ఆసక్తి కనపరచిన వారందరికి సహాయముచేయుట
1 మన విశ్వాసం, ఇతరులపైగల మన ప్రేమ రాజ్యవర్తమానముయెడల ఆసక్తి కనపరచిన వారందరిని జ్ఞాపకార్థాచరణకు ఆహ్వానించునట్లు మార్చిలో మనలను నడపవలెను. అట్టివారు క్రీస్తు విమోచన క్రయధన బలిపై ఆధారపడిన యెహోవా రక్షణ ఏర్పాటువైపు నడిపించబడాలి.—హెబ్రీ. 9:28.
2 జ్ఞాపకార్థ దినమునకు మీరు ఆహ్వానించదలచుకున్నవారందరి పేర్ల పట్టికను తయారుచేసుకోవడం మంచి పద్ధతి. అప్పుడప్పుడు కూటములకు హాజరయ్యేవారిని, గతములో పఠనముచేసినవారిని లేక ఇతర విధాలుగా ఆసక్తికనపర్చినవారిని అందులో చేర్చండి. అవిశ్వాసులైన భర్త లేక భార్యలను, ఇతర కుటుంబ సభ్యులను మరచిపోవద్దు. మీరు మీ పట్టికను తయారుచేసుకున్న తర్వాత ఒక్కొక్కరి చొప్పున అందరిని కలుసుకొనుటకు ప్రత్యేకంగా కృషిచేయుము. కొంతమందిని దర్శించి ఆహ్వానించడంలో మీరు మీ పెద్దల సహాయమును కోరవచ్చును.
3 మీరు పిలుచుటకు వెళ్లినప్పుడు ఏమి చెప్పవచ్చును?
ఆప్యాయంగా శుభాకాంక్షలు తెల్పి, ఆ తర్వాత ఇలా చెప్పవచ్చును:
◼ “గతంలో మీరు ఆత్మీయ విషయాలపై శ్రద్ధకనపర్చారు. ఒక ప్రత్యేక సంఘటనకు మీకందించే ఆహ్వానాన్ని మీరు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. [ముద్రించబడిన ఆహ్వానమును ఇంటివారికి అందించండి.] ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకంచేసుకొనమని తన అనుచరులకు ఆజ్ఞాపించింది క్రీస్తు మరణ జ్ఞాపకార్థం మాత్రమే. అందులో క్రీస్తు తన మరణముద్వారా ఏమి నెరవేర్చాడు, దానిద్వారా మనము ఎలా నిత్యజీవము పొందగలమనే విషయాలు పునఃసమీక్షించడం ఉంటుంది. గతసంవత్సరం ఈ ప్రత్యేక కూటమునకు 1 కోటి, 14 లక్షలమంది హాజరయ్యారు. ఈ సంవత్సరం మాతోపాటు మీరుకూడా హాజరైతే ఎంతో సంతోషంగా ఉంటుంది.” మీ సంఘము జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకొనే స్థలాన్ని, సమయాన్ని తప్పక అందులో వ్రాయండి. అవసరమైతే రవాణా సౌకర్యం విషయంలో సహాయం అందిస్తామని చెప్పండి.
4 క్రొత్తవారు జ్ఞాపకార్థ ఆచరణకు వచ్చినప్పుడు వారు ఆహ్వానించబడుతున్నట్లు భావించుకొనేలా చెయ్యాలి. స్థానిక ప్రచారకులతో వారు పరిచయమౌనట్లు సహాయపడండి. వారి ఇంటికి దగ్గరగా నివసించే ఆసక్తిగల వ్యక్తులు ఎవరైన ఉంటే వారిని కూడా పరిచయము చేయండి. తమ స్వంత ఇరుగు పొరుగులోనే అనేకమంది సత్యము పట్ల ఆసక్తి కలిగియున్నారని తెలుసుకొనుట వారికి ప్రోత్సాహాన్నిస్తుంది. సాధ్యమైతే జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో వారిని మీ కుటుంబం దగ్గరే కూర్చొనేలా ఆహ్వానించండి.
5 అవును, కేవలం జ్ఞాపకార్థానికి హాజరవటం వారి రక్షణకు అభయం కాదు. కానీ, నీవు ఆహ్వానించే అనేకులకు వారి జీవితంలో యేసు చిందించిన రక్తమందు విశ్వాసమును కనపర్చుటకు అది తొలిమెట్టు కాగలదు. కూటం తదుపరి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, వచ్చినవారిని తరువాత రాబోయే ఆదివారం జరిగే బహిరంగ ప్రసంగానికి, కావలికోట పఠనమునకు హాజరవడానికి ఇష్టపడతారేమో అడగండి. ఆప్యాయంగాను, తాను మీతో స్వేచ్ఛగా మెలుగుటకు అనుకూలంగా ఉండండి. మీకు సాధ్యమైన ఏరీతిలోనైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావని తెలిసికొనేలా చేయుము. అతను మనతో క్రమంగా సహవాసముచేసేకొలది, అతని ఆత్మీయ పురోభివృద్ధి త్వరితమవుతుంది. మనం మనము సహాయ చేయగలిగినవారితోపాటు “మహాశ్రమలలో” నుండి రక్షించబడుట ఎంత ఆనందం, సంతృప్తిదాయకం!—ప్రక. 7:9, 14.