గురిని చేరుకోవడం వంటి విషయాలను మనస్సులో ఉంచుకోమని నొక్కిచెప్పండి.
పాట 107 (4) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 8తో ప్రారంభమయ్యే వారం
పాట 27 (29)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: స్థానిక అవసరతలు.
20 నిమి: “శిష్యులను తయారు చేసే బైబిలు పఠనాలు.” ప్రసంగం మరియు గుంపుతో చర్చ. సంఘ పెద్ద ఈ శీర్షికను పునఃసమీక్షిస్తాడు. ఆ తరువాత, పఠనాలను నిర్వహించే అనుభవంగల ప్రచారకులతో “సమర్పణ, బాప్తిస్మముల కొరకు విద్యార్థులను పురికొల్పండి” (km 6/96 ఇన్‌సర్ట్‌లోని 20-2 పేరాలు) అనే శీర్షికను ఆయన చర్చిస్తాడు.
పాట 109 (2) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 15తో ప్రారంభమయ్యే వారం
పాట 30 (22)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: సంభాషణను ప్రారంభించే విధానం. పరిచర్యలో మన విజయం, ఇతరులను అర్థవంతమైన సంభాషణలో పాల్గొనేలా చేయడంపైనే ఎక్కువగా ఆధారపడివుంటుంది. ఇతరులు వినేలా చేసేదేదైనా మనం చెప్పగలిగినప్పుడు, సాక్ష్యమివ్వడంలో మనం ఎదుర్కొనే ఒక పెద్ద ఆటంకాన్ని మనం అధిగమించినట్లే. పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), పాఠ్యభాగం 16, 11-14 పేరాల్లో ఉన్న కీలక సూచనలను ప్రేక్షకులతో చర్చించండి. ఈ క్రింద ఉదాహరించబడినటువంటి వారితో సంభాషించేటప్పుడు సంభాషణలను ప్రారంభించడంలో నిపుణత మరియు సామర్థ్యం ఉన్న ప్రచారకులు ఉపయోగించే ప్రారంభమాటలను చెప్పమనండి: (1) వీధిలో నడుస్తున్న వ్యక్తి, (2) బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి, (3) కౌంటరు వెనక ఉన్న క్లర్కు, (4) వాహనాలు నిలిపే స్థలంలో ఉన్న కొనుగోలుదారుడు, (5) పార్కు బెంచి మీద కూర్చుని ఉన్న వ్యక్తి, (6) టెలిఫోను సాక్ష్యం ద్వారా కలిసిన వ్యక్తి.
20 నిమి: పాఠశాల (ఆంగ్లం) బ్రోషూరును మీరు ఉపయోగిస్తున్నారా? కావలికోట (ఆంగ్లం) అక్టోబరు 1, 1985 నందలి 30-1 పేజీలను ఒక పెద్ద కొంతమంది తలిదండ్రులతోనూ మరియు పిల్లలతోనూ చర్చిస్తాడు. పాఠశాల బ్రోషూరును ఉపయోగిస్తూ వారు తమ వ్యక్తిగత అనుభవాలను చెబుతారు.
పాట 112 (16) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 22తో ప్రారంభమయ్యే వారం
పాట 32 (3)
5 నిమి: స్థానిక ప్రకటనలు.
23 నిమి: “1997 ‘దేవుని వాక్యంలో విశ్వాసం’ జిల్లా సమావేశం.” (1-16 పేరాలు) ప్రశ్నాజవాబులు. 10, 12, 15 పేరాలను చదవండి. మన పొందికైన క్రైస్తవ అలంకరణనూ, ప్రవర్తననూ జాగ్రత్తగా కాపాడుకోవడాన్ని గూర్చిన మరియు పిల్లలను సరిగా పర్యవేక్షించడాన్ని గూర్చిన లేఖనాధార ప్రాముఖ్యతను నొక్కి తెల్పండి.
17 నిమి: సంఘం యొక్క 1997 సేవా సంవత్సర నివేదికను పునఃసమీక్షించండి. సంఘం చేసిన మంచి కృషిని బట్టి ప్రాముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చేసిన మంచి కృషిని బట్టి సేవాధ్యక్షుడు సంఘాన్ని మెచ్చుకుంటాడు. అభివృద్ధి కొరకు సలహాలను ఇస్తాడు. కొత్త సేవా సంవత్సరం కొరకు కొన్ని ఆచరణాత్మకమైన లక్ష్యాలను, అలాగే ఐదు వారాంతాలున్న నవంబరు, మే, ఆగస్టు నెలల్లో సహాయపయినీరు చేయమని సంక్షిప్తంగా చెప్తాడు.
పాట 113 (12) ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 29తో ప్రారంభమయ్యే వారం
పాట 37 (9)
13 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రాంతీయ సేవా రిపోర్టులను ఇవ్వమని అందరికీ గుర్తుచేయండి. వచ్చే వారం పుస్తక పఠనంలో కుటుంబ సంతోషం అనే పుస్తకాన్ని పఠించడం ప్రారంభిస్తామని తెలియజేయండి. అక్టోబరులో చందా ప్రతిపాదనకు సిద్ధపాటుగా, అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీలో నుండి “మీ ప్రదేశాన్ని విశ్లేషించ”వలసిన, “పత్రికలతో మీరు బాగా పరిచయం చేసుకో”వలసిన, “మీ ప్రారంభ మాటలను సిద్ధం చేసుకో”వలసిన, వాటిని “గృహస్థునికి తగినట్లుగా మార్చుకో”వలసిన, “ఒకరికొకరు సహాయం చేసుకో”వలసిన అవసరతను చర్చించండి.
20 నిమి: “1997 ‘దేవుని వాక్యంలో విశ్వాసం’ జిల్లా సమావేశం.” (17-22 పేరాలు) ప్రశ్నాజవాబులు. 17వ పేరాను, ఉదాహరించబడిన లేఖనాలను చదవండి. క్రమం మరియు ఇతరులయెడల శ్రద్ధ కల్గి వుండవలసిన అవసరతను గురించి ప్రాముఖ్యంగా సీట్ల విషయంలో నొక్కి తెల్పండి. “జిల్లా సమావేశ జ్ఞాపికలను” పునఃసమీక్షించే క్లుప్త ప్రసంగంతో ముగించండి.
12 నిమి: మీ పరిచర్యను మహిమపర్చండి. మన పరిచర్య పుస్తకంలోని 81-3 పేజీలను ప్రేక్షకులతో చర్చించండి. ముఖ్య విషయాలను ఉన్నతపర్చడానికి ఇలా ప్రశ్నించండి: (1) యేసు మాదిరిని అనుసరించడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందాం? (2) ప్రకటించవలసిన మన బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనది? (3) మన జీవితాలను యెహోవాకు సమర్పించుకోవడానికి ఏవి పురికొల్పాయి? (4) ఒక వ్యక్తి దేవుని సేవించాలంటే ఎటువంటి ప్రవర్తన అవసరం? (5) యేసు ప్రకటించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోగలం?
పాట 121 (21) ముగింపు ప్రార్థన.