జూలై కొరకు సేవా కూటములు
జూలై 6తో ప్రారంభమగు వారము
పాట 80 (18)
5 నిమి: స్థానిక ప్రకటనలు, మరియు మన రాజ్య పరిచర్య నుండి అవసరమైన ప్రకటనలు.
10 నిమి: “1992 ‘వెలుగు ప్రకాశకుల’ జిల్లాసమావేశము”—1వ భాగము. 1-11 పేరాలు ప్రేక్షకులతో చర్చ. వ్యక్తిగతంగాను, ప్రాంతీయ సేవలోను సమాచారమును ఎలా ఉపయోగించవచ్చునో నిర్ణయించుకొనే లక్ష్యంతో శ్రద్ధగా అవధానాన్ని నిలపమని అందరిని ప్రోత్సహించుము. సమావేశమునకు తమతో కూడా హాజరగు బైబిలు విద్యార్థులతో ప్రచారకులు తగిన అంశములను చర్చించుటకు ఇష్టపడవచ్చును. కొన్ని హెచ్చరికలను మనస్సున ఉంచుకొనండి. మనందరికి తగినంత విశ్రాంతి అవసరము గనుక సమావేశ సమయంలో ఎవరూ బాగా రాత్రి అయ్యేంతవరకు వినోదములలో గడుపకూడదు. సమావేశముయెడల ఉత్సాహమును పుట్టించుము.
15 నిమి: “దేవుని వాక్యమందు విశ్వాసమును నిర్మించండి.” ఈనెలలో మనము ప్రాంతములో చేయుపనియెడల ఉత్సాహమును నిర్మించండి. మీ ప్రాంతంలోని ప్రజలు బైబిలుపై విశ్వాసాన్ని పెంచుకొనేలాగున ఈ ప్రచురణ ఎలా చేయగలదో చూపుము.
15 నిమి: “ఈ నెల అందింపును పరిచయముచేయుట” శీర్షికలోని కొన్ని సూచనలను చర్చించి ప్రదర్శించండి. ఒక ప్రదర్శనలో నేరుగా ప్రస్తావించి బైబిలు పఠనమును ఎలా ప్రారంభించవచ్చునో చూపుము. రుజువులన్నియు బైబిలు ప్రేరేపించబడినదని ఎలా సూచిస్తున్నవో చూపుము.
పాట 225 (44) ముగింపు ప్రార్థన.
జూలై 13తో ప్రారంభమగు వారము
పాట 145 (115)
10 నిమి: ప్రకటనలు. ఇద్దరు క్రమ లేక సహాయ పయినీర్లు స్థానిక ప్రాంతములో పనిచేయునప్పుడు ఏ ఉపోద్ఘాతములను వారు ఫలవంతముగా కనుగొన్నారో వ్యాఖ్యానించుటకు ముందుగానే సిద్ధపరచుము.
20 నిమి: “1992 ‘వెలుగు ప్రకాశకుల’ జిల్లా సమావేశము.” 12-21 పేరాలు ప్రేక్షకులతో చర్చ. సమయము అనుమతించుకొలది జిల్లాసమావేశపు జ్ఞాపికలను క్లుప్తముగా పునఃసమీక్షించండి. సమావేశమునకు హాజరుకాకముందు ది వాచ్‌టవర్ జూన్ 15, 1989 10-20 పేజీలను పునఃసమీక్షించమని కుటుంబములను ప్రోత్సహించుము. ప్రయాణం మరియు వసతికొరకైన ఏర్పాట్లను మరలా ఒకసారి చివరగా పరిశీలించుకొనవలసిన అవసరతను ప్రచారకులకు జ్ఞాపకంచేయండి. అందరూ వారివారి బ్యాడ్జి కార్డులను ధరించి ప్రయాణములో, రెస్టారెంటుల వద్ద, హోటల్ మొదలగుచోట సాక్ష్యమియ్యమని ప్రోత్సహించుము.
15 నిమి: సొసైటి పంపిన అక్టోబరు 15, 1991 తారీఖుగల మెడికల్ డైరెక్టివ్/రిలీజ్ కార్డు ను గూర్చిన లెటరును చదివి చర్చించుము. ఈ క్రొత్త కార్డును ఉపయోగిస్తుండనివారు లిటరేచర్ కౌంటర్‌నుండి వెంటనే తీసికొని పూర్తిచేసి, చట్టపరమైన ఇద్దరు సాక్షులచే దానిపై సంతకములు పెట్టించుకొనమని ప్రోత్సహించుము. సమయముంటే మే 1, 1992 కావలికోట 10-15 పేజీలలోని “యెహోవాచే ఉపదేశించబడినట్లు నడువుము” అను శీర్షికను పునఃసమీక్షించండి.
పాట 61 (59) ముగింపు ప్రార్థన.
జూలై 20 ప్రారంభమగు వారము
పాట 34 (8)
10 నిమి: ప్రకటనలు. మార్చి ప్రాంతీయ సేవా రిపోర్టులోని ఉన్నతాంశములను ప్రస్తావించుము. మార్చిలో ప్రాంతీయ సేవలోని ఏ రంగములో స్థానిక సంఘము పాల్గొన్నది చూపండి. అక్కౌంట్స్ రిపోర్టును అందజేయండి. ప్రాంతీయ సేవలో చేసిన పనికొరకు ఆలాగే సంఘముకొరకు ఉదారంగా ఆర్థిక మద్దతు నిచ్చినందుకై సంఘమును మెచ్చుకొనండి.
20 నిమి: “తటస్థసాక్ష్యమిచ్చుటలో మీరు పాల్గొందురా?” శీర్షికలోని అంశములను చర్చించి, ప్రదర్శించండి. మనమెల్లవేళల యెహోవాసాక్షులమనియు, సాక్ష్యమిచ్చు అవకాశములకొరకు మనము వెదకుదుమను దానిని నొక్కి తెల్పండి. తటస్థసాక్ష్యమిచ్చుటలో పాల్గొని మంచి ఫలితములను పొందినవేగాని, లేక సంఘములోని ఒకరు తటస్థసాక్ష్యం మూలంగా సత్యముపై ఆసక్తి చూపిన సంఘటనలతో కూడిన రెండు చిన్న అనుభవములను గూర్చి తెలియజేయుటకై ముందుగా సిద్ధపర్చండి.
15 నిమి: 2 తిమోతి 3:16, కీర్తన 119:159, 160 లను ఉపయోగిస్తూ బైబిలు చర్చ, ది బైబిల్ గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్? పుస్తకపు అందింపుల ప్రదర్శన మరియు చర్చ. 2 తిమోతి 3:16 ను ఉపయోగిస్తూ, పిల్లలు లేక క్రొత్తవారు క్లుప్తమైన అందింపును ఎలా ఉపయోగించవచ్చో చూపండి. ప్రదర్శనలో మనము సాహిత్యములను కేవలము ముద్రణా ఖర్చులకై కొంత చందా తీసికొంటూ ఇస్తున్నామేగాని, ఇది వ్యాపారం కాదనేదాన్ని స్పష్టంచేయండి. ఇది స్వచ్ఛంద విరాళములవలన బలపరచబడుచున్న ప్రపంచవ్యాప్త విద్యాకార్యక్రమంలో భాగమని ఇంటివారితో చెప్పవచ్చును. సాధ్యమైనంత త్వరగా సాహిత్యమును చదవటం ప్రారంభించమని ఇంటివారిని ప్రోత్సహించి, పునర్దర్శనము కొరకై పునాది వేయండి.
పాట 154 (72) ముగింపు ప్రార్థన.
జూలై 27తో ప్రారంభమగు వారము
పాట 173 (15)
5 నిమి: ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ఈ విషయాలను అందించునప్పుడు, 1987 ఇయర్ బుక్ ద్వారా, ప్రస్తుత రిపోర్టును ఆ బ్రాంచియొక్క 1986 సేవా సంవత్సర రిపోర్టుతో పోల్చుము.
20 నిమి: “పయినీరు సేవ—ప్రేమను వ్యక్తపరచునది.” ప్రశ్నా సమాధానములు. పేరాగ్రాఫ్ 3, 4లను చర్చించిన తరువాత ముగ్గురు క్రమ పయినీర్లను, (లేక క్రమముగా గాని లేక అప్పుడప్పుడు సహాయపయినీర్లగా చేయు ప్రచారకులను) వారితోపాటు, అందుబాటులో ఉంటే, తన పాఠశాల విద్య ముగిసిన వెంటనే పయినీరు సేవను ప్రారంభించిన క్రమ పయినీరును చేర్చుము. పయినీరు సేవచేయుటకు తమ వ్యవహారములను వారెట్లు దిద్దుకొన్నది, అలా చేయుటకు వారిని ఏది పురికొల్పినది, భౌతిక సంబంధమైన ఏ త్యాగాలను వారు చేయవలసి వచ్చింది, క్రమపయినీర్లుగా చేయుటద్వారా వారు ఏ ఆశీర్వాదములను పొందింది అడుగుము.
20 నిమి: “బైబిలు పఠనమును ప్రారంభించు గురితో తిరిగివెళ్లుట.” చర్చ మరియు ప్రదర్శనలు. పేరాగ్రాఫ్ 3 లో సూచించబడిన బైబిలు చర్చను ప్రదర్శించుము. బైబిలు పఠనమును ప్రారంభించుటకై ది బైబిల్ గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? పుస్తకము 170-2 పేజి, 23-26 పేరాగ్రాఫ్‌లను ఆధారంగా ఉపయోగించండి.
పాట 135 (72) ముగింపు ప్రార్థన.
ఆగస్టు 3తో ప్రారంభమగు వారము
పాట 90 (42)
10 నిమి: ప్రకటనలు. ఈ వారాంతపు ప్రాంతీయ సేవలో పత్రికలను అందించునప్పుడు లేఖన సంబంధమైన చర్చను ఎలా కలిగి ఉండవచ్చో చూపు రెండు చిన్న ప్రదర్శనలను చేయండి.
15 నిమి: “అపొస్టలిక్ సక్‌సెషన్.” “పోపు అపొస్తలుడైన పేతురుకు వారసుడు కాడా” అని ప్రశ్నించిన ఒక వ్యక్తియొద్దకు పునర్దర్శనమునకు వెళ్తున్న పయినీరుతో సేవా కాపరి వెళ్లును. రీజనింగ్ పుస్తకము 37 నుండి 39వ పేజి మొదటి సబ్‌హెడ్డింగ్ వరకు గల సమాచారముపై ఆధారపడిన చర్చ.
20 నిమి: 1992 ఫిబ్రవరి 1, వాచ్‌టవర్ 25-28 పేజీలలోని “హావ్ ఎ సెల్ఫ్ శాక్రిఫైజింగ్ స్పిరిట్!” (ఈ శీర్షిక ప్రాంతీయభాషా పక్ష పత్రికలలో మే 1, 1992 వాచ్‌టవర్ సంచికలో 25-28 పేజీలందు ఉన్నది.) నెలసరి వాచ్‌టవర్ పత్రిక లభ్యమయ్యే భాషను ఉపయోగించే సంఘములు కావలికోట జూన్ 1, 1992 “వినయమును ఎందుకు ధరించవలెను” అను శీర్షికను వాడవచ్చును.)
పాట 167 (110) ముగింపు ప్రార్థన.