కూటములను సమయానికి ప్రారంభించి సమయానికి ముగించుము
1 ప్రాంతీయ సేవ కొరకైన కూటములతో సహా సంఘ కూటములన్నియు సమయానికి ప్రారంభమై, సమయానికి ముగించబడవలెను. ఎందుకు? సమయమును పాటించుట క్రమమును ప్రతిబింబించి, కూటములకు హాజరగువారియెడల మరియు అందులో పాల్గొనువారి యెడల శ్రద్ధను చూపునదైయుండును. (ప్రసం. 3:17 b; 1 కొరిం. 14:33) కూటముల ఖచ్చితంగా సమయానికి ప్రారంభమై, సమయానికి ముగించబడులాగున చూచుటకు క్రింద చూపబడు మార్గదర్శక సూత్రములకు కట్టుబడియుండుటద్వారా మనము మన శ్రద్ధను చూపవచ్చును.
2 మనమెల్లప్పుడు ఇతరులను దర్శించుటకు, అవసరమైన విషయములను చూచుకొనుటకు ప్రారంభపాట మరియు ప్రార్థనలో పాల్గొనుటకు సమయము సరిపడునంత ముందుగా కూటములకు వచ్చులాగున కృషిచేయవలెను. సాధారణంగా పాట మరియు ప్రార్థనకు ఐదు నిముషములు యివ్వబడుతుంది. సంఘము కొరకు ప్రార్థనలో ప్రాతినిధ్యము వహించువారు కూటముయొక్క ఉద్దేశ్యమును మనస్సునందుంచుకొని ప్రారంభ మరియు ముగింపు ప్రార్థనలందు తమ భావములలో అదియే వ్యక్తముచేయులాగున చూడవలెను. అలాంటి ప్రార్థనలు దీర్ఘంగా ఉండనవసరం లేదు.
3 బహిరంగ ప్రసంగము: బహిరంగ ప్రసంగములు 45 నిముషములకు పరిమితము చేయబడినవి. అనుమతించబడిన సమయమును దాటిపోవుట దాని తరువాత జరుగు వాచ్‌టవర్ పఠనముపై ప్రభావము చూపును. పాటలు మరియు ప్రార్థనలతో సహా రెండు కూటములు రెండు గంటలలో ముగించబడవలెను. బహిరంగ ప్రసంగమునిచ్చే ప్రసంగీకులు సొసైటి ఔట్‌లైన్ నందు సూచించబడిన సమయమునకు అంటిపెట్టికొనియుండవలెను. అభినందనములు తెలియజేయుట మొదలగు అదనపు సంగతులను ప్రసంగమందు చేర్చకూడదు. ఒకవేళ ప్రసంగీకునికి రాజ్యమందిరము ఎక్కడుంది తెలియనట్లయిన వెళ్లబోవు సంఘము నుండి నడిపింపును, మరియు ప్రయాణమునకు దాదాపు ఎంత సమయము పడుతుంది విచారించి తెలుసుకొనవలెను.
4 “కావలికోట” పఠనము: పేరాగ్రాఫ్లన్ని చదువబడి, పునఃసమీక్ష ప్రశ్నలను పరిశీలించుటతో సహా కావలికోట పఠనమునకు ఒక గంట అనుమతించబడుతుంది. పఠనము చేయు వ్యక్తియొక్క క్లుప్తమైన మరియు సూటియైన ఉపోద్ఘాత వ్యాఖ్యానములు ఆసక్తిని రేకెత్తించి పాఠములోనికి నడుపవలెను. తన వ్యాఖ్యానములు, తాను గమనించి తెలుపు విషయములు పరిమితంగా ఉండాలి. సమాచారమంతటిని కాల ప్రకారంగా విభాగించుకొనుట ద్వారా నడిపించు వ్యక్తి మొదటి సగభాగములో అధిక సమయాన్ని గడుపుతూ చివరి సగములో తొందతొందరగా వెళ్లకుండునట్లు చేయును.
5 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల: ఇది 45 నిముషముల కూటము, ఉపదేశ ప్రసంగము, మరియు బైబిలు ఉన్నతాంశములు సమయాన్ని దాటి వెళ్లినప్పుడు ఆపుజేయబడనప్పటికిని, ఈ భాగములకు నియమించబడు సహోదరులు వారికి నియమించబడిన సమయాన్నే ఉపయోగించుకొనవలెను. ఇట్లు చేయని పక్షంలో వారికి వ్యక్తిగతంగా సలహా నివ్వవలెను. పాఠశాల కాపరియొక్క ఉపదేశము మరియు సూచనలు కూడా సూచించబడిన సమయంలోనే ఉండవలెను. విద్యార్థులందరూ ప్లాట్ఫారమ్నకు దగ్గరనే కూర్చుండి, నియమించబడిన సమయము అయిన వెంటనే జాగుచేయక ముగించినట్లయిన సమయమును కాపాడుకొనవచ్చును.—1991 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలును చూడుము.
6 సేవా కూటము: ఇది కూడా 45 నిముషముల కూటమే, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, పాటలు, ప్రార్థనలతో సహా కార్యక్రమమంతయు ఒక గంట నలభై అయిదు నిముషములను దాటిపోకూడదు. సేవా కూటములో భాగములున్న సహోదరులు అనుమతించబడిన సమయమునకు హత్తుకొనియుండవలెను. ప్రశ్నాసమాధానములో చేయబడు భాగములకు కేవలం క్లుప్తమైన ఉపోద్ఘాతం సరిపోతుంది. ఉపోద్ఘాతంలో విస్తారమైన సమాచారాన్ని కలుపనవసరం లేదు. ప్రదర్శనలు ముందుగానే బాగా ప్రదర్శించి చూసుకొనబడినవైయుండి, దానిలో పాల్గొనువారు సిద్ధముగాయుండి ఆ భాగానికివ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకొనవలెను.
7సంఘ పుస్తక పఠనము: ప్రారంభము మరియు ముగింపు ప్రార్థనలతో కలిపి ఇది ఒక గంటలోనే జరుపబడవలసిన కూటము. పేరాగ్రాఫ్లన్నిటిని చదువవలెను. కూటము సమయానికి ఖచ్చితంగా ముగించబడుటకు పఠనముచేయు వ్యక్తి సమాచారమును భాగాలుగా విభజించుకొన్న పఠనము చివరి భాగములో తొందరపడకుండా లేక ఎంతో ముందే ముగించకుండునట్లు వీలగును. ప్రతి పేరాకు ఎంత సమయము తీసుకొనబడుచున్నదో పఠనము చేయు వ్యక్తి వివేచించవలెను. ముఖ్యాంశములు స్పష్టంగా అర్థం కావలెను. పఠనముచేయు వ్యక్తియొక్క బోధన కళ ఈ విషయమందలి ఎట్టి సవాలునైనను ఎదుర్కొనుటకు సహాయపడును.—తీతు 1:9.
8 ప్రాంతీయ సేవ కొరకైన కూటములు: ప్రాంతమునకు నియమించుట, ముగింపు ప్రార్థనలో సహా ఈ కూటములు 15 నిముషములకు మించరాదు. సేవకొరకు బయలువెళ్లువారు తమ ప్రాంతీయ సేవా పనిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరుకుంటారు. పెద్దగుంపు వచ్చేంతవరకు ఆగకుండా నడిపించు వ్యక్తి కూటమును సమయానికి ప్రారంభించవలెను. ప్రాంతమునకు నియామకములను ఏర్పాటుచేసి కూటమును ప్రార్థనతో ముగించిన తరువాత గ్రూపు వెంటనే ప్రాంతములోకి తరలవచ్చును. ప్రత్యేకంగా పయినీర్లకు ప్రత్యేకంగా ఇది ప్రాముఖ్యము.
9 సమయానికి ప్రారంభమై సమయానికి ముగించబడు కూటములనుండి మనమందరము ప్రయోజనము పొందుదుము. ప్రత్యేకంగా ఒక ఖచ్చితమైన సమయమునకు ఇంటికి తిరిగి రావలెనని కనిపెట్టు అవిశ్వాసులైన జతలు గలవారివలన ఇది మెచ్చుకొనబడుతుంది. కూటములకు వచ్చి, వెళ్లుటకు రవాణా సౌకర్యమును ఏర్పరచుకొనునప్పుడు, లేక తాము యింటికి ఎప్పుడు తిరిగిరాగలరో సమయాన్ని చెప్పునప్పుడు, కూటములకు ముందు మరియు తరువాత సహవాసమునకు, సాహిత్యమును తీసుకొనుట మొదలైనవాటికి తీసుకొను సమయమును కలుపుకొని చెప్పుట చాలా మంచిది. కూటములను సమయానికి ప్రారంభించి సమయానికి ముగించుటయనునది విషయములను “క్రమముగాను మర్యాదగాను చేయుటకు” దోహదపడుననుటలో ఎట్టి సందేహము లేదు.—1 కొరిం. 14:40.