కావలికోట మరియు తేజరిల్లు!—మన అత్యావశ్యక సమయాల కొరకైన పత్రికలు!
1 బైబిలు ప్రవచన నెరవేర్పుగా, ప్రపంచాన్ని కుదిపివేసే సంఘటనలు జరుగుతున్నాయి! ప్రపంచంలోను, దైవపరిపాలనా సంస్థలోను మన చుట్టూ జరుగుతున్న వాటిని గూర్చి మనం చింతిస్తుండగా, మనం రాజ్య “సువార్తను” ప్రకటించడం ఎంత అత్యావశ్యకమో గుణగ్రహించగలము. (మార్కు 13:10) ఏప్రిల్ నెలలో ఆసక్తితో పరిచర్య చేయడానికి ఇది మనకు తగిన కారణాన్నిస్తుంది.
2 ఈ నెలలో మనం నిర్వహించనున్న ప్రత్యేక పని ద్వారా మన వర్తమానం యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడుతుంది. మనం ఏప్రిల్, మే నెలల్లో పంచిపెట్టబోయే రాజ్య వార్త విడుదలవ్వడాన్ని ఆతురతతోకూడిన అపేక్షతో ఎదురు చూస్తాము. ఈ పని యెడల మన ఉత్సాహాన్ని అధికం చేయడానికి, అలాగే మన ప్రాంతంలో ఆసక్తిని కలిగించడానికి కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు, కలతపరచే ప్రపంచ సంఘటనల ప్రవచన భావాన్ని నొక్కి చెప్పే సమయోచిత శీర్షికలను కలిగి ఉంటాయి. పత్రికల్లో ఆసక్తిని రేకెత్తించే మరియు వాటి కొరకు చందా కట్టేందుకు ప్రజలను ప్రోత్సహించే అందింపును మనం ఎలా సిద్ధం చేసుకోగలం?
3 ఈ ప్రాథమిక చర్యలను గైకొనడం ద్వారా మీరు ఫలవంతమైన అందింపును వృద్ధిచేసుకోగలుగవచ్చు: (1) పత్రికలలో ఒకదాని నుండి మీ ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆకట్టుకునేదని మీరనుకునే శీర్షికను ఎంపిక చేసుకోండి. (2) గృహస్థునికి ఆసక్తి కలిగించేదని మీరు నమ్మే వాక్యాన్ని లేదా ఉదాహరించబడిన లేఖనాన్ని ఈ శీర్షిక నుండి ఎంపిక చేసుకోండి. (3) స్నేహపూర్వకమైన పలకరింపును, ఆసక్తికరమైన లేఖన తలంపును నొక్కిచెప్పే ప్రశ్నను లేదా వివరణను మరియు పత్రికలకు చందా కట్టవచ్చనే యథార్థమైన ఆహ్వానాన్ని చేర్చిన క్లుప్త అందింపును తయారు చేసుకోండి. మీరు గ్రహించగలిగినట్లు, ఇది ఎంతో సరళమైనది, క్లిష్టరహితమైనది. బహుశ, మీరు పరిచర్యలో మీతో పని చేసే మరొక ప్రచారకునితో కలిసి, ఒక అందింపును తయారు చేసుకోవచ్చు.
4 మే 8, “తేజరిల్లు!” “ఇవి అంత్యదినాలా?” అనే ప్రశ్నను లేవదీస్తుంది గనుక, “బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను” అనే చిన్న పుస్తకంలోని 5వ పుటనందలి “అంత్య దినములు” అనే శీర్షిక క్రింద ఉన్న సమాచారాన్ని మీరు పునఃసమీక్షించవచ్చు. మీరు ఈ విధంగా చెబుతూ ప్రారంభించవచ్చు:
◼ “మన చుట్టూ జరుగుతున్న సంక్షోభకరమైన సంఘటనల భావాన్ని చర్చించడానికి మేము సందర్శిస్తున్నాము. ఈ శీర్షిక ఏం చెబుతుందో గమనించండి . . .”
5 ఏప్రిల్ 1, “కావలికోట” ఈ ప్రశ్నను లేవదీస్తుంది: “మతం—ఓ నిషేధిత చర్చాంశమా?” ఈ పత్రికను అందించేటప్పుడు, మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “మతం వివాదాస్పదమైన అంశం గనుక, దానిని గూర్చి చర్చించకూడదని తరచూ చెప్పబడుతుంది. దానిని గూర్చి మీరేమని తలస్తారు?” తర్వాత, శీర్షికలోని ఒక వాక్యాన్ని సూచించండి.
6 “మత సత్యం పొందగల్గినదేనా?” అనే శీర్షికగల ఏప్రిల్ 15, “కావలికోట”ను మీరు ఉపయోగిస్తూ ఉండవచ్చు. మీరు ఈ ఉపోద్ఘాతంతో మంచి ప్రతిస్పందనను పొందవచ్చు:
◼ “నేడు అనేక మతాలున్నాయి గనుక, మత సత్యం పొందగల్గినదేనా అని కొంతమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈ ప్రశ్నకు నేను, మీరు సంతృప్తికరమైన జవాబును కనుగొనడానికి ఈ శీర్షిక ఒక మార్గాన్ని చూపిస్తుంది. . . .”
7 పరిచర్యకు వెళ్ళే ముందు, అందింపు అలవాటయ్యేందుకు మరొక ప్రచారకునితో దానిని ఎందుకు అభ్యాసం చేయకూడదు? అలా మీ సామర్థ్యాన్ని మరింత అధికం చేసి, మీకు మరి ఎక్కువ ఆత్మవిశ్వాసాన్నిచ్చే సహాయకరమైన సలహాలను మీరు పరస్పరం పంచుకోగలుగుతారు.
8 ఈ విధానాంతం సమీపిస్తుండగా, యథార్థహృదయులు మహాబబులోను నుండి తప్పించుకునేలా సహాయపడేందుకు మనం మన ప్రయత్నాన్ని అధికం చేయవచ్చు. (ప్రక. 18:4) ఎన్నడూ పునరావృతం గావింపబడని ఈ పనిలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలు ముఖ్య పాత్రను నిర్వహిస్తున్నాయి. మన ఉపయోగం కొరకు యెహోవా ఈ చక్కని ఉపకరణాలను ఇచ్చినందుకు మనం కృతజ్ఞులం!