మీ పొరుగువానితో సత్యమును మాట్లాడండి
1 “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను” ఆజ్ఞ రెండు అతి గొప్ప ఆజ్ఞల్లో ఒకటి. (మత్త. 22:39) అలాంటి ప్రేమ మన దగ్గరున్న శ్రేష్ఠమైన విషయాన్ని అంటే దేవుని వాక్యంలో మనం కనుగొన్న సత్యాన్ని మన పొరుగువానితో పంచుకోవడానికి మనలను పురికొల్పుతుంది. కావలికోట, తేజరిల్లు! పత్రికలు బైబిలు సందేశ సత్యాన్ని ఉన్నతపరుస్తున్నాయి కనుక, మే నెలలో ఈ పత్రికల కొరకు చందాలను ప్రతిపాదించడం మనం ‘మన పొరుగువానితో సత్యం మాట్లాడడానికి’ ఒక మార్గమైయున్నది.—ఎఫె. 4:25.
2 మీ దగ్గరున్న మే 8 “తేజరిల్లు!” పత్రికలు అయిపోయేంతవరకు వాటిని చూపిస్తూ ఉండండి. మీరు ఈ విధంగా అడుగుతూ మీ అందింపును మొదలుపెట్టవచ్చు:
◼ “యుద్ధం లేని లోకాన్ని గూర్చిన మీ ప్రతిక్రియ ఏమిటి? [ప్రతిస్పందించనివ్వండి.] ప్రపంచ మతాలు నిజానికి యుద్ధాలను, హత్యలను ప్రోత్సహిస్తున్నాయని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి.] దీనికి ఎంతో భిన్నంగా, దేవుని నిజమైన ఆరాధికులు ఏమి చేస్తారని బైబిలు చెబుతుందో గమనించండి.” పత్రికలోని 4వ పేజీలోని పై భాగం నుండి యెషయా 2:2-4 చదివి, తర్వాత 10వ పేజీలోని “శాంతిని ప్రేమించేవారికి ఆహ్వానం” అనే ఉపశీర్షిక క్రిందనున్న మొదటి పేరాను చదవండి. తరువాత, “దేవుడు దానిని ఎలా చేస్తాడో మీకు తెలుసా?” అని అడిగి, “దీనికి ఈ పత్రికలో జవాబు కనిపిస్తుంది” అని చెప్పండి. చందాను ప్రతిపాదించండి; దానిని నిరాకరించినట్లయితే, పత్రికల విడి ప్రతులను ప్రతిపాదించండి.
3 చందాలను ప్రతిపాదించేందుకు మే 15 “కావలికోట”ను చూపించేటప్పుడు, సురక్షితంగా లేమనే భావాన్ని ప్రజల్లో కలిగించిన ఇటీవలి వార్తను చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అడగండి:
◼ “ఈ జీవితంలో ఏది మనకు నిజంగా సురక్షిత భావాన్ని కలిగిస్తుందని మీరనుకుంటున్నారు? [ప్రతిస్పందించనివ్వండి.] నిజాయితీగా చెబితే, మానవజాతి ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మానవులను నమ్మడం వాస్తవికమని అంటారా? [ప్రతిస్పందించనివ్వండి; తర్వాత కీర్తన 146:3 చదవండి.] భవిష్యత్తును గూర్చి ఆశావాదియై ఉండేందుకు గల కారణాన్ని కీర్తనల రచయిత మనకు తర్వాత ఇస్తున్నాడు. [కీర్తన 146:5, 6 చదవండి.] ‘నిజమైన భద్రత, ఇప్పుడు మరియు నిరంతరం’ అనే ఈ శీర్షిక భూమిమీదికి మంచి పరిస్థితులను తెస్తాడని యెహోవా దేవునియందు మనమెందుకు నమ్మకముంచగలమో వివరిస్తుంది.” చందాను ప్రతిపాదించి, ఇప్పుడే భద్రతగల జీవితాన్ని అనుభవించడం ఎలా సాధ్యమో చర్చించడానికి తిరిగి వస్తామని చెప్పండి.
4 నిరుద్యోగ సమస్యను గూర్చి అంతటా వ్యక్తమౌతున్న చింత దృష్ట్యా, మే 22 “తేజరిల్లు!” (ఆంగ్లం) వెనుక పేజీలోవున్న “ఆయన ఎదురుచూసినది నిజాయితే” అనే అనుభవాన్ని బహుశా చక్కగా స్వీకరించవచ్చు. ఈ విధంగా అడుగుతూ మీరు దానిని చూపించవచ్చు:
◼ “పోటీ గల నేటి ఉద్యోగ విపణిలో యజమానులు ఉద్యోగానికి తాము తీసుకుంటున్న వ్యక్తుల్లో ఏ గుణాలను చూస్తారని మీరనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] మనం యజమానులమైనా, ఉద్యోగస్థులమైనా, లేక ఉద్యోగాన్ని వెదుక్కుంటున్నవాళ్ళమైనా పనిస్థలంలో నిజాయితీ అవసరతను గ్రహిస్తాము. ఒక నిజాయితీగల పనివానికి ఏమి లభిస్తుందనే ప్రోత్సాహకరమైన విషయాన్ని ఈ అనుభవం చూపిస్తుంది.” చందాను ప్రతిపాదించి, ఇలా చెప్పండి: “ఈ సారి వచ్చినప్పుడు మరో బైబిలు సూత్రాన్ని గూర్చి చర్చించడానికి నేను ఇష్టపడతాను, దాన్ని అనుసరిస్తే, ఈ అనిశ్చిత సమయాల్లో మన ఉద్యోగాలను నిలబెట్టుకోవడానికి అది మనకు సహాయపడగలదు.”
5 మీరు క్లుప్త అందింపును ఇష్టపడితే, మీరీ విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “నేటి ప్రజాదరణపొందిన పత్రికల్లో అనేకము మితిమీరిన వాణిజ్య విధానాన్ని, లైంగికతను, లేదా బలాత్కారాన్ని చూపిస్తున్నాయని చాలా మంది భావిస్తారు. [కావలికోటను, తేజరిల్లు!ను చూపించండి.] బైబిలు మీద ఆధారపడిన ఈ హితకరమైన పత్రికలను మేము అందిస్తున్నాము. ఇవి విద్యా సంబంధమైనవి, దేవున్ని ఆరాధించాలని మన పొరుగువారిని ప్రేమించాలని మంచి ప్రవర్తనను కాపాడుకోవాలని అవి మనకు బోధిస్తున్నాయి. మీరు ఈ విధమైన సమాచారాన్ని చదవడానికి ఇష్టపడితే, ఈ సంచికల్లో గల సమాచారాన్ని మీరు ఆస్వాదిస్తారని నాకు తెలుసు.”
6 మన పొరుగువారితో సత్యం మాట్లాడడంలో మనం ఆసక్తిగలవారమైతే, అనేకులకు మనం గొప్ప ఆనందాన్ని అందివ్వగలం.—అపొ. 8:4, 8.