సరైన అభిముఖం గలవారికొరకు వెతకండి
1 “నిత్యజీవమునకు సరైన అభిముఖము గలవారిని” కనుగొనడం ప్రకటన పనిలో ఒక ఉద్దేశము. (అపొ. 13:48, NW) దీన్ని సాధించేందుకు కావలికోట, తేజరిల్లు! పత్రికలను పంచిపెట్టడం ఓ అద్భుతమైన మార్గంగా నిరూపించబడింది, ఎందుకంటే మన పత్రికలు రాజ్య నిరీక్షణను గూర్చి ప్రజలకు తెలియజేస్తాయి. ఏప్రిల్ నెలలో మనం ఈ పత్రికలకు చందాలను ప్రతిపాదిస్తాం. ఆసక్తి ఉన్న చోట నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంతో మనం క్రొత్త బైబిలు పఠనాలను ప్రారంభించవచ్చని ఆశిద్దాము. బహుశ మీకు ఉపయోగపడగల కొన్ని సలహాలు ఇక్కడ ఉన్నాయి:
2 ఏప్రిల్ 1, “కావలికోట”ను మీరు ఉపయోగించేటప్పుడు గత సంవత్సరపు జిల్లా సమావేశంలోని బహిరంగ ప్రసంగంపై కేంద్రీకరించబడిన “నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి!” అనే శీర్షికను చూపిస్తూ మీరు ఇలా చెప్పవచ్చు:
◼ “మేము సంభాషించే అనేకమందికి దేవుడంటే నమ్మకం ఉంది. చాలా తక్కువ మంది ఆయనను విశ్వసించడం కష్టంగా ఉన్నట్లు భావిస్తారు. మీరేమనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] ఒక దేవుడు ఉండివుంటాడని నిరూపించే నిజమైన రుజువులు మన చుట్టూఉన్నాయి. [కీర్తన 104:24 చదవండి.] ఓ కెమేరాను లేక ఓ కంప్యూటర్ను చూసినప్పుడు, దాన్ని ఓ తెలివిగల రూపకర్త చేసివుంటాడని మనం వెంటనే అంగీకరిస్తాము. అలాంటప్పుడు భూమి మరియు మానవులమైన మన వంటి అతి సంక్లిష్టమైనవి అకస్మాత్తుగా వచ్చాయని చెప్పడం సముచితమేనా?” దేవున్ని నమ్మేందుకు ఓ కచ్చితమైన కారణాన్ని చూపించేందుకు దానిలోని ఒక పేరాను ఉపయోగించండి. ఆ పత్రిక విలువను వివరించి, చందాను ప్రతిపాదించండి.
3 ఏప్రిల్ 15 “కావలికోట,” “సత్యారాధన దేవుని దీవెనను ఎందుకు అందుకుంటుంది” అనే శీర్షిక ప్రత్యేకాకర్షణగా ఉంది. అనుకూలమైన చోట దాన్ని అందించేముందు మీరు ఇలా ప్రశ్నించవచ్చు:
◼ “ప్రపంచంలో వందలకొలది మతాలున్నాయి కదా, మరి అవన్నీ దేవునికి ప్రీతికరమైనవేనా? [వ్యాఖ్యానించనివ్వండి.] అంగీకరించబడతామని అనేకమంది మతనాయకులు ఎన్ని చెప్పుకున్నప్పటికీ దేవుని చిత్తం చేయని వారు నిరాకరించబడతారని యేసు ముందుగానే చెప్పాడు. [మత్తయి 7:21-23 చదవండి.] యేసు నేర్పిన నిజమైన మతాన్ని మనం గుర్తించడం ప్రాముఖ్యం.” 16వ పేజీ నుండి ప్రారంభమయ్యే “నిజమైన మతం ఏ ఫలాలను ఉత్పత్తి చేయాలి?” శీర్షికాంశానికి త్రిప్పి, ఈ విషయాన్ని చూపేందుకు ఒక ఉదాహరణను చర్చించండి.
4 8, “తేజరిల్లు!” నందలి “యుద్ధాలు ఇక ఎన్నడూ లేనప్పుడు” అనే ముఖ్య శీర్షికను చూపిస్తున్నప్పుడు, ఇలా చెప్పవచ్చేమో పరిశీలించండి:
◼ “ఈ శతాబ్దంలో రెండు ప్రపంచ యుద్ధాలతో సహా వందల కొలది యుద్ధాలు జరిగాయి. అయినప్పటికీ ఇంచుమించు అందరు ప్రపంచ నాయకులూ తమకు శాంతి కావాలని చెబుతారు. నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్నే చెబుతారు. అందరూ శాంతిని కోరుకుంటున్నట్లయితే వారు దాన్నెందుకు సాధించలేరు? [ప్రతిస్పందించనివ్వండి.] భూమ్మీద నిజమైన శాంతిని చూసేందుకు ఏమి అవసరమని మీరనుకుంటున్నారు?” ఇంటివారు ప్రతిస్పందించిన తర్వాత, 8, 9 పేజీలకు త్రిప్పి, కీర్తన 46:8, 9 వంటి పాఠ్యభాగాలను చదవండి. అక్కడ సూచించిన చిత్రాలను వచనాలనూ ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా నిత్యం నిలిచే శాంతిని దేవుని రాజ్యం ఎలా తీసుకువస్తుందో చూపించండి. ఆ తర్వాత చందాను ప్రతిపాదించి, తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
5 తమకు తీరిక లేదని చెప్పే అనేకులను మీరు కలిసినట్లయితే మీరు దీన్ని ప్రయత్నించవచ్చు:
◼ “తీరిక లేని జీవితాలను గడుపుతూ జీవితంలోని ఆత్మీయ వైపున చూసేందుకు తీరిక లేనివారికి సహాయం చేయడంలో మేము ఆసక్తిని కనపరుస్తున్నాము. కావలికోట, తేజరిల్లు! అనే మా పత్రికలు మిమ్మల్నీ మీ కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రాముఖ్యమైన విషయాలపై సమాచారాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. మీరు ఈ ప్రతులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.”
6 పత్రిక చందాలను కట్టేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికీ రూ. 4.00 చందాకు అనేక విడి ప్రతులను అందించాలని జ్ఞాపకముంచుకోండి. ‘మెరుగైన సువార్తను’ తీసుకువచ్చే కావలికోట మరియు తేజరిల్లు!ల నుండి వారు ప్రయోజనం పొందుతారు.—యెష. 52:7.