కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/96 పేజీ 8
  • “వినుటవలన విశ్వాసం కలుగును”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “వినుటవలన విశ్వాసం కలుగును”
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘ఇదియే నిత్యజీవము’
    మన రాజ్య పరిచర్య—1996
  • నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని వ్యాప్తి చేయుట
    మన రాజ్య పరిచర్య—1996
  • దేవునినుండి వచ్చిన జ్ఞానం అనేక ప్రశ్నలకు జవాబుల్నిస్తోంది
    మన రాజ్య పరిచర్య—1997
  • నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని సంపాదించేందుకు ఇతరులకు సహాయపడండి
    మన రాజ్య పరిచర్య—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 4/96 పేజీ 8

“వినుటవలన విశ్వాసం కలుగును”

1 “నిత్యజీవమునకు సరైన అభిముఖము గలవారి”నెవరినైనా మనం కనుగొంటే అతను విన్న దాని గురించి ఆ వ్యక్తి విశ్వాసాన్ని బలపర్చడం ఆవశ్యకం. (అపొ. 13:48; రోమా. 10:17) అది సాధించేందుకు పత్రికలనూ తీసుకున్నవారివద్దకు, పత్రిక చందాలను కట్టినవారివద్దకు తిరిగి వెళ్ళి ఎక్కువగా సంభాషించాలి. మొదటి దర్శనంలో పత్రికలు మాత్రమే అందించినట్లయితే, పునర్దర్శనం సమయంలో పత్రిక చందాను ప్రతిపాదించవచ్చు. అయితే నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం నుండి పఠనం ప్రారంభించే లక్ష్యాన్ని కల్గివుండండి. మీకు సహాయపడగల కొన్ని సలహాలు ఇక్కడ ఉన్నాయి:

2 “నిత్యత్వం యొక్క రాజును స్తుతించుడి!” అనే శీర్షికను మీరు చర్చించిన చోట పునర్దర్శనం చేసేటప్పుడు మీరు ఇలా ప్రారంభించవచ్చు:

◼ “పోయినసారి మేము మీతో మాట్లాడినప్పుడు, సర్వోన్నత దేవుడు ఉన్నాడని నిరూపించే అద్భుతమైన రుజువులను మనం పునఃసమీక్షించాం. అయితే, ఆయన ఉన్నాడని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఆయన నామమును మనం తెలుసుకోవాలి. దేవున్ని మీరు ఏ నామంతో పిలుస్తారు? [ప్రతిస్పందించనివ్వండి.] అనేకులు ఆయన్ను కేవలం ‘ప్రభువా’ లేక ‘దేవా’ అని పిలుస్తారు, అవి వ్యక్తిగత బిరుదులు. ఇతరులు ఎన్నో రకాల నామములను ఉపయోగిస్తారు. బైబిలునందు ఆయన తనకు తాను ఏ నామాన్నిచ్చుకున్నాడో గమనించండి. [కీర్తన 83:18 చదవండి.] ఈ పుస్తకంలో వివరించబడినట్లుగా యెహోవా దేవుని గూర్చి బైబిలు ఇంకా ఎంతో చెబుతుంది.” జ్ఞానము పుస్తకంలోని 29వ పేజీలోని చిత్రాన్ని చూపించి అక్కడ వ్రాయబడిన దాన్ని చదవండి. 3వ అధ్యాయంలోని మొదటి మూడు పేరాలను చర్చించిన తర్వాత, మీరు ఓ పఠనాన్ని ప్రారంభించారన్నమాట!

3 “ప్రాపంచిక మతం ఎందుకు అంతమొందుతుంది” అనే శీర్షికను చర్చించిన వారితో, ఇలా అంటూ బహుశ ఆ ఆసక్తిని కొనసాగించాలని మీరనుకోవచ్చు:

◼ “శీర్షికను చదివిన తర్వాత, మనము మతాలన్నిటినీ ఒకే విధంగా దృష్టించలేమన్న వాస్తవాన్నిబట్టి మీరు ముగ్ధులై ఉండవచ్చు. సత్య మతమూ అబద్ధమూ రెండూ ఉన్నాయి. ఇది దేవుడు ఎవరి ఆరాధననుఅంగీకరిస్తాడనే సహేతుకమైన ప్రశ్నను లేవదీస్తుంది. దాని జవాబును యేసు అందించాడు, మరి అది ఈ పుస్తకంలో ఉన్నతపర్చబడింది.” జ్ఞానము పుస్తకంలోని 5వ అధ్యాయానికి త్రిప్పి యోహాను 4:23, 24 తో సహా నాలుగవ పేరాను చదవండి. ఆ తర్వాత, “ఓ ఉచిత గృహ బైబిలు పఠనాన్ని అంగీకరించేందుకు మీరు ఇష్టపడతారా?” అని అడగండి. దాని ప్రతిస్పందన అనుకూలమైతే, 1వ అధ్యాయానికి త్రిప్పి పఠనాన్ని ప్రారంభించండి.

4 “తేజరిల్లు!” మే 8 నందు ఆసక్తి కనిపించినట్లయితే, మీరు తిరిగి వెళ్ళినప్పుడు “జ్ఞానము” పుస్తకం నుండి పఠనాన్ని ప్రారంభించేందుకు ఇలా ప్రయత్నించండి:

◼ “చివరికి యుద్ధం లేని లోకాన్ని మనం చూడగల మన ఉత్తరాపేక్షను గూర్చి మనం మాట్లాడుకున్నామని మీకు జ్ఞాపకముండవచ్చు. అది నిజంగా ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. ఓ చిత్రకారుని ఊహ ఇలా ఉంది. [జ్ఞానము పుస్తకంలోని 188-9 పేజీల్లోని చిత్రాన్ని చూపించండి.] ఈ పరిసరాలను ఆనందించడం ఆహ్లాదకరంగా ఉండదా? [4-5 పేజీలకు త్రిప్పి చిత్రాన్ని చూపించి అక్కడి బాక్సును చదవండి.] ఈ పుస్తకం పేరు యోహాను 17:3 నందు కనిపించే యేసు మాటలను పోలినది. [చదవండి.] మీరనుమతిస్తే, జీవాన్ని కాపాడే ఆ జ్ఞానాన్ని కనుగొనేందుకు ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించాలనుకుంటున్నాను.” ఇంటివారు ఇష్టపడుతున్నట్లయితే, మొదటి అధ్యాయం నుండి పఠనాన్ని ప్రారంభించండి.

5 మీరు మొదట కలిసినప్పుడు తీరికలేని వ్యక్తిని మీరు తిరిగి కలిసినప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు:

◼ “నేను మిమ్మల్ని ఇటీవల సందర్శించి కావలికోట, తేజరిల్లు! పత్రికలనిచ్చాను. ఈ పత్రికలు జీవాన్నిచ్చే జ్ఞానాన్ని అందిస్తున్నాయి కనుక వాటిని మీరు క్రమంగా పొందాలని కోరుకుంటున్నాను.” ఆ తర్వాత పత్రిక చందాను ప్రతిపాదించండి. లేక “అందరూ బైబిలును అర్థం చేసుకోవడం మంచిదని నేననుకుంటున్నాను కనుక, అలా చేసేందుకు సహాయపడేదాన్ని చూపించాలని వచ్చాను.” జ్ఞానము పుస్తకాన్ని చూపించి, 3వ పేజీలోని విషయసూచికను చూపించండి. ఏ అధ్యాయం వారికి ఆసక్తికరంగా అనిపించిదో అడగండి, అక్కడికి పుస్తకాన్ని త్రిప్పి, పఠనం ప్రారంభించండి.

6 నిత్యజీవమునకు నడిపించే ‘విశ్వాస ద్వారమును ఇతరుల కొరకు తెరవ’గల్గినట్లయితే మన ఆనందం అధికమౌతుంది.—అపొ. 14:27; యోహా. 17:3.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి