మన ప్రచురణలను బాగుగా ఉపయోగించుము
1 మనయొక్క ప్రకటన మరియు బోధనా పనిలో సహాయపడుటకు యెహోవా దృశ్యమైన సంస్థ మనకు అనేక విధములైన ప్రచురణలను సరఫరా చేస్తున్నది. (మత్త. 28:19, 20) కావున సొసైటి ప్రచురణల యెడలగల మన మెప్పు వాటిని మన పరిచర్యలో బాగుగా ఉపయోగించుటకు మనలను నడుపవలెను.
2 మన పరిచర్యను చేయునప్పుడు గొర్రెలాంటివారు జీవమార్గములోకి వచ్చులాగున సహాయపడాలని మనము కోరుకుంటాము. దానిని చేయుటకు సాహిత్యములు మనకు సహాయపడగలవు. ఆసక్తిగల వ్యక్తితో లేఖనములను చర్చించునప్పుడు ఒక ప్రత్యేకమైన అంశము ఆయనకు యిష్టకరంగా ఉంటుందని మనము గమనించవచ్చును. వివిధ ప్రచురణలలోని విలువగల సమాచారముతో మనము బాగుగా పరిచయము కలిగియున్నట్లయితే మనము మాట్లాడు వ్యక్తికి తగినట్లు మన ప్రసంగాన్ని మార్చుకొని, ప్రత్యేకముగా ఆయన ఆసక్తికి సంబంధించిన ప్రచురణను అందించగలము. ఇందుకై తగినటువంటి ప్రచురణతో పునర్దర్శనం చేయవలసిన అవసరత ఉండవచ్చును.
అవసరమైన దానిని అందించుము
3 మన ప్రాంతములో బాగుగా పనిచేయుట ద్వారా, బైబిలు నందు నిజంగా ఆసక్తికలిగి దానిని గూర్చి ఎక్కువగా నేర్చుకొనుటకు యిష్టపడు ప్రజలను కనుగొందుము. అట్టివారికి మన ప్రచురణలలో ఏదైనను ఒకటి బైబిలు గ్రహింపును పొందుటకు సహాయపడును. అయితే బైబిలునందు విశ్వాసము లేక అది దానియందదే పొందికలేనిదై విజ్ఞానశాస్త్రమునకు తగినదికాదని నమ్ము వ్యక్తికి ది బైబిల్ గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకము యుక్తమైనదైయుండవచ్చును. ఎందుకనగా బైబిలును గూర్చిన మానవ విమర్శను నిరాధారమైనదని త్రోసిపుచ్చి, బైబిలును ఎందుకు దేవునివాక్యముగా అంగీకరించవలెనో స్పష్టమైన వివరణలను ఆ ప్రచురణ యిచ్చుచున్నది. లేదా మ్యాన్కైండ్స్ సర్చ్ఫర్ గాడ్ అను పుస్తకములో 15, 16 అధ్యాయములను ఉపయోగిస్తూ ఆ పుస్తకమునైనను మీరు అందించవచ్చును.
4 అనేకమంది ప్రజలు తమ స్వంత గృహజీవితములో సమస్యలనెదుర్కొనుచున్నారు. బైబిలు ఉపదేశమును గూర్చి, లేక దానిని అన్వయించుకొనవలసిన విధానమునుగూర్చి వారికి ఎక్కువ జ్ఞానముండక పోవచ్చును. వారు జీవితములోని సమస్యలను ఎదుర్కొని ఆచరణాత్మకమైన పరిష్కారములను కనుగొనునట్లు సహాయపడుటకు కుటుంబ జీవితము అను పుస్తకములో 5 నుండి 8 అధ్యాయములకు గాని అవధానమును మళ్లించవచ్చును. మార్పులు తక్షణమే రాకపోయినప్పటికిని బైబిలు ఉపదేశము నిజంగా పనిచేస్తుందని మనము ఎత్తిచూపవచ్చును.
5 పిల్లలున్న వారితో కలిసి మాట్లాడునప్పుడు ప్రత్యేకంగా యౌవనులను, మనస్సులో పెట్టుకొని తయారుచేసిన ప్రచురణలను అందించుటను గూర్చి తలంచుము. బహుశా యంగ్ పీపుల్ ఆస్క్ ప్రచురణను మీరు ఉపయోగించవచ్చును. అనేకమంది ప్రచారకులు తల్లిదండ్రులకును అలాగే యౌవనులకును మై బుక్ ఆఫ్ బైబిల్ స్టోరిస్ లేక లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్ పుస్తకములను అందించుట ద్వారా సహాయపడిరి.
6 తీసుకొని వెళ్లుటకు అనువుగా ఉండునట్టి, కరపత్రములను, ఇంటింటి పనిని చేయునప్పుడు, తటస్థసాక్ష్యమిచ్చునప్పుడు సంభాషణను ప్రారంభించుటకు ఉపయోగించవచ్చును. వాట్ హోప్ ఫర్ ది డెడ్ లౌవ్డ్ వన్స్? మంచి విలువైన సమాచారమును గలదై, ఓదార్పునందించు కరపత్రము వివిధరకముల కరపత్రములను మీరు మీతో పాటు తీసుకెళ్లుదురా? వాటిని పరిచయముచేసి అందించుటకు తగిన వ్యాఖ్యానములను సిద్ధపడియున్నారా?
7 మనము ఇతరులతో సువార్తను పంచుకొనుకొలది “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుడు” అందజేసిన వివిధ రకముల బైబిలు పఠన సహాయకములను బాగుగా ఉపయోగించుటకు కోరుకుంటాము. (మత్త. 24:45-47) అట్టి విస్తారమైన ఆత్మీయ ఆహారము మానవజాతి యెడల యెహోవాయొక్క శ్రద్ధను మరియు ఔదార్యతను ప్రతిబింబించుచున్నది.