ప్రశ్నాభాగం
◼ “సహోదరుడు,” “సహోదరి” అనే పదాల సరైన ఉపయోగమేమిటి?
అక్షరార్థ భావంలో ఉపయోగించినప్పుడు, “సహోదరుడు,” “సహోదరి” అన్న పదాలు ఒకే తలిదండ్రులకు పుట్టిన వ్యక్తులను సూచిస్తాయి. ఈ సహజమైన సంబంధం సాధారణంగా ఆప్యాయతానుబంధాన్ని సృష్టిస్తుంది, మరి వీరు అనుభవించే సన్నిహితత్వం సామాజిక, పర్యావరణ, అలాగే భావోద్రేక బాంధవ్యాలతో మరింత మెరుగుపడుతుంది.
ప్రార్థనలో “మా తండ్రీ” అని యెహోవాను పిలవాలని యేసు తన శిష్యులకు నేర్పాడు. ఆ పదం భావమేమిటంటే క్రైస్తవులుగా సన్నిహిత కుటుంబ వలయంలో మనమందరమూ భాగస్తులమే, అక్కడ మనం విలువైన ఆత్మీయ సంబంధాన్ని అనుభవిస్తాము. “మీరందరూ సహోదరులు” అని యేసు చెప్పినప్పుడు ఇది ఇంకా నొక్కి చెప్పబడింది.—మత్త. 6:9; 23:8.
దేవుని గృహంతో మనం కల్గివున్న సన్నిహిత ఆత్మీయ సంబంధాల వల్ల ప్రత్యేకంగా సంఘకూటాలవద్ద మనం ఒకరినొకరం “సహోదరుడు,” “సహోదరి” అని సంబోధించుకుంటాము. ఈ ఆత్మీయ సందర్భాల్లో, బాప్తిస్మం తీసుకున్న వారిని, వారి ఇంటిపేరుకు ముందుగా “సహోదరుడు” లేక “సహోదరి” అన్న పదాలను ఉపయోగిస్తూ సంఘాధ్యక్షుడు వారిని గుర్తిస్తాడు.
బాప్తిస్మము తీసుకోని వ్యక్తి కూటాలకు హాజరు కావాలని కోరుకున్నట్లయితే అప్పుడు ఏమిటి? ఒక వ్యక్తి కొంతకాలంగా యెహోవా ప్రజలతో సహవసిస్తూ సమర్పణను సమీపిస్తూ తనను తాను ఓ యెహోవాసాక్షిగా ఎంచుకుంటున్నట్లయితే, “సహోదరుడు” లేక “సహోదరి” అన్న పదాలను ఇంటి పేరుకు ముందుంచడంలో ఏ అభ్యంతరమూ లేదు. ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడైనట్లయితే అది ప్రత్యేకంగా నిజమౌతుంది.
మరోవైపున, మన కూటాలకు హాజరవ్వడం ప్రారంభించిన ఆసక్తిగల వ్యక్తులు, దేవుని గృహంలో భాగస్థులనేందుకు తగిన చర్యలను తీసుకోలేకపోవచ్చు. ఈ వ్యక్తులు “సహోదరుడు” లేక “సహోదరి” అని పిలువబడకపోవచ్చు, ఎందుకంటే దేవుని కుటుంబపు ఆత్మీయ బంధుత్వం వారికి లేదు. కనుక కూటాలు జరిగే సమయంలో, వారి ఇంటి పేరుతో పాటు “మిస్టర్” అన్న సముచితమైన పదాన్నుపయోగించి మరింత మర్యాద పూర్వకంగా సంబోధిస్తాము.
మన సంఘ కూటాల్లో “సహోదరుడు,” “సహోదరి” అన్న పదాలను ఉపయోగించడం, వారి అసలు పేర్లు సూచించేటువంటి సన్నిహితత్వంకంటే ఎంతో అమూల్యమైనదాన్ని మరియు అతి దగ్గరైన బంధాన్ని సూచిస్తుంది. అది మనం ఓ కుటుంబంగా, ఒక తండ్రి క్రింద మనం అనుభవించే ఆశీర్వాదకరమైన సంబంధాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనలో ఒకరి ఎడల ఒకరికున్న లోతైన ప్రేమానురాగాలు జ్ఞాపకానికి వస్తాయి.—ఎఫె. 2:19; 1 పేతు. 3:8.