అవసరత ఉందని మీకు అనిపించిందా?
1 యెహోవా సహాయకుడును ఆశ్రయమునై ఉన్నాడని వర్ణించబడ్డాడు. అవసరతలో ఉన్న సమయంలో మనం ఆయన చెంతకు వెళ్ళగలమని, ఆయన మనకు సహాయం చేస్తాడని మనకు తెలుసు. (కీర్త. 18:2; 46:1) అవసరం ఉందని మనం గ్రహించినప్పుడు ఇతరులకు సహాయం అందించడం ద్వారా మనం ఆయన యొక్క ఈ ప్రాముఖ్యమైన గుణాన్ని అనుకరించగలము.
2 ఒక వ్యక్తి మరొకరికి సహాయపడేందుకు ప్రత్యేక ప్రయత్నం చేయడానికి అతనిని ఏది పురికొల్పుతుంది? అనేకమంది ప్రజలు దీనిని చేయవలసిన ప్రేమపూర్వకమైన, దయాపూర్వకమైన పనియని గుర్తిస్తారు. తప్పకుండా దేవుని వాక్యం దీనిని ప్రోత్సహిస్తుంది. (రోమా. 15:1) ‘మనలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను’ అని పౌలు మనల్ని పురికొల్పుతున్నాడు.—ఫిలి. 2:4.
3 దీనిని చేయడంలో మనమందరం సంతోషాన్ని కనుగొనగలం. (అపొ. 20:35) తన సహోదరుల ‘క్షేమవిషయమై నిజముగా చింతించువాడు’ అని పౌలు తిమోతిని గూర్చి మాత్రమే మాదిరిగా చెప్పాడు. (ఫిలి. 2:20) నేడు సంఘాల్లో అలాంటి దృక్పథం గల అనేకమంది యౌవనస్థులు మనకున్నారన్నది ప్రశంసనీయం. అయితే మనం వృద్ధులమైనా లేక యౌవనస్థులమైనా అవసరముందని మనకు కనిపించిన చోట మనం చేయగల పనులు ఉన్నాయి.
4 కొందరికి మరింత శ్రద్ధనివ్వవలసిన అవసరాలున్నాయని, మీరు ఎప్పుడైనా భావించారా? ఒకవేళ, ఒక సహోదరుడు లేదా సహోదరి ఆసుపత్రిలో ఉన్నారు, కొందరే సందర్శించడానికి వచ్చారు; లేదా ఒకరు అశక్తులయ్యారు, కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు లేదా ఇంటి పనుల్లో సహాయపడడానికి ఎవరూ లేరు. యెహోవాను సేవించేవారిని ఒకరిపై ఒకరు నిజమైన శ్రద్ధ చూపించే కుటుంబ సభ్యులుగా యేసు ఎంచుతాడు. (మార్కు 3:33-35) గొర్రెలు, మేకలను గూర్చిన ఉపమానంలో, రాజు ఆమోదముతో కుడిపార్శ్వమున ఉండే వారు రాజు సహోదరులకు సహాయపడడం వలన ఆ స్థానాన్ని పొందుతారని ఆయన చూపించాడు.—మత్త. 25:40.
5 నేనెలా సహాయం చేయగలను? ఎదురుగా అవసరత ఉన్నప్పుడు సహాయం అందించేందుకు ఏం చేయవచ్చు? ఏదైన ఒక విధంగా సహాయపడడానికి మనం చొరవ తీసుకోవచ్చా? బహుశ, ప్రోత్సాహం అవసరమున్న వృద్ధులు ఉండవచ్చు, కాని వారికి సహాయపడేందుకు సన్నిహిత సహవాసులు లేకపోవచ్చు. సహాయం అవసరమున్న యౌవనస్థులు ఉండవచ్చు. క్రొత్తగా ఆసక్తిగల ఒక కుటుంబం తమకు పఠనం నిర్వహిస్తున్న ప్రచారకుడు లేనప్పుడు చాలా మంది పిల్లలతో రాజ్య మందిరానికి వచ్చి ఉండవచ్చు. తమ పిల్లలతో తమకు సహాయపడేందుకు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రావడాన్ని వారు మెచ్చుకోవచ్చు.
6 సత్యం ఎడల మరియు యెహోవా సంస్థ ఎడల ప్రేమ కలిగి ఉండడంలో మనం పెరుగుతూ ఉంటే, సంఘంలోని ఇతరుల ఎడల కూడా మనకు మెప్పు మరియు శ్రద్ధ పెరుగుతుంది. ఈ విషయంలో మన హృదయాలను విశాలపరచుకోవాలని పౌలు మనలను ప్రోత్సహించాడు. (2 కొరిం. 6:11-13) మనం నిజంగా యేసు అనుచరులమని చూపించడానికి, ముఖ్యమైన మార్గము ఒకరి ఎడల ఒకరం ప్రేమ చూపడమేనని ఆయన నొక్కి చెప్పాడు.—యోహాను 13:35.
7 అవసరం ఉందని మనకు కనిపించినప్పుడు, మన సహోదరుల ఎడల మరియు సంఘం ఎడల మనకున్న మన నిజమైన ప్రేమ మనం చొరవ తీసుకుని, మనం ఏ విధంగా సహాయపడగలమో, ఆ విధంగా సహాయపడడానికి మనలను పురికొల్పాలి. (గల. 6:9, 10) ఇతరుల యెడల మనకు గల ఈ శ్రద్ధ ప్రేమా ఐక్యతలయందు మనలను మరింత సన్నిహితులను చేస్తుంది. (1 కొరిం. 10:24) ఈ విధంగా, సంఘంలోనున్న అవసరతను తీర్చడంలో సహాయపడేందుకు మన భాగాన్ని మనం నిర్వహిస్తాము.