మన సాహిత్యాల విలువను మెచ్చుకొనేలా ఇతరులకు సహాయపడుట
1 ‘దేవుని వాక్యము సజీవమై బలముగలదైయున్నది.’ (హెబ్రీ. 4:12) ప్రజలు ప్రయోజనం పొందేలా మన బైబిలు ఆధారిత సాహిత్యాలు సహాయపడతాయి గనుక, తటస్థ సాక్ష్యమిస్తున్నప్పుడు లేదా ఇంటింటి సేవ చేస్తున్నప్పుడు బైబిలుపై ఆసక్తిని రేకెత్తించడానికి వాటిని మనం ఉపయోగిస్తాము.
2 దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అట్లయితే, ఆయన బాధనెందుకు అనుమతిస్తున్నాడు? అది ఏనాటికైనా అంతమగునా? అనే బ్రోషూరును మనం జనవరి నెలలో అందించెదము. ప్రస్తుతం ఈ బ్రోషూర్ ఇండియాలోని ప్రధాన భాషలన్నింటిలోనూ లభ్యమౌతుంది, కనుక సంఘాలు వీటిని పొందడానికి కావలసినంత సమయం లభించింది. దీన్ని అందించేటప్పుడు, అద్భుతమైన మన నిరీక్షణగూర్చి అతనికి ఉత్సాహంగా చెబుతూ, గృహస్థుని హృదయాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. దీనినెలా చేయవచ్చు?
3 దేవుడు శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరును అందించుట: ప్రస్తుతం ప్రపంచంలోనున్న సమస్యలను ఉన్నతపర్చేటువంటి లేదా సమీప భవిష్యత్తులో భూమి ఎదుర్కొనే చెడు పరిస్థితులను వివరించేటటువంటి వార్తా భాగానికి అవధానం త్రిప్పడం ద్వారా మీరు సంభాషణను ప్రారంభించవచ్చు.
3 ఆ తర్వాత ఇటువంటి ప్రశ్నను అడగండి:
◼ “ఈనాటి ప్రపంచ పరిస్థితిని దేవుడు ఎలా దృష్టిస్తాడని మీరు తలస్తున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] ప్రస్తుతం మనం చూస్తున్న చెడు పరిస్థితులను తొలగించడానికి ఆయన త్వరలోనే ఏదొకటి చేయబోతున్నాడని, మరి భూమి, మానవజాతియొక్క భవిష్యత్తును గూర్చి ఆయన చాలా ఆసక్తికల్గియున్నాడని నేర్చుకోవడం మిమ్మును ఆశ్చర్యపర్చదా?” గృహస్థునికి విషయపట్టికలోని అంశాలను చూపి, ప్రస్తుతం మానవజాతి అనుభవిస్తున్న బాధ దేవుడు లేడని, లేదా దేవుడు మానవజాతి యెడల శ్రద్ధలేనివాడని నిరూపించదని క్లుప్తంగా వివరించండి. లేకపోతే, దేవుడు బాధను కొంత కాలంపాటు అనుమతించినప్పటికి, బాధ, వేదనల నుండి స్వతంత్రులై, సంతోషంగా జీవించు ప్రజలతో నిండిన ఒక పరదైసుగానే భూమి ఉండాలనేది ఆయన ఉద్దేశమైయున్నదని వివరించండి. విషయపట్టిక పైభాగంలో ఉన్న చిత్రాన్ని చూపించి, అలాంటి పరిస్థితులు త్వరలోనే రాబోతున్నవని మనకు నమ్మదగిన నిరీక్షణగలదని చెప్పండి.
4 ఈ బ్రోషూర్ అందుబాటులో లేనిచోట, లేదా బాగా అనుకూలంగా ఉన్నచోట, జనవరి నెలలో 192 పేజీల పాత పుస్తకాన్ని ప్రత్యేక అందింపుగా అందిస్తాము. వీటిని ఎలా అందించవచ్చు? మొదటిగా, మీ ప్రాంతంలోని యథార్థహృదయులకు నచ్చేటటువంటి వాక్యాన్ని, మీరు ఉపయోగిస్తున్న పుస్తకంలోనుండి ఎన్నుకోండి. తర్వాత, మీరు ఎన్నుకున్న ముద్రించబడిన వాక్యానికి అతని అవధానాన్ని మళ్లించేముందు, గృహస్థునితో క్లుప్తంగా చర్చించగల ఇటీవల సంఘటన లేదా సాధారణంగా ఆసక్తిగావుండే ఓ విషయాన్ని గూర్చి ఆలోచించండి. మీ వ్యాఖ్యానాన్ని బలపర్చడానికి బహుశ అక్కడ యిచ్చిన లేఖనాన్ని బైబిలునుండి గాని లేదా నేరుగా పుస్తకంనుండే మీరు చదివి, తర్వాత ఆ పుస్తకాన్ని అందించండి. చివరిగా, పునర్దర్శనానికి ఆధారంగా ఉపయోగించగలిగే ప్రశ్నను లేదా విషయాన్ని అడిగివెళ్లడానికి ప్రయత్నించండి.
5 చాలా సంఘాల్లో జీవితమున ఉన్న యావత్తు ఇదేనా? లేదా లిజనింగ్ టు ది గ్రేట్ టీచర్ అనే పుస్తక ప్రతులు ఉన్నాయి. ఈ పుస్తకాలు లభ్యమైతే, ఈ సాహిత్యాలనుండి సంభాషణలను ఆరంభించడానికి సిద్ధపడి, ఈ మంచి పుస్తకాలను చదవమని గృహస్థులను ఎందుకు ప్రోత్సహించకూడదు. నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని అందిస్తున్నట్లైతే, పైన వివరించిన పద్ధతిని మీరుపయోగించవచ్చు, ఆలాగే బహు శ్రేష్ఠమైన ఈ పఠన సహాయకంలో వివరించబడిన బైబిలు సిద్ధాంతాలలో ఏదైనా సరే చర్చించడానికి సిద్ధపడండి.
6 కొన్ని సమయాల్లో పత్రికనుగాని లేదా కరపత్రాన్ని అందించడం యుక్తంగా ఉండవచ్చు. ఈ సాహిత్యాలను చదివి తద్వారా దాని నడిపింపుకు ప్రతిస్పందించడంద్వారా తమ జీవితాల్లో దేవుని వాక్యంలోని శక్తిని చవిచూడడానికి సన్నద్ధులుకాగలరని ఇతరులను ప్రోత్సహించడంలో మనం ఉత్సాహాన్ని, పట్టుదలను కల్గివుండడానికి మనకెన్నో కారణాలున్నాయి.