కొత్తవారు అభివృద్ధిచెందునట్లు సహాయపడండి
1 పందొమ్మిదివందల తొంభైరెండు ఏప్రిల్ 17వ తారీఖున ప్రపంచమంతటా 1 కోటి 15 లక్షలమంది క్రీస్తు మరణ జ్ఞాపకార్థమును ఆచరించడానికి సమకూడారు. యెహోవాసాక్షుల సంఘములలో హాజరౌతున్న వారి సంఖ్యకు ఇది రెండున్నర రెట్లు ఎక్కువగా ఉన్నది. అలా వేలాదివేలు గుంపులుగా “యెహోవా పర్వతము” యొద్దకు రావడం ఎంత సంతృప్తిదాయకం! (మీకా 4:2) యెహోవాను బహిరంగంగా స్తుతించువారు కాకపోయినను, సత్యారాధనలో కొంత ఆసక్తిని చూపే 70 లక్షలమంది ప్రస్తుతమున్నారు. నిజంగా “కోత విస్తారంగా” ఉన్నదనే యేసు మాటలు గతమెన్నడూ ఇంత అర్థవంతంగా లేవు.—మత్తయి 9:37, 38.
2 మనము ఏప్రిల్ నెలలో, ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనేలా అర్హులైన వారందరికి సహాయంజేయడానికి ప్రత్యేక ప్రయత్నం చేస్తాము. ఈ పనిలో పుస్తక పఠన నిర్వాహకుడు తన గ్రూపులోని ఇతర సామర్థ్యముగల ప్రచారకుల లేదా పయినీరుల సహాయంతో ప్రముఖ పాత్రవహిస్తాడు. మూడు విధాలలో మన గమ్యమేమంటే: (1) ఈ సంవత్సర ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి, జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేవారితో గృహ బైబిలు పఠనమును ఏర్పాటుచేయుట; (2) పఠనముచేసేవారు బాప్తిస్మము పొందని ప్రచారకులగుటకు అర్హులయ్యేలాగున ప్రోత్సహించుట; (3) ప్రాంతీయపరిచర్యలో మన వ్యక్తిగత వంతును పెంచుకొనుట.
3 మన కూటములలో దేనికైనా హాజరయ్యే కొత్తవారిని తాము ఆహ్వానించబడుతున్నట్లు భావించుకొనేలాచేస్తూ, అందరూ వారిని పరిచయము చేసుకొనుటకు ప్రత్యేక కృషిచేయాలి. ఆసక్తిగల వీరందరూ క్రమమైన గృహ బైబిలు పఠనాన్ని కలిగివుండేలా ప్రోత్సహించడానికి మనం ఏమిచేయవచ్చును?
4 ఇండియాలో 1992 సేవా సంవత్సరంలో ప్రతినెలా సగటున 9,594 బైబిలు పఠనాలు నిర్వహించబడ్డాయి. ప్రచారకులు వారి పుస్తక పఠన నిర్వాహకుని ఈ విద్యార్థులతో పరిచయంచేసేందుకు తమ బైబిలు పఠనములకు రమ్మని ఆయనను ఆహ్వానించవచ్చును. (km 4/81 పేజి 4) వీరిలో కొంతమంది బైబిలు విద్యార్థులు ప్రస్తుతం కూటములకు హాజరవుతూ, ఇంటింటి పనిలో భాగం వహించడానికి అర్హులౌతుండవచ్చును. కొత్తవారు కొంతవరకు క్రమంగా తటస్థసాక్ష్యంలో పాల్గొంటున్నారా? బాప్తిస్మము పొందని ప్రచారకులగుటకు అవర్ మినిస్ట్రీ పుస్తకం 97-9 పేజీలలో పేర్కొనబడిన అర్హతలను వారు కల్గియున్నారా? ఆలాగైతే బాప్తిస్మము పొందని ప్రచారకునిగా అంగీకరించబడిన తరువాత ఇంటింటి సేవా పనిలో ఎలా పాల్గొనవచ్చో వివరించండి.
5 మన క్రైస్తవ సహవాసములో ఒకరినొకరిని ప్రోత్సహించుటను మనమెన్నటికి నిర్లక్ష్యంచేయకూడదు. (హెబ్రీ. 10:24, 25) ఎవరైనా వారి పరిచర్యలో వెనుకబడితే వారికి సహాయము ప్రోత్సాహము అందించడానికి పుస్తక పఠన నిర్వాహకులు కచ్చితమైన ఏర్పాట్లను చేయాలి. కొన్నిసార్లు మనతోపాటు ప్రాంతీయ సేవకు రమ్మని ఆప్యాయంగా మనమిచ్చే ఆహ్వానమే సరిపోతుంది.
6 ఏప్రిల్ నెలను ప్రాంతీయసేవా కార్యక్రమమునకు గొప్ప అవకాశంగా ఉపయోగించాలంటే దానికి అందరి సహకారం అవసరం. పుస్తక పఠన నిర్వాహకుడు తన గ్రూపులోని ప్రతిసభ్యుడు పరిచర్యలో పాల్గొనేలా సహాయంచేస్తూ ఆయన తీసుకొనే ఉత్సాహవంతమైన నాయకత్వంపై అది ఆధారపడి ఉంటుంది. సేవకొరకైన కూటములను అదనంగా ఏర్పాటుచేసికొనవచ్చును. వృద్ధులకు ప్రత్యేక అవధానమిచ్చి, యౌవనులకు ఆచరణాత్మక విధానములో సహాయము చేయవచ్చును. ఏప్రిల్ మాసంలో కుటుంబమంతా పరిచర్యలో పాల్గొనేలా తల్లిదండ్రులు చూడాలి. ఈ కోతకాలంలో మనకుగల శ్రేష్ఠమైన దానిని యెహోవాకు అర్పిస్తే, ఆయన గొప్ప దీవెనలు మనకు లభిస్తాయి.