బోధింపబడదగినవారి కొరకు అన్వేషించండి
1 “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” (యోహాను 6:44) హృదయాన్ని పరిశోధించువాడైన యెహోవా బోధింపబడదగినవారికి మరియు తాము నేర్చుకున్న దాని ప్రకారం నడుచుకొనేవారికి ప్రతిఫలమిస్తాడు. (యిర్మీ. 17:10; యెహా. 6:45) క్రొత్త లోకం కొరకు నిరీక్షించే సాత్వికులను వెదకడంలో ఆయన జతపనివారముగా ఉండే ఆధిక్యత మనకుంది.—కీర్త. 37:11; 1 కొరిం. 3:9.
2 యేసు తన శిష్యులను “మనుష్యులను పట్టుజాలరులనుగా” వర్ణించాడు. (మత్త. 4:19) అలాంటి పనికి కొన్నిసార్లు పట్టుదల అవసరమున్నను, మంచి ఫలితాలను పొందడంలో ఎక్కువ సంతృప్తి ఉంది. మన వ్యక్తిగత ప్రయోజనం కొరకు పనిచేసే బదులు, మనం “చేపలను” ఒక నాశనం నుండి నిజంగా రక్షిస్తున్నాం. చేపను ఆకట్టుకోవడానికి ఏం చేయాలో ఒక సఫలుడైన జాలరికి తెలిసి ఉండాలి. అలాగే, శ్రోతల ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయమైన విధంగా మనం రాజ్య వర్తమానాన్ని అందించాలి. ప్రాముఖ్యంగా మనం పునర్దర్శనాలను చేసేటప్పుడు ఇది నిజం. మనం ఏం చెప్పగలం?
3 మతాన్ని గూర్చి చర్చిస్తున్న “కావలికోట” శీర్షికలలో ఆసక్తి కనబరచబడినట్లయితే, మీరు ఈ విధంగా చెప్పవచ్చు:
◼ “అనేక మంది ప్రజలు ఎందుకు మతాన్ని గూర్చి చర్చించడానికి ఇష్టపడరు అనే దాన్ని గూర్చి క్రితం మనం మాట్లాడుకున్నాం. మన పొరుగువారిలో అనేకులు మతానికి చెందినవారని చెప్పుకుంటున్నారు గనుక, అది ఆశ్చర్యకరమని మీరు భావించరా? మతం ఎందుకు అంత విభాగించేదిగాను, వివాదాస్పదమైన అంశంగాను ఉందని బహుశ మీరు ఆశ్చర్యపోవచ్చు.” జవాబు చెప్పనివ్వండి. తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలోని 322వ పుటకు త్రిప్పి “మరీ ఇన్ని మతాలు ఎందుకు ఉన్నాయి?” అనే శీర్షిక క్రింద ఉన్న కొన్ని అభిప్రాయాలను పంచుకోండి.
4 మతం అనే అంశంపై చర్చ ఆరంభించడానికి మీరు ఇలాంటి సమాచారాన్ని ఉపయోగించవచ్చు:
◼ “మనకు నిజమైన మతముందని నిశ్చయపరచుకోవడానికి ఏదైనా మార్గముందా? [జవాబు చెప్పనివ్వండి.] విభిన్నమైన అనేక మతాలున్నందువల్ల, అనేకమంది ప్రజలు కలత చెందుతున్నారు మరి అనిశ్చయతతో ఉంటున్నారు.” తర్కించుట అనే పుస్తకంలోని “ఏ మతం సత్యమో ఒక వ్యక్తి ఎలా తెలుసుకోగలడు?” అనే ప్రశ్నను చర్చిస్తున్న 328-9 పుటలకు త్రిప్పండి. “దాని సభ్యులు నిజంగా ఒకరినొకరు ప్రేమిస్తారా?” అనే ఐదవ ప్రశ్నపై క్లుప్తంగా వ్యాఖ్యానించండి. వ్యక్తిగత బైబిలు పఠనం ద్వారా ఎక్కువగా ఎలా నేర్చుకోవచ్చో వివరించండి.
5 గృహస్థుడు ప్రపంచ పరిస్థితులను గూర్చి వ్యాకులపడుతున్నట్లు కనిపించినట్లయితే, మీరు ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నించవచ్చు:
◼ “మనం జీవించడానికి, మన కుటుంబాలను పోషించడానికి మనమెదుర్కోవలసిన చెడు పరిస్థితులను గూర్చి మీరు వ్యాకులపడుతున్నారన్నది స్పష్టం. సమీప భవిష్యత్తులో దేవుడు నెరవేర్చనున్న అద్భుతమైన వాగ్దానాన్ని గూర్చి బైబిలు తెలియజేస్తుంది.” సామెతలు 2:21, 22 చదివి, నిత్యము శాంతి నెలకొనివుండే లోకాన్ని యెహోవా ఎలా వాగ్దానం చేశాడో వివరించండి.
6 ప్రత్యేక రాజ్య వార్త ప్రచారం మొదలైన తర్వాత, పునర్దర్శనాలను చేసేటప్పుడు, రాజ్య వార్త లేని గృహస్థునికి ఒక ప్రతిని తప్పకుండా ఇవ్వండి. రాజ్య వార్తను ఇచ్చిన తర్వాతి పునర్దర్శనాల్లో మీరు ఏం చెప్పాలో మన రాజ్య పరిచర్య మే సంచికలో చర్చించబడుతుంది.
7 దేవుని వాక్యం ‘బలము గలది’ గనుక, దానిని మన అందింపులలో ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేయాలి. (హెబ్రీ. 4:12) స్వయంగా బైబిలు చదవమని గృహస్థుడ్ని ప్రోత్సహించడం మరువకండి. (అపొ. 17:11 పోల్చండి.) మన వంతు మనం శ్రద్ధతో చేసినట్లయితే, యెహోవా మన ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడు.