మన ప్రచురణలను చక్కగా ఉపయోగించుకోండి
1. యెహోవా ఇచ్చినవాటిపట్ల మెప్పుదల చూపించే విషయంలో యేసును మనమెలా అనుసరించవచ్చు?
1 యేసు ఒక అద్భుతంచేసి జన సమూహాలకు ఆహారం పెట్టిన తర్వాత మిగిలినదాన్ని తీసిపెట్టమని చెప్పాడు. (మత్త. 14:19-21) యెహోవా ఇచ్చినవాటిపట్ల యేసు చూపించిన మెప్పుదల, నమ్మకమైన గృహనిర్వాహకుని ద్వారా యెహోవా అందజేస్తున్నవాటన్నిటిని చక్కగా ఉపయోగించుకుని, ‘కృతజ్ఞులమై’ ఉండాలని చూపిస్తుంది.—కొలొ. 3:15; లూకా 12:42; మత్త. 24:45-47.
2. పత్రికలు అలాగే మిగిలిపోకుండా ఉండాలంటే మనమేమి చేయవచ్చు?
2 పత్రికలు: మనం పత్రికలు ప్రజలకు ఇవ్వకపోతే కొన్ని రోజులకు మనింట్లో చాలా పత్రికలు అలాగే మిగిలిపోతాయి. ఎప్పుడూ అలాగే మిగిలిపోతుంటే, మనం తీసుకునే పత్రికల సంఖ్యను తగ్గించాలి. పాత పత్రికల విషయమేమిటి? సమయం గడుస్తుండగా వీటి విలువేమీ తగ్గిపోదు. పాత పత్రికలు అలాగే మిగిలిపోయుంటే, వాటినెలా అందించాలనే విషయంలో సేవా పైవిచారణకర్త లేదా మరో పెద్ద తగిన సలహాలిస్తారు.
3, 4. రాజ్యమందిరంలో ప్రచురణలను తీసుకునేటప్పుడు మనం ఏ విషయాలను గుర్తుంచుకోవాలి?
3 ఇతర ప్రచురణలు: అందించాల్సిన ప్రచురణ మారినప్పుడు, రాజ్యమందిరం నుండి దాని ప్రతులు తీసుకోవడానికి ముందు అవి అప్పటికే మన దగ్గర ఉన్నాయేమో చూసుకోవడం మంచిది. వారానికి అవసరమైన ప్రతులు మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి. అవి అందజేసిన తర్వాతే మరిన్ని ప్రతులు తీసుకోండి.
4 మీ సొంత ఉపయోగం కోసం ప్రచురణలు తీసుకునేటప్పుడు మీకు నిజంగా అవసరమైనన్నే రిక్వెస్టు చేయండి. ప్రతీ ప్రచురణలో ఇవ్వబడిన ఖాళీ స్థలంలో మీ పేరు రాసుకోండి. అప్పుడు, ఒకవేళ మీరు మీ సొంత ప్రతిని పోగొట్టుకున్నా అది మళ్ళీ మీకు దొరుకుతుంది. మీరు మీ వాచ్‌టవర్ లైబ్రరీ సీడీరామ్ను, మీ సొంత పత్రికల ప్రతులను భద్రపర్చుకునివుంటే వాటిని చక్కగా ఉపయోగించుకోండి.
5. మన ప్రచురణలను ఇతరులకు ఇచ్చేటప్పుడు మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?
5 ప్రచురణలను అందించడం: నిజంగా ఆసక్తి చూపించిన వారికే మన ప్రచురణలను ఇస్తాం. పరిచర్యలో మనకెంతో ఉపయోగపడే ఈ ప్రచురణలను ముద్రించడానికి కావాల్సిన డబ్బు సమకూర్చాల్సిన బాధ్యత ముఖ్యంగా మనదేనని గుర్తుంచుకోండి. ఆసక్తిగలవారికి ప్రచురణను ఇచ్చేటప్పుడు, విరాళం ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్త పనికి వారు కూడా సహాయం చేయవచ్చని వారితో చెప్పడానికి సంకోచించకండి.
6. మనం మన ప్రచురణలను ఎందుకంత విలువైనవిగా ఎంచుతాం, అందుకే వాటిని మనం ఏమి చేయము?
6 యేసు అద్భుతాలు చేసి ఇతరులకు భౌతిక ఆహారాన్నిచ్చాడు, అయితే అంతకంటే ఎక్కువగా ఆయన ప్రజలకు ఆధ్యాత్మిక ఆహారాన్నిచ్చాడు. ఆయనిలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్త. 4:4) నిత్యజీవం పొందడానికి ఎంతో అవసరమైన బైబిలు సత్యాలను మన ప్రచురణలు బోధిస్తాయి. (యోహా. 17:3) వాటిని మనం అస్సలు వృథా చేయకూడదు.