కావలికోట—తగినవేళ ఆత్మీయాహారము
1 దాదాపు 114 సంవత్సరాలుగా కావలికోట దాని పాఠకులను ఆత్మీయముగా మెలకువతో ఉండమని ఉద్బోధిస్తుంది. దానితో జతగావచ్చే అవేక్! కూడా మన తరములోనే రాబోవు శాంతియుతమైన భద్రతగల నూతనలోకాన్నిగూర్చిన సృష్టికర్త వాగ్దానంపై నమ్మకాన్ని నిర్మిస్తుంది. ఈ రెండు ప్రచురణలు అంధకారమయమైన ఈ లోకంలో మనకు వెలుగు చూపడానికి నమ్మకమైన ఉపకరణాలుగా పనిచేస్తున్నాయి. (యెషయా 60:2) దేవుని వాక్యసత్యమెన్నటికీ మారదుగానీ, “తగినవేళ ఆత్మీయాహార” మందించడానికి యెహోవా ఉపయోగించే వీటిద్వారా మరితర ఉపకరణములద్వారా దానిగ్రహింపు మనకు తేటపడుతుంది.—మత్తయి 24:45; సామె. 4:18.
2 పత్రికలను శ్రేష్ఠమైనరీతిలో ఉపయోగించండి: ఇతరులను కావలికోట, అవేక్! లను చదవమని ఉత్సాహంగా ప్రోత్సహించడంద్వారా మనం పొందే ఆత్మీయ జ్ఞాన వికాసానికి కృతజ్ఞత చూపినవారము కాగలము. ఏప్రిల్, మే మాసాలలో కావలికోట పత్రికకు ప్రజలు చందాకట్టేలా ఇంటింటి పరిచర్యలో మనము ప్రత్యేక ప్రయత్నం చేస్తాము. అంతేగాక మనదగ్గరనుండి అప్పుడప్పుడు పత్రికలను కొంతమట్టుకు క్రమంగా తీసుకొంటూ చదివి ఆనందించేవారు మనకు తెలిసివుండవచ్చు. అలాంటివారిని ఏప్రిల్, మే నెలల్లో మరలా కలిసి ఒకవేళ చందా కట్టినట్లైతే పోస్టుద్వారా పత్రికలు వారిండ్లకు ఎలా క్రమంగా వస్తాయో చూపి, చందా కట్టడానికి వారిని ఆహ్వానించవచ్చును.
3 చందా కట్టినా కట్టకపోయినా, మన సమాచారంపై శ్రద్ధచూపే వారియొద్దకు తిరిగివెళ్లి, వారిని మరలా దర్శించవలసివున్నాము. వారిలో నిజమైన ఆసక్తివుందని మీరెలా గుర్తించగలరు? పత్రికనుండి, కరపత్రమునుండి లేదా బ్రోషర్నుండి ఒకటి లేక రెండు అంశాలు మాట్లాడేటప్పుడు ఇంటివారి ప్రతిస్పందన ఎలా వుంటుందో గమనించండి. అతను అవధానమిచ్చి శ్రద్ధగా వింటున్నాడా? అతను బైబిలును గౌరవిస్తూ, బైబిలు వచనములను చదివేటప్పుడు వాటిని చూస్తున్నాడా? తన దృక్పథాన్ని తెలుసుకొనే ప్రశ్నలనడిగినప్పుడు వాటికి స్పందిస్తున్నాడా? అలా వున్నట్లయితే, ఒక వారంలోగా లేక అంతకంటే ముందే పునర్దర్శనాన్ని ఏర్పాటుచేసికొని మరొకసారి చర్చను ఆసక్తికరంగా కొనసాగించవచ్చును. ఆవిధంగా ఇంటివారితో క్రమమైన బైబిలు పఠనమును ప్రారంభించవచ్చును.
4 సాధ్యమైన ప్రతిసమయంలో మీతోపాటు పత్రికలను తీసుకొని వెళ్లండి. అప్రమత్తంగా ఉండి తోటిపనివారికి, వ్యాపారంలో పరిచయమున్నవారికి, తోటి విద్యార్థులకు, బంధువులకు పత్రికలను అందించడంగాని, చందా కట్టుటకు ఆహ్వానించడాన్నిగాని చేయవచ్చు. పత్రికలను క్రమంగా వీధిసాక్ష్యంలో లేక ప్రయాణంలోకూడా అందించవచ్చును.
5 కొత్త పత్రికలు సంఘానికి వచ్చిన వెంటనే వాటిని ప్రచారకులకు అందించాలి. ఒక కొత్త సంచిక వచ్చినప్పుడు దాన్ని బాగా చదవండి. మీ ప్రాంతములోవున్న ప్రజలకు ఏ అంశాలు ఎక్కువ ఆసక్తిదాయకంగా ఉంటాయి? ప్రపంచ శాంతి భద్రతా? ఆర్థిక స్థితియా? మంచి ప్రభుత్వమా? పర్యావరణమా? ముఖ్యముగా కావలికోట వీటికి ఒకేఒక పరిష్కార మార్గమైన దేవునిరాజ్యమువైపు ప్రజలను నడిపిస్తుంది. (దాని. 2:44; మత్తయి 6:10) నిజంగా మన “మహాగొప్ప బోధకుని” నుండి అదొక అమూల్యమైన వరము.—యెషయా 30:20, NW.
6 ప్రాంతీయ సేవలో గడపడానికి ఏప్రిల్, మే మాసాలు మంచి అనుకూలమైనవి. మే నెలలో పూర్తిగా ఐదు శని లేక ఆది వారాలుంటాయి గనుక అనేకమంది సహాయపయినీరు పనిలో భాగంవహిస్తారు. ఈ రెండు నెలల్లో మన ప్రాంతీయసేవను అభివృద్ధిచేసుకోడానికి, ఉత్సాహంగా చందాలను కట్టించడానికి మనమంతా వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకోవచ్చును. ఆవిధంగా మనము కలిసిన వారందరిని కావలికోట, అవేక్! పత్రికలను చదవడానికి ప్రోత్సహిద్దాము.